ప్రజల అజెండా …తమ అజెండా గా..
అనాధిగా అలుపెరగని పోరాటం చేస్తూ..
అనేక సమస్య,విమర్శలు మోస్తూ..
ప్రభుత్వ ఆదరణ ఉన్నా లేకున్నా ..
పార్టీలు తమ ప్రతాపం చూపుతున్నా..
తప్పుడు కేసులు పెడుతున్నా..
పథనమవుతున్న పాత్రికేయ విలువల కోసం..
దిగజారి పోతున్న విలువల పరిరక్షణ కోసం..
పట్టుకోల్పోతున్న ప్రజాస్వామ్యం కోసం ప్రాకులాడుతూ..
పుట్టెడు కష్టాలు పరిగెత్తిస్తుం టే..
ఎడిటర్స్ అంటే ఏమిటో తెలియజేయుటకు..
అందరూ కలిసి ఆత్మీయంగా కలుసుకునేందుకు..
విజయవాడ హనుమంతరాయ గ్రంధాలయంలో ..
రాష్ట్ర పత్రికా సంపాదకుల సంఘం ఆధ్వర్యంలో..
రండి… తరలిరండి అంటూ..
అన్ని సమస్యల పరిష్కారానికి..
హాజరు కానున్న ముఖ్య అతిథులు..
అట్టహాసంగా పత్రికా ప్రదర్శన..
ప్రజాభూమి ప్రతినిధి,విజయవాడ
పత్రికొక్కటున్న పదివేల సైన్యము, పత్రికొక్కటున్న మిత్రకోటి, ప్రజలకు రక్ష లేదు పత్రిక లేనిచో… ” అని చెప్పారు అనాటి పెద్దలు.ఎడిటరైనవాడు బిడియము చూపుచో ధాటి తగ్గు వృత్తి ధర్మమందు, కడుపుకూటి రాత కక్కుర్తి రాతరా’ అంటూ తోటి రచయితలనూ, భావి సంపాదకులనూ హెచ్చరించిన యోధులున్నారు.ముఖ్యంగా జర్నలిజం రంగంలోకి అడుగుపెట్టేవారు నిజాయతీగా, నిర్భీతిగా ఉండాలని కోరిన పాత్రికేయుడు నార్ల. “నిజము కప్పిపుచ్చి నీతిని విడనాడి స్వామి సేవ సేయు జర్నలిస్టు తార్చువాని కంటే తక్కువ వాడురా” అని కుండ బద్దలుగొట్టినట్లు చెప్పడం నార్లవారికే చెల్లింది. “ఏ ఎండకు ఆ గొడుగు పట్ట నేర్చినవాడు ఏమైనా కావచ్చునేమో కానీ, నిజమైన ఎడిటర్ కానేకాడు.” అని నిష్కర్షగా చెప్పేవారు నార్ల. ఆనాడు ఒక ఎడిటర్ కోసం పత్రికను స్థాపించి పత్రికా నైతికత విలువలు విశ్వసనీయత కోసం పాటుపడి పత్రికా ప్రమాణాలకోసం పాటుపడ్డారు.కానీ ఈ నాడు అందుకు భిన్నమైన విభిన్నమైన పరిస్థితి ఏర్పడింది. ప్రజాగొంతుకను తమ గొంతుక గా వినిపిస్తూ ప్రజల అజెండా ను తమ జెండాగా భుజాన వేసుకుని ప్రభుత్వ ఒత్తిడి పార్టీలతో ఆటుపోట్లు ఎదుర్కుంటూ పథనమవుతున్న పాత్రి కేయ వ్యవస్థ కొసం ప్రాకులాడుతున్న పత్రికా ఎడిటర్స్ కోసం అనేక పోరాటాలు చేసి పత్రికా ప్రమాణాల కోసం పుట్టిన ఏపిఎస్ఎస్ (ఆంధ్రప్రదేశ్ పత్రికా సంపాదకులు సంఘం) ఒక గొప్ప కార్యక్రమం నిర్వహించ తలపెట్టింది. అధ్యక్షుడు కుర్మా ప్రసాద్ బాబు, ప్రధాన కార్యదర్శి రామమోహన్ రెడ్డి ఇతర సీనియర్ పత్రికా ఎడిటర్స్ ల ఆధ్వర్యంలో రాష్ట్రంలో ఉన్న అన్ని పత్రిక ల ప్రదర్శన ,ఎడిటర్స్ ఆత్మీయ సమావేశం విజయవాడ హనుమంత రాయ గ్రంధాలయంలో నిర్వహించతలపెట్టారు.ఈ సమావేశం ప్రధానంగా అనాధిగా పత్రికా సంపాదకులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల అజెండానే కీలకం కానుంది. పత్రిక నిర్వహణ లో సుదీర్ఘ కాలంగా పాలక ప్రతిపక్ష పార్టీల నుండీ ఎదురవుతున్న ఎన్నో సమస్యలు అధిగమించడానికి ఎలా అన్నది చర్చకు రానుంది. అలాగే పథనమవుతున్న ,పత్రికా వ్యవస్థను ఎలా పరిరక్షించు కోవాలి…పట్టుకోల్పోతున్న ప్రజాస్వామ్య వ్యవస్థను గాడిలో పెట్టేందుకు పత్రిక ధర్మాన్ని నిర్వర్తించే విధానంలో ప్రాణాలు పొగిట్టుకుంటున్న కుటుంబాలకు ఆసరా గా ఉండాల్సిన తీరు తెన్నులు ఏమిటన్నది ఇక్కడ చర్చకు రానుంది. ముఖ్యంగా పొగడ్తలు కు పొంగిపోయి లోపాలు చూపితే లాఠీలను ఉసి గోలిపి ఉసురు తీస్తున్న విధానాలు కు అడ్డుకట్ట వేయుటకు పత్రిక ల పాత్ర ఏ విధంగా ఉండాలనేది ప్రధాన అంశం గా తీసుకోనున్నారు.పుట్టెడు కష్టాలతో పరుగులు పెడుతున్న పత్రికా ఎడిటర్స్ ప్రశాంతంగా ఉండాలంటే ఏమి చేయాలో నిర్ణయం తీసుకుని అందరి ఆమోదం ఐక్యత తో ముందుకు వెళ్లి భవిష్యత్ కార్యాచరణ కోసం ఆత్మీయ సమావేశం నిర్వహించి అందరి ఆలోచనలు పంచుకోవడానికి ఆహ్వానం పలుకుతోంది ఆంద్రప్రదేశ్ రాష్ట్ర సంపాదకులు సంఘం. ఈ కార్యక్రమానికి రాష్ట్ర సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి, ఎక్సైజ్ శాఖా మంత్రి కొల్లు రవీంద్ర ,సమాచార డైరెక్టర్ హిమాన్స్ శుక్లా,ఎన్టీఆర్ పోలీసు కమిషనర్ రాజశేఖర్ బాబు,విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మి, కలెక్టర్, జేసీ,ఇతర ప్రముఖులు హాజరు కానున్నారు.