Thursday, November 28, 2024

Creating liberating content

రాజకీయాలుఓరి మీ కామం తగలెయ్యా..

ఓరి మీ కామం తగలెయ్యా..

మీ కోర్కెలు తీర్చుకొనేందుకేనా ఓట్లు వేసింది..
మీరేమి చట్టాలు చేస్తారు రా అయ్యా…
మీలాంటి వాళ్ళు శాసనాలు చేస్తారా …చుక్కలు కార్చుకుంటారా…
మీది ప్రజాసేవేనా…పవళింలు సేవనా…
చీ మీ బ్రతుకులు తగలెయ్యా…
ప్రజలు కోర్కెలు తీర్చండి రా బాబు అంటే…
మీ కామ కోర్కెలు తీర్చుకుంటారా…
తూ సిగ్గు లేని జన్మ…మీకోక నీతీ…
తప్పుడు పనులు చేసి ఆ తప్పు ఇతరుల పై తోయడం…
మీరంతా పూర్వాశ్రమం నుంచి వచ్చిన వారే కదా…
ఒకడు గంట, ఇంకోకడు అరగంట
నా బిడ్డకు తండ్రేవరు అనే సినిమా ఇంకొకరిది,
వృధ్యాప్యం లో ఊహు .. అని ఒకరు..
ఒకడు అన్నీ తీసేస్తే ఇంకొకడు జిప్పు తీస్తే…
ఇంకొకడు దువ్వెనతో దువ్వితే …
ఇప్పుడేమో హొటల్లో లీలలు..
ఓ వైపు వరదలతో ప్రాణాలు పోతుంటే ..
నీకు పవళింపు కావాల్సి వచ్చింది…
ఇందుకేరా అయ్యా నాడు నక్షలిజం ఉన్నది…
ఇప్పుడు లేదని సంతో షించాలో ..ఉంటే బాగుండని ఆలోచించాలో .
మీకు కాదు బుద్ధి లేనిది ప్రజలకే..
మీరు మీవల్లమాలిన మాటలు..
(రామమోహన్ రెడ్డి, సంపాదకులు)
“అవును నిజం అవును నిజం అవును నిజం నీవన్నది..నీవన్నది నీవన్నది నీవన్నది, నిజం నిజం…లేదు సుఖం లేదు సుఖం లేదు సుఖం జగత్తులో..బ్రతుకు వృధా చదువు వృధా కవిత వృధా, వృధా వృధా…మనమంతా బానిసలం గానుగులం పీనుగులం..వెనుక దగా ముందు దగా, కుడి ఎడమల దగా దగా…మనదీ ఒక బ్రతుకేనా కుక్కల వలె నక్కల వలె..మనదీ ఒక బ్రతుకేనా సందులలో పందుల వలె…నిజం సుమీ నిజం సుమీ, నీవన్నది నిజం సుమీ..బ్రతుకు చాయ చదువు మాయ, కవిత కరక్కాయ సుమీ…లేదు సుఖం లేదు సుఖం చెడు విషం జీవి ఫలం..జీవి ఫలం చెడు విషం చెడు విషం చెడు విషం…అవును నిజం అవును సుమా అవును నిజం నీవన్నది..నీవన్నది నీవన్నది నీవన్నది, నిజం నిజం…”మహాప్రస్థానం లో శ్రీశ్రీ గారు చెప్పి వక్కానించిన విధంగా… నేటి రాజకీయ నాయకుల స్థితిగతులు చూస్తే సభ్య సమాజం సిగ్గుతో తలదించుకొంటుంది. అసలు వీరు ప్రజాసేవకులేనా లేక నయవంచుకులా లేక పవళింపూసేవకోసమే పుట్టరా…బురదలో పంది లాగా అన్న విపరీత అర్దాలకు దారితీస్తోంది.ఎటు పోతుంది ఈ సమాజం.బావిభారత పౌరులకు బంగారు బాట వేయడానికి వీరు అర్హులా..ఇలాంటి కామ పిశాచులతో యువత భవిష్య త్ బాగుపడుతుందా అన్న అనుమానాలు కలుగుతున్నాయి.ఇందుకే కాబోలు అడవుల్లో అన్నలు ఉండి ఇలాంటి దున్నల దురాఘతాలను మట్టుబెట్టేది అన్న ఆలోచన ఇప్పుడిప్పుడే ఉత్పన్నమవుతోంది.నా డేందుకు వారిని తప్పుబట్టారో తెలియడం లేదు.ఆనాడు అన్నలు కూడా కామంతో కళ్ళుమూసుకుని.పోయి మదమెక్కిన మదపుటెనుగుల వలె మానవత్వం మరిచి తమ మధాన్ని తగ్గించు కునేందుకు చేస్తున్న దురాఘాతాలపై దండెత్తి మట్టుపెట్టారు.కానీ నేడు అలా జరగడం లేదే. కళ్ళకు కట్టినట్లు ఈ కామాంధుడి లీలలు కనిపిస్తున్న కండువా మార్చిన కూర్చివేసిన పార్టీ పై కారుకుతలు కూస్తుంటే ఇంకెమనాలో అవగతం అవుతుందా ఈ ప్రజాస్వామ్య వాదులకు.తండ్రి మరణం తరువాత రాజన్న పాలన కోసం రేయింబవళ్లు తిరిగి రెక్కల కష్టం తో ప్రభుత్వాన్ని స్థాపిస్తే ఒకడు అరగంట ఇంకొకడు గంట ఇంకొకడు అయితే అన్నీ విప్పేసి చిందులు వేస్తే ఇలా చూసిన ప్రజానీకం తూ మీ బ్రతుకులు చెడ అని చెంప చెళ్లుమనిపించారు. ఆయిన తప్పు మీది కాదురా అయ్యా…మీ నాయకుడిది.. మీకు స్వేచ్ఛఇచ్చి ఏసీ గదుల్లో ఉంచితే ఏమవుతుంది తిన్నది అరగక ఆంబోతుల్లా వీదికెక్కారు. వాలంటర్ వ్యవస్థ తెచ్చి గ్రామ సచివాలయాల ద్వారా ప్రజలకు నేరుగా లబ్ది కలిగించే విధానం పాలన ఇచ్చి మిమ్మల్ని మీ ప్రాంతాల్లో ఉన్న వనరులు ఏమైనా దోచు కోమని చెబితే మీకు ఉల్లాసం ఎక్కువై అధికార మదం పట్టి కండువా మార్చిన కడుపులో ఉన్న అవినీతి దరిద్రపు ఆలోచనలు ఎక్కడికి పోతాయి.అదే ఆలోచన ఉంది కాబట్టి ఓ మహిళ పట్ల అమానుషంగా ప్రవర్తించినట్లు ఆమె గోడు వెల్లబొసుకుంటే నేను కాదంటే ఎలా ఆధిమూలమా.అన్నీ అనర్థాలకు ఆదిములమే అని అన్ని సాక్ష్యదారాలు ఇస్తే సాకులు చెబితే ఎలా ఆధిమూలమా…ఆలోచించు నీవే…అందుకే గా నిన్ను నీ పార్టీ సస్పెండ్ చేసింది. ఏముంది లే నిన్ను సస్పెండ్ చేసినా పదవి పోదు…ఫ్రీగా పబ్లిసిటీ వచ్చింది.చూడు ఒకాయన మీద నా పిల్లోడికి తండ్రి మీరే అని ప్రచారం చేస్తే ఏమయింది అబ్బా ఈ వయస్సులో కూడా ఊహు నా అని పెద్ద పేరు వచ్చింది. మనుషులను ముక్కలు చేసి డోర్ డెలివరీ ఇచ్చిన వ్యక్తి ఫ్యాన్ట్ జిప్పు తీసి చూపిస్తే ఎంత పబ్లిసిటీ వచ్చింది. ఇంత పబ్లిసిటీ కావలంటే ఎన్ని కోట్లు ఖర్చు చేయాలి ..కదా ..కాకపోతే సిగ్గు ఎగ్గు మానం అభిమానం వదిలెయ్యాలి అంతే ..ఆ ఇవన్నీ కోర్టులలో నిలబడి శిక్షలు పడేది లేదు…దేశ రాజధాని ఢిల్లీ నడి వీధిలో జరిగిన నిర్భయ ఘటన ఏమయ్యింది.అంతే ప్రజాస్వామ్య దేశంలో ప్రజలు నాలుగు రోజులు చర్చించు కుంటారు ఐదో రోజు మర్చి పోతారు అంతే… మనది ప్రజాస్వామ్య దేశం.ఎన్ని పరువు తక్కువ పనులైన చేయచ్చు అధిమూలం.దువ్వడా దువ్వెన చూడు నేరుగా భయం ,బెదరు లేకుండా ఎలా చెప్పిందో ఇది అంతే… ఇదిరా అయ్యా ఈ దేశ ప్రజలు చేసుకున్న దౌర్భాగ్యము.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article