Thursday, November 28, 2024

Creating liberating content

రాజకీయాలుఅయ్యో రామా..చంద్రా ఏమిటి ఇది

అయ్యో రామా..చంద్రా ఏమిటి ఇది

కనక దుర్గమ్మ కనకము పోయే…కేసులూ అయ్యే
పేదల బియ్యం పంది కొక్కులపాలు..
దొడ్డి దారిలో వెళ్తున్న రేషన్ బియ్యం…

పేరుకే పేదలకు వెళ్ళేది ఆపై అక్రమంగా రవాణా…
జోరుగా కొనసాగుతున్న రేషన్ అక్రమ రవాణా…
చోద్యం చూస్తున్న రెవెన్యూ అధికారులు
చేష్టలుడిగిన విజిలెన్స్..
ఎక్కడ ఉందో ఎన్ఫోర్స్ మెంట్
ఎందుకు ఈ నిర్లక్ష్యం…
ఏమి చేస్తున్నారు ఈ అధికారులు…
అడ్డదారీలో పంపిస్తే అడ్డరోడ్డులో పట్టుబడినే…
పీడీఎస్ …పీడీఎస్…
పీడీఎస్
పట్టుకునేదెవరు…
పటిష్ట చర్యలు తీసుకునేదెవరు…

(రామమోహన్ రెడ్డి,సంపాదకులు)
మానవత్వం మంట కలిసింది.కడుపు కాస్త అన్నము లేక అన్నామో రామచంద్ర అంటూ అలమటిస్తూ అల్లాడిపోయే పేద ప్రజలకు కాస్త ఊరట కల్పించే దిశగా నాడు అన్న నందమూరి తారకరామారావు కిలో రెండు రూపాయల బియ్యాన్ని పేద ప్రజలకు అందించారు ఎన్ని ప్రభుత్వాలు మారినా పేదలకు ఆందించే రేషన్ బియ్యం ఆపలేదు.కొన్ని ప్రభుత్వాలు బియ్యం రేటు పెంచిన తరువాత ప్రభుత్వాలు కిలో బియ్యం రెండు రూపాయలకే తెల్ల రేషన్ కార్డుదారులకు పంపిణీ చేస్తున్నారు. అయితే ఆ పేదల బియ్యం ఏళ్లతరబడి లబ్ధిదారుల నుండి కొనుగోలు చేసి ఇతర దేశాలకు అమ్ముకుని కోట్లు కూడబెట్టుకుని పబ్బం గడుపుకుంటున్నారు.ముక్యంగా ఉమ్మడి కృష్ణా, ఉమ్మడి గుంటూరు జిల్లాల్లో విచ్చలవిడిగా రేషన్ అక్రమ రవాణా చేస్తున్న పట్టించుకునే వారు లేకపోయారు.పేదల బియ్యాన్ని రూపాయి అసచూపి పేద ప్రజల నుండి కొనుగోలు చేసి రైస్ మిల్లు లో మెరుగులు దిద్ది లారీలకు లారీలు రవాణా చేస్తున్న రవాణా శాఖ అధికారులు చూడడం లేదు.సమాచారం ఇస్తేనే పోలీసులు పట్టుకుంటున్నారు.ఇక అసలైన వ్యవస్థ రెవెన్యూ శాఖ నిద్రమత్తులో ఉందనే చెప్పాలి. గతంలోఒక డీఎస్ ఓ కి నేరుగా సమాచారం ఇస్తే గాని అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్ బియ్యాన్ని సీజ్ చేయలేదు. అదే తరహాలో ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఒకవ్యాపారి ఓ పెద్ద మాఫీయానే నడువుతున్నాడు.ఆ సామ్రాజ్యంలో అడుగుపెట్టాలంటే అన్నిటి మీద ఆశ వదులుకుని వెళ్ళాలి. ఒక వేల వెళితే ఆయన ఇచ్చిన చిల్లర చేత భూని రావాల్సిందే. లేదంటే దాడులు చేయడం,పొరపాటున రాత్రి వేలల్లో వెళితే ఇక అంతే నని ఆ నోట ఈ నోట వినిపిస్తున్నా పట్టించు కునేవారు లేకపోయారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో ఉన్న ఫుడ్ కమిషన్ చైర్మన్ కు ఆధారాలు ఇచ్చిన అక్క ఆరాటం తప్ప భావ బ్రతుకు లేదన్న చందానా పరిస్థితి తయారైంది.ఇక పోతే ఎన్ఠీఆర్ కమిషనరేట్ పరిధిలో అక్రమరేషన్ తరలించే లారీలను సీజ్ చేస్తూనే ఉన్నారు.పగలు రాత్రి లేకుండా అక్రమ రవాణా చేస్తుంటే ఇబ్రహీంపట్నం అడ్డదారిలో లారీలు తిరుగుతూ నే ఉన్నాయి.ఏదో నామమాత్రంగా తనీఖీలు చేసి పట్టుకుంటున్నట్లు గుస గుసలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఉమ్మడి కృష్ణా జిల్లాలో వీరులపాడు మండలం, నందిగామ, జగ్గయ్యపేట, విస్సన్నపేట ,మైలవరం, తిరువూరు,లింగాల ప్రాంతాల్లో విరివిగా రేషన్ అక్రమ రవాణా చేస్తున్నట్లు బహిరంగంగా నే తెలుస్తుంది.ఇక ఉమ్మడి గుంటూరు జిల్లాలో కూడా పిడుగురాళ్ల, నరసరావుపేట, చిలకలూరిపేట, గుంటూరు ,వినుకొండ ,పల్నాడుతో పాటు ఇతర ప్రాంతాల్లో విచ్చలవిడిగా రేషన్ అక్రమ రవాణా జరుగుతున్నట్లు సమాచారం ఉన్నా సంబంధిత అధికారులు చోద్యం చూస్తూ ఉన్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఇబ్రహీంపట్నం పట్నం లో ఆదివారం పట్టపగలే రెండు లారీలు దాదాపు 70 క్వింటాలు రేషన్ బియ్యం ఉన్నట్టు గుర్తించి పోలీసులు సీజ్ చేశారు.అయితే ఈ పట్టుబడిన లారీలు తిరువూరు మైలవరం నూజివీడు ప్రాంతాల్లో ఏళ్లతరబడి రేషన్ దందా నిర్వహిస్తున్న బడాస్మగ్లర్ లకు చెందినవని తెలుస్తోంది. ఈ రేషన్ బియ్యం అక్రమరవాణా చేసే ఒక వ్యక్తి విజయవాడలో స్థిర పడి నూజివీడు, తిరువూరు, మైలవరం,కంచికచర్ల ప్రాంతాల్లో టీమ్ లు పెట్టుకుని ఎంతో కాలంగా ఈ రేషన్ దందా నిర్వహిస్తున్నట్లు విశ్వసనీయసమాచారం.ఇక పోతే లింగాల గ్రామంలో ఓ పేద రేషన్ మాఫీయా ఉన్నట్లే సమాచారం. ప్రధాన రహదారి ప్రక్కనే అనేక లారీలు ఉండి వాటిలో రేషన్ బియ్యం ఉన్నట్లు కూడా సమాచారం. ఇక వీరులపాడు పరిధిలో అయితే పుష్ప 12345 సినిమా కు మించి రేషన్ దందా నిర్వహిస్తున్న రని అక్కడి ప్రజలు చర్చించుకుంటున్నారు. ప్రతి నెల 20వతేది నుండి ఒకటో తేదీవరకు ప్రభుత్వం రేషన్ పేదలకు పంపిణీ నిమిత్తం డీలర్లకు చేరిస్తే ఆ తరువాత ఒకటో తేదీ నుండి పదిహేను ఇరవై తేదీ వరకు రేషన్ మాఫీయా వారు తరలింపు చేస్తుంటారని తెలుస్తోంది. రోజుకు ఒక్కో ప్రాంతాన్ని నుంచి పదుల సంఖ్యలో లారీలలో రేషన్ బియ్యం తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ అక్రమ వ్యాపారం ఏ ప్రభుత్వం ఉన్నా ఆయా పార్టీ నేతల అండదండలతోనే జరుగుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. ఇలా అయితే ప్రబుత్వ లక్ష్యం ఏ విధంగా నెరవేరుతుందో చూడాలి… ఈ అక్ర మార్కులను తుదమొట్టిస్తారో లేదో అంటే వేచిచూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article