-లోకేష్ బ్యాక్ డోర్ పొలిటిషన్
-సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉన్న కలిగిన కుటుంబం నాది
-చంద్రబాబు గురించి కుటుంబ సభ్యులంతా ఏమన్నారో లోకేష్ కి తెలుసా?
-జగన్మోహన్ రెడ్డి కుటుంబం గురించి మాట్లాడే హక్కు లేదు
-లోకేష్ మంత్రి అయ్యి ..ఎమ్మెల్సీ అయ్యాడు..
-నేను ఎమ్మెల్యేగా గెలిచి మంత్రినయ్యాను
-మంత్రిగా నాకు అతనికి పోలిక ఏమిటి?
-పరిశ్రమలు తెచ్చింది మేము.. డబ్బులు దండుకున్నది తండ్రి..కొడుకులు
-నోరు అదుపులో పెట్టుకోకపోతే తీవ్ర పరిణామాలు తప్పవు
-లోకేష్ పై తీవ్రంగా విరుచుకుపడిన మంత్రి అమర్నాథ్
గాజువాక:తన తప్పులు తాను తెలుసుకోకుండా, తన తండ్రి రాష్ట్రానికి చేసిన అన్యాయాన్ని గురించి చేసిన అన్యాయం గురించి ఆలోచించకుండా, రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధికి సంబంధించిన వాస్తవాలు తెలుసుకోకుండా తనపైన, ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కుటుంబంపైన టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లోకేష్ చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ తీవ్రంగా ధ్వజమెత్తారు. సోమవారం అనకాపల్లి లో జరిగిన టిడిపి శంఖారావం సభలో లోకేష్, మంత్రి అమర్నాథ్కు కోడిగుడ్డు గిఫ్టుగా ఇస్తున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిపై తీవ్రంగా స్పందించిన మంత్రి అమర్నాథ్ లోకేష్ కు మట్టికుండలో ముద్ద పప్పు వండి లోకేష్ కు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు. దీనిని లోకేష్ కి పంపిస్తామని ఆయన వచ్చిన ఆయన వచ్చి తీసుకున్నా అభ్యంతరం లేదని మంత్రి చెప్పుకొచ్చారు. స్థానిక సర్క్యూట్ హౌస్ లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో లోకేష్ కోసం సిద్ధం చేసిన ముద్దపప్పు కుండను మంత్రి అమర్నాథ్ ప్రదర్శించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎవరైనా గిఫ్ట్ ఇస్తే రిటర్న్ గిఫ్ట్ ఇవ్వటం ఉత్తరాంధ్ర ప్రజల సంప్రదాయమని, మింది గ్రామంలోని కుమ్మరులు మట్టికుండలో లోకేష్ కు ఇష్టమైన ముద్దపప్పును తయారుచేసి ఆయనకు పంపిస్తున్నామని చెప్పారు. ఉత్తరాంధ్రను ఏమాత్రం అభివృద్ధి చేయకుండా వదిలేసిన ఈ తండ్రి కొడుకులు సిగ్గు..లజ్జ లేకుండా ఈ ప్రాంతానికి వచ్చి తమపై విమర్శలు చేయటం విడ్డూరంగా ఉందని, వారికి సిగ్గు వచ్చేందుకే ఈ పప్పులో ఉప్పు, కారం కలిపామని మంత్రి అమర్నాథ్ చెప్పారు. తాను ఈ రాష్ట్రం పరువు తీశానని, మంత్రిగా ఏమీ సాధించలేదంటూ లోకేష్ చేసిన వ్యాఖ్యలను అమర్నాథ్ తీవ్రంగా తిప్పి కొట్టారు. లోకేష్ వాళ్ళ నాన్న చంద్రబాబు తమ కింద ఉన్న మచ్చలు చూసుకోకుండా తమను తమ పార్టీని విమర్శిస్తున్నారని, తను లోకేష్ లా బ్యాక్ డోర్ పొలిటిషన్ ను కాదని, ఆయన మంత్రి అయ్యాక ఎమ్మెల్సీ అయ్యాడని, ఆ తర్వాత ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయాడని తాను ఎమ్మెల్యే అయ్యాక మంత్రిని అయ్యానని, తనకు, లోకేష్ కు పోలిక ఏంటని అమర్నాథ్ ప్రశ్నించారు.
45 సంవత్సరాల రాజకీయ చరిత్ర మా కుటుంబానికి ఉంది. నా తాత, తండ్రి దగ్గర నుంచి నా కుటుంబమంతా మింది గ్రామంలోనే మా తాత కట్టిన ఇంట్లోనే ఉంటోందని మంత్రి అమర్నాథ్ చెప్పారు. లోకేష్ ఎక్కడ పుట్టాడు? వాళ్ళ నాన్న ఎక్కడ పుట్టాడు? ప్రస్తుతం ఆయన ఉంటున్నది ఎక్కడ? చంద్రబాబు నాయుడు సంపాదించిన అక్రమార్జనతో నిర్మించిన ప్యాలెస్ లో లోకేష్ ఉంటున్నాడు. మీరు చేసిన అవినీతి, అక్రమాలు, అన్యాయాలను గురించి మర్చిపోయి మాపై విమర్శలు చేయడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని మంత్రి అమర్నాథ్ చెప్పారు. అనకాపల్లిలో జరిగే అభివృద్ధి గురించి మాట్లాడకుండా, 420 గాళ్లను, గంజాయి డాన్లను, వైజాగ్ వీరప్పన్ లను పక్కన కూర్చోబెట్టుకుని మాట్లాడకుండా, జరిగిన అభివృద్ధి గురించి తెలుసుకోవాలని సూచించారు. అనకాపల్లి ని జిల్లా కేంద్రంగా అభివృద్ధి చేసింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఈ విషయం లోకేష్ పక్కన కూర్చున్న బంట్రోతులకు తెలియదా? అని అమర్నాథ్ ప్రశ్నించారు. నీ తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నీ పక్కన కూర్చున్న ఒక వ్యక్తిపై 420 కేసు పెట్టిన విషయం నీకు తెలుసా? అని లొకేషన్ అమర్నాథ్ ప్రశ్నించారు.
ఇక తాను అవినీతి కార్యకలాపాలకు పాల్పడుతున్నానని, విస్సన్నపేట భూములను ఆక్రమించుకున్నానని లోకేష్ చేసిన వ్యాఖ్యలను మంత్రి అమర్నాథ్ తీవ్రంగా ఖండించారు. విస్సన్నపేటలో ఒక్క సెంటు భూమైన నా పేరున ఉంటే రాజకీయాలను వదులుకుంటారని అమర్నాథ్ సవాల్ విసిరారు. విస్సన్నపేట భూముల విషయంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందంటూ పవన్ కళ్యాణ్ వెళ్లి రోజంతా అక్కడే ఉండి ఏం సాధించారని అమర్నాథ్ ప్రశ్నించారు.
14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు ఏనాడైనా ఉత్తరాంధ్ర ప్రాంతంలో పోర్టు నిర్మించాలని భావించారా? తాను మంత్రిగా ఉన్నప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా మూలపేట పోర్టుకు శంకుస్థాపన విషయం ఈ పప్పు ముద్దకి తెలియకపోవడం దురదృష్టకరం అని అమర్నాథ్ హెచ్చరించారు. ఉద్దానంలో కిడ్నీ రీసెర్చ్ సెంటర్, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఎకహోమా టైర్ల కంపెనీ, గ్రీన్ హైడ్రోజన్ హబ్బులు ఏర్పాటు చేసిన ఘనత తమదేనని ఈ నోరు తిరగని నాయకుడికి తెలుసా? అని అమర్నాథ్ ప్రశ్నించారు. అంతేకాదు ప్రతి కంపెనీలో స్థానికంగా ఉన్నవారికి 75% ఉద్యోగాలు ఇవ్వాలని చట్టం తీసుకొచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డిది అని, మీ హయాంలో ఎప్పుడైనా ఇటువంటి ఆలోచన చేశారా? అని ఆయన ప్రశ్నించారు. లోకేష్ ఐ.టీ మంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రంలో 900 కోట్ల రూపాయల ఐ.టి ఎగుమతులు జరిగితే తాము అధికారంలోకి వచ్చాక రాష్ట్రం నుంచి 2500 కోట్ల రూపాయల ఐ.టి ఎగుమతులు జరిగాయని అమర్నాథ్ స్పష్టం చేశారు. విశాఖలో ఇన్ఫోసిస్ తో సహా 250 ఐటి కంపెనీలను నెలకొల్పామని మంత్రి అమర్నాథ్ చెప్పారు. 2017లో లోకేష్ విశాఖలో మాట్లాడుతూ విశాఖలో ఐటీ కంపెనీల ఏర్పాటుకు అనువైన పరిస్థితులు లేవని చెప్పిన విషయాన్ని మంత్రి అమర్నాథ్ ఈ సందర్భంగా గుర్తు చేశారు.
ఇదిలా ఉండగా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై లోకేష్ చేసిన వ్యాఖ్యలను అమర్నాథ్ తీవ్రంగా పరిగణించారు. జగన్మోహన్ రెడ్డి తన కుటుంబ సభ్యులను చూసుకోవడం లేదంటూ లోకేష్ చేసిన వ్యాఖ్యలపై అమలా స్పందిస్తూ.. ఎన్టీఆర్ నీ తండ్రి చంద్రబాబు నాయుడు గురించి ఏమన్నారో తెలుసా? లక్ష్మీపార్వతి, హరికృష్ణ నీతండ్రిపై చేసిన వ్యాఖ్యల గురించి నీకు తెలుసా ?దగ్గుబాటి వెంకటేశ్వరరావు తను రాసిన పుస్తకంలో మీ నాన్న గురించి ఏం రాశారో నీకు తెలుసా? అంతెందుకు నువ్వు ఎంతగానో ప్రేమిస్తున్న పవన్ కళ్యాణ్ మీ నాన్న గురించి ఏం చెప్పారో గుర్తుందా? ? ఇవేవీ తెలుసుకోకుండా జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడటం సరికాదని మంత్రి అమర్నాథ్, లోకేష్ ను హెచ్చరించారు. పురందరేశ్వరిని కేంద్ర మంత్రిగా చేసిన ఘనత రాజశేఖర్ రెడ్డిది అన్న విషయాన్ని లోకేష్ గుర్తించాలని అమర్నాథ్ సూచించారు.
అవాస్తవాలను వాస్తవాలుగా చిత్రీకరించేందుకు లోకేష్, చంద్రబాబు నాయుడు బృందం చేస్తున్న కుయుక్తులను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని ఇప్పటికైనా నోరు దగ్గర పట్టుకుని మాట్లాడకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని మంత్రి అమర్నాథ్ హెచ్చరించారు.