పులివెందుల టౌన్
కార్తీక పౌర్ణమి వేళ శైవక్షేత్రాలు దేదీప్యమానంగా ప్రకాశించాయి. శివాలయాలపై దివ్యలు వెలిగించి భక్తులు పరవశించారు. కార్తీకమాసం పురస్కరించుకుని శివాలయాలలో భక్తులు పోటెత్తారు. వేకువ జామున నుంచి శివయ్య దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. శివనామ స్మరణంతో శివాలయాలు మారు మ్రోగాయి. కార్తీక మాసంలో పౌర్ణమి రోజున ప్రత్యేకత ఉంటుంది. సూర్యోదయానికి ముందు సూర్య అస్తమయం తర్వాత శివాలయాలపై దీపాలను వెలిగించడం ఆనవాయితీగా వస్తోంది. ప్రాచీన కాలం నాటి ఈ సంప్రదాయాలు నేటికీ భక్తులు భక్తిశ్రద్ధలతో కొనసాగిస్తున్నారు. ఈ క్రమములో పట్టణ పరిధిలోని శ్రీ మిట్ట మల్లేశ్వర ఆలయం, మండల పరిధిలోని కోన గవేశ్వర స్వామి ఆలయం, పంచలింగాల కోన, అలాగే కణంపల్లి సమీపంలోని శ్రీ సిద్ధ లింగేశ్వర స్వామి ఆలయం, వేముల మండలం నల్లచెరువుపల్లి సమీపాన మోహనగిరిపై వెలసిన భైర క్షేత్రం, లింగాల మండలం పార్నపల్లి సమీపంలోని కోన మల్లేశ్వరాలయం, వేంపల్లి పంచాయతీ పరిధిలోని గవి మల్లేశ్వరాలయం, సింహాద్రిపురం మండలం రావుల కొలను పంచాయితీ పరిధిలోని శ్రీ భాను కోట సోమేశ్వర స్వామి క్షేత్రం, తొండూరు మండల పరిధిలోని కన్యకచెలిమి, దేవరకోన, చక్రాయపేట మండలం గండిక్షేత్రంలో వెలిసిన శివాలయం పైతర ఆలయాలల్లో భక్తుల కనిపించింది.
కార్తీక పౌర్ణమికి ప్రత్యేకత
కార్తీక పౌర్ణమికి ప్రత్యేక పురాతన చరిత్ర ఉంది. పూర్వము తారకాసురుడు అను రాక్షసుడు ప్రజలను బాధించేవాడు. ఇలా ప్రజలను హింసిస్తున్నారన్న విషయం తెలుసుకున్న కార్తికేయుడు ఒకసారి తారకాసురుడిపై యుద్ధం ప్రకటిస్తాడు. ఈ యుద్ధంలో కార్తీక మాసంలో పౌర్ణమి రోజున తారకాసురుడిని కార్తికేయుడు సంహరిస్తాడు. ప్రజలను హింసిస్తున్నారన్న విషయం తెలుసుకున్న కార్తికేయుడు ఒకసారి తారకాసురుడిపై యుద్ధం ప్రకటిస్తాడు. ఈ యుద్ధంలో కార్తీక మాసంలో పౌర్ణమి రోజున తారకాసురుడిని కార్తికేయుడు సంహరిస్తాడు. ప్రజలను హింసించిన తారకాసురుడు అంతమయ్యాడని భావించి అదే రోజున దీపాలు వెలిగించి సంబరాలు జరుపుకున్నట్లు పురాణాలు చెబుతున్నాయి. అదే రోజున శివుడు తాండవమాడినట్లు కథ వాడుకలో ఉంది. పరిణామ క్రమంలో కార్తీక పౌర్ణమి రోజున తారకాసురుడు సంపబడటం అదే రోజున శివాలయాలపై ఇళ్లపై దీపాలు వెలిగించడం జరిగింది. సనాతన ధర్మం ప్రకారం నేటికీ కార్తీక పౌర్ణమి రోజున భక్తులు శివాలయాలపై చిరుదివ్యలు వెలిగించడం చారిత్రక సంప్రదాయాలకు నిలువెత్తు దర్పణం పడుతోంది. పురాతన కాలం నుంచి వస్తున్న ఈ సంప్రదాయాలను కలకాలం ఇలాగే కొనసాగిద్దాం.