బెంగళూరు రేవ్ పార్టీ పై పోలీసుల దర్యాప్తు ముమ్మరం చేశారు. బ్లడ్ శాంపిల్స్ లో డ్రగ్స్ పాజిటివ్ వచ్చిన వారికి బెంగళూరు పోలీసులు నోటీసులు పంపించారు.పాజిటివ్ వచ్చిన 86 మందికి నోటీసులు జారీ చేశారు. టాలీవుడ్ నటి హేమకు సైతం నోటీసులు జారీచేశారు క్రైమ్ బ్రాంచ్ పోలీసులు. మే 27న బెంగళూరు సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ కి పోలీసుల ముందు హాజరు కావాలని నోటీసులు జారీ చేశారు. ఇప్పటికే ఈ కేసులో ఐదుగురుని అరెస్ట్ చేశారు బెంగళూరు పోలీసులు.
మరో వైపు రేవ్ పార్టీ కేసులో జీఆర్ ఫామ్ హౌజ్ ఓనర్ గోపాల్ రెడ్డికి కూడా బెంగళూరు సీసీబీ పోలీసులు నోటీసులు జారీ చేశారు. మే 27న విచారణ అధికారి ముందు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేశారు. రేవ్ పార్టీలో డ్రగ్స్ తీసుకున్న వారిలో చిత్తూరు జిల్లా వాసులే ఎక్కువగా ఉన్నారని చెబుతున్నారు పోలీసులు.కేసులో A2అరుణ్ కుమార్, A4 రణధీర్ బాబు పేర్లను ఎఫ్ఐఆర్లో నమోదు చేసిన పోలీసులు.. రణధీర్ బాబు డెంటిస్ట్ గా చేస్తున్నట్లు గుర్తించారు. అరుణ్ కుమార్ రియల్ ఎస్టేట్ వ్యాపారిగా గుర్తించారు.