మానవత్వం చాటుతున్న మాచవరం సీఐ…
మృగాలతో కూడా కూర్చో బెట్టి మాట్లాడాలంటా ..
స్పందన కు స్పందించక చర్చలు జరపడం..
సీపీ ఏసీపీ సూచించిన చూసి చూడనట్లు..
సిపి పై కారుకూతలు కూసిన కనికరం చూపిస్తున్న వైనం..
రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం స్పందించిన ఈయన న్యాయ స్థానం వేరే
అనేక కేసులున్న అడవారిపై అసత్యాలు వ్రాసినా అంతా మాములే అంటుంటే ..
అందుకే ఆ లేడి పోలీస్ ఆత్మహత్య చేసుకోబోయిందా
కూటమి ప్రభుత్వం కొత్త చట్టాలు కొందరికేనా…
లేక ఈయన చట్టాలు వేరే ఉన్నాయా..
న్యాయం కావాలంటే కోర్టు కెళ్లాలని అంటుంటే..
సీపీ గారు సూచనలు కూడా సరి చూసుకోరా. .
అఫెన్స్ జరిగితే అప్పుడు ఆలోచన చేస్తారా..
తన్నుకు చస్తే తాఫీగా వస్తారా ..
ఫిర్యాదిస్తే పట్టించు కోకపోతే పొడుచుకు చస్తే చూస్తూ ఉంటారా..
అబద్దానికి అండ అన్యాయానికి పరాకాష్ట కాదా ..
ఆదిలోనే అరికట్టేందుకు అడ్డంకులే మిటీ..
ఈ అలసత్వం ఇంకెన్ని అన్యాయాలకు దారితీస్తుంది ..
బైన్దోవర్ కు మరింత భరోసా ఇస్తారా..
ఓ సీఐ సారు ఏమిటీ విచిత్రం…
ఎందుకిలా ఛిద్రం చేస్తారు…
(రామమోహన్ రెడ్డి, సంపాదకులు)
” మానవత్వం పరిమళించే మంచి మనసుకు స్వాగతంస్వాగతం స్వాగతంబ్రతుకు అర్ధం తెలియచేసిన మంచి మనిషికి స్వాగతం స్వాగతం స్వాగతంకారుమబ్బులు ఆవరించిన కటిక చీకటి జీవితంలోవెలుగులను ప్రసరింపచేసిన కాంతిమూర్తి స్వాగతంఅంతు తెలియని వేతనలతో అలమటించే ఆర్తజనులకుకొత్త ఊపిరి అందజేసిన స్నేహశీలి స్వాగతంపనికిరారని పారవేసిన మోడువారిన జీవితాలకుచిగురుటాశల దారి చూపిన మార్గదర్శి స్వాగతంమానవత్వం పరిమళించే మంచి మనసుకు స్వాగతంస్వాగతం స్వాగతంబ్రతుకు అర్ధం తెలియచేసిన మంచి మనిషికి స్వాగతం స్వాగతం స్వాగతం”ఈ పాట నేటి భారతం సినిమాలోనిది.దీని అర్థం పరమార్థం తెలిస్తే సగటు మనిషి జీవితం ఏమిటో అర్థ మవుతుంది. అయితే సరిగ్గా ఈ చరణాలను కించ పరిచే విదంగా సభ్య సమాజం తలదించుకునేలా నేటి పోలీస్ వ్యవస్థ లో కొంతమంది అధికారులు ఉండటం ఆయా ప్రాంత ప్రజలు చేసుకున్న దౌర్భాగ్యమని చెప్పాలి. ఎందుకిలా చెప్పవలసి వస్తుందంటే ప్రభుత్వం సమాజం లో జరిగే అతి క్రూరమైన సంఘటనలు పట్ల కఠినంగా వ్యవహరించమని సమాజ హితముకు హాని తలపెట్టే ఎంతటి వారినైనా చట్టానికి లోబడి ఉండేలా చూడాలని ముఖ్యమంత్రి నారా చంద్ర బాబు నాయుడు ప్రత్యేక చర్యలు చేపట్టాలని పదే పదే చెబుతూ పోలీసు వ్యవస్థ కు ప్రత్యేక అదేశాలు ఇవ్వడం జరిగింది. ఆ మేర డీజీపీ నగర పోలీస్ కమిషనర్ నిరంతర పర్యవేక్షణ చేస్తూ సంఘం లో అగౌరవం గా ప్రవర్తించే ఏ ఒక్కరిని ఉపేక్షించేది లేదని మొత్తుకుంటున్నారు కానీ మాచవరం పోలీసు స్టేషన్ లో సంఘటన సిగ్గు చేటు గా అనిపిస్తుంది. సమాజంలో ఎంతో కొంత విలువలు విశ్వసనీయత తో ఉంటూ పోలీసు వ్యవస్థ పై ఉన్న నమ్మకంతో భవానిపురం పోలీసు స్టేషన్ టార్గెట్ చేస్తూ సామాజిక మాధ్యమాల్లో నీచాతి నీచంగా కొన్ని పోస్టులు పెడుతుంటే ఓపౌరుడిగా స్పందించి నాటి సీపీ పిహెచ్ది రామకృష్ణ, నాటి వెస్ట్ డీసీపీ హరికృష్ణ లతో చర్చించగా సంబంధిత వ్యక్తులపై బైన్దోవర్ కేసులు నమోదు చేసి ఇక మీదట ఇలాంటి పునరావృతం అయితే తదుపరి చర్యలు గట్టిగా ఉంటాయని హెచ్చరికలు చేయడం జరిగింది.అది మనసులో పెట్టుకుని పగబట్టిన ఓ వర్గం లోని ఓ వ్యక్తి తనకు ఉన్న ఓ పేపర్ లో అడ్డగోలు రాతలు రాస్తూ ఆనాటి సీపీలని సైతం కించ పరిచేలా రాయడం జరిగింది. దానిపై పిర్యాదు చేసిన స్పందించలేదు. సదరు వ్యక్తి పై భవాని పురం పీస్ లో ఉన్న కేసులు కొన్ని మాత్రమే అవి ఎన్నో ఆవేవిమిటో తెలిస్తే ప్రజలు చీదరించుకుంటారు. ఆ వ్యక్తి ఇంకొక వ్యక్తి తో కలిసి సామాజిక మాధ్యమాల్లో సమాజం హర్శించని విదంగా పోస్టులు పెట్టడం తో పాటు ఓ పేపర్ ను మార్ఫింగ్ చేసి ఇతరులని రెచ్చగొట్టి వ్యక్తి గత దాడులు చేసుకునేలా ప్రేరేపించడం జరిగింది.అది చాలదన్నట్టు కుటంబములోని మహిళలు ను కూడా అతి నీచంగా కించ పరిచేలా పోస్టులు పెట్టడం జరిగింది. దీనిపై స్పందనలో పిర్యాదు ఇస్తే ఏసీపీ కి అటాచ్ చేస్తే ఆయన మాచవరం సిఐ కి బదిలీ చేసారు.పిర్యాదు చూసి ఎస్ సీఐ స్పందించి అమ్మో అయ్యో ఏమిటీ ఈ ఘోరం నేరం అని పైన చెప్పిన పాటలోని మాన వత్వం పరిమలించిన మూర్తి గా బిల్డఫ్ ఇచ్చాడు. తెల్లారింది సీన్ మారిపోయింది. శాంతి చర్చలు జరుపుకునెలా సెటిల్ మెంట్ కు ఆహ్వానించాడు.ఇదెక్కడి న్యాయమో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. అదేమయిన అలు మగల సమస్య కాదుగా శాంతి చర్చలు జరిపి ఆ కుటుంబములో శాంతిని నింపడానికి. అనేక నెరమయ ఆరోపణలు ఎదుర్కొంటూ బైన్దోవర్ కేసు నిబంధనలు ఉల్లగించి సిపి అదేశాలని భేఖాతార్ చేసి ఆడవాళ్లని అతి నీచమైన భాషతో ఒక కుటుంబం చిన్నా భిన్నం అయ్యేలా నీచమైన పోస్టులు పెట్టిన వారితో చర్చలు అంటే న్యాయం నడి వీధిలో అంగడి సరుకు అయ్యిందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఈ అధికారి తీరు చూసి. సాక్షాత్తు రాష్ట్ర ఉన్నత న్యాయ స్థానం సోషియల్ మీడియా పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసి పిటిషనర్ కు అపరాధ రుసుము విధించిన ఈ అధికారులు కు వేరే న్యాయ స్థానం ఉందా అన్న అనుమానాలకు దారి తీస్తున్నారు.అంటే సమాజంలో పొడుచుకు చస్తేనో.. లేక కొట్టుకు చస్తేనో చర్యలు తీసుకుంటామని అనే విదంగా ఈ సీఐ మాటల మర్మం ఉంటే ఇంకేమి ఈ అధికారులను ఇంకెమనాలో అర్థం కాని పరిస్థితి. ఈ అధికారుల తీరు చూసి పిర్యాదు దారులు ఏమి చేయాలో పై అధికారులే చెప్పాలి మరి.