Monday, January 20, 2025

Creating liberating content

రాజకీయాలుపోలీస్ అంటే…ఇదేనా…?

పోలీస్ అంటే…ఇదేనా…?

ప్రజలంటే అంత చులకనగా చూస్తారా..
మరి ఫ్రెండ్లీ పోలీస్ అంటే అర్థమేమిటీ
మీకు ఆమ్యామ్య ఇచ్చేవారేనా ప్రెండ్స్
పచ్చనోటు ఇస్తే అంతా ఫ్రెండ్లీ నే. .
పరువుపోతుంది అంటే పట్టదు
మీ పరువుకోసం మాత్రం ప్రాకులాడుతారా..
మీ వ్యవస్థ కు ఇబ్బంది అయితే చట్టాలు గుర్తొస్తాయా
ఆడపిల్ల మానం పోతుందుంటే ఆకతాయిగా ఉంటారా ..
మగవాడి పరువుపోతున్నా పట్టించుకోరులే..
పలుకుబడి ఉంటే అబ్బో వీరి వేషాలు మాములు కాదులే ..
వారికి నచ్చితే క్రిమినల్స్ తో కూడా కూర్చోబెట్టి రాజీ జేస్తారు…
సీపీ,sp, ఏసీపీ లు చెప్పినా ఆ సొల్లు లే అంటారనుకో..
స్పందనకు స్పందించే వారు కొందరే …
ఆ కొందరి వల్లే కొన్ని సంఘటనలు అగుతున్నాయనుకో ..
ఇంకొందరి వల్ల చంపుకు చస్తున్నారనుకో..
వీరు మారరు… వారు ఆగరు…

(రామమోహన్ రెడ్డి,సంపాదకులు)
శాంతి భద్రతలను సంరక్షిస్తూ, ప్రజల జీవితాలకు, ఆస్తులకూ రక్షణ కల్పిస్తూ, నేరాలు, విధ్వంసాలూ జరక్కుండా కాపాడేందుకు ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన వ్యవస్థ పోలీసు.శాంతిభద్రతలను కాపాడటం, పౌరులను, వారి ఆస్తులను రక్షించడం, నేరాలను నిరోధించడం, దర్యాప్తు చేయడం, వారి అధికార పరిధిలో చట్టాలు, నిబంధనలను అమలు చేయడం వంటివి పోలీసుల బాధ్యత. వారు స్థానిక, ప్రాంతీయ లేదా జాతీయ పోలీసు బలగాలు వంటి ప్రభుత్వ సంస్థలు లేదా విభాగాల కోసం పని చేస్తారు, పోలీసు అధికారులు సాధారణంగా ఆత్మరక్షణ, తుపాకీలను ఉపయోగించడం, అరెస్టు విధానాలు, ట్రాఫిక్ నియంత్రణ, గుంపు నియంత్రణ, అత్యవసర ప్రతిస్పందన, ప్రథమ చికిత్స వంటి వివిధ నైపుణ్యాలలో శిక్షణ పొందుతారు.భద్రతను పరిశీలిస్తున్న పోలీస్వారి విధుల్లో తరచుగా కేటాయించిన ప్రాంతాలలో పెట్రోలింగ్, అత్యవసర కాల్‌లు, సంఘటనలకు ప్రతిస్పందించడం, నేరాలను పరిశోధించడం, అనుమానితులను ఇంటర్వ్యూ చేయడం, సాక్ష్యాలను సేకరించడం, అరెస్టులు చేయడం, కోర్టులో సాక్ష్యమివ్వడం, ఇతర చట్టాన్ని అమలు చేసే సంస్థలు, సిబ్బందితో కలిసి పనిచేయడం వంటివి ఉంటాయి. పోలీసులు భారత రాజ్యాంగానికి నమ్మకమైన విధేయతను కలిగి ఉండాలి.అది హామీ ఇచ్చిన పౌరుల హక్కులను గౌరవించాలి సమర్థించాలి.సక్రమంగా రూపొందించబడిన ఏ చట్టం యొక్క ఔచిత్యాన్ని లేదా అవసరాన్ని పోలీసులు ప్రశ్నించకూడదు. దయ, ద్వేషం లేదా ప్రతీకారానికి భయపడకుండా, చట్టాన్ని పటిష్టంగా, నిష్పక్షపాతంగా అమలు చేయాలి.కానీ ఇక్కడ కొంతమంది తప్పుడు,నిర్లక్ష్య అధికారులు వల్ల నీతి లేని పనులు జరుగుతున్నా నియంత్రించలేక పోతున్నారు.పోలీసులు తమ అధికారాలు విధుల పరిమితులను గుర్తించి గౌరవించాలి. న్యాయవ్యవస్థ యొక్క విధులను ఆక్రమించకూడదు వ్యక్తులపై ప్రతీకారం తీర్చుకోవడానికి దోషులను శిక్షించడానికి కేసులపై తీర్పులో కూర్చోకూడదు.చట్టాన్ని పాటించడంలో , క్రమాన్ని కాపాడుకోవడంలో, పోలీసులు ఆచరణ సాధ్యమైనంత వరకు, ఒప్పించడం, సలహాలు సూచనలు , హెచ్చరిక పద్ధతులను ఉపయోగించాలి. బలప్రయోగం అనివార్యమైనప్పుడు, పరిస్థితులలో అవసరమైన కనీస శక్తిని మాత్రమే ఉపయోగించాలి.అయితే ఇక్కడ చెప్పబడుతున్న విదంగా కొంతమంది కింది స్థాయి అధికారులు నేరస్తులకు అండగా ఉంటూ నేరమయ సంఘటన లకు పాల్పడుతున్న వారికి అండగా లేక పోయినా అలసత్వం వహించడం వలన శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుంది.నేరాన్ని నిరోధించడం పోలీసుల ప్రధాన కర్తవ్యం,. వారి సామర్థ్యానికి పరీక్ష రెండూ లేకపోవడమే తప్ప వారితో వ్యవహరించడంలో పోలీసు చర్యకు కనిపించే సాక్ష్యం కాదని పోలీసులు గుర్తించాలి. ఈ రాష్ట్రంలో అనేక మంది పోలీసులు తమ కర్తవ్యాన్ని విస్మరిస్తున్నారు.సాధారణంగా ప్రతి పౌరుడిపై విధిగా నిర్వహించాల్సిన విధులపై పూర్తి సమయం శ్రద్ధ వహించడానికి సమాజ ప్రయోజనాల కోసం మరియు దాని తరపున పని చేసే ఒకే ఒక్క తేడాతో వారు ప్రజా సభ్యులని పోలీసులు గుర్తించాలి.పోలీసులు తమ విధులను సమర్ధవంతంగా నిర్వహించడం అనేది ప్రజల నుంచి అందే సహకారంపై ఆధారపడి ఉంటుందని గ్రహించాలి. ఇది, వారి ప్రవర్తన, చర్యలకు ప్రజల ఆమోదాన్ని పొందడం , ప్రజల గౌరవ, విశ్వాసాన్ని సంపాదించడం, నిలుపుకోవడం వంటి వాటి సామర్థ్యంపై ఆధారపడి ఉంటుంది.పోలీసులు ఎల్లవేళలా ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని వారి పట్ల సానుభూతితో మెలగాలి. వారు ఎల్లప్పుడూ వ్యక్తిగత సేవ , స్నేహాన్ని అందించడానికి సిద్ధంగా ఉండాలి. వారి సంపద లేదా సామాజిక స్థితితో సంబంధం లేకుండా అందరికీ అవసరమైన సహాయం అందించాలి.పోలీసులు ఎల్లప్పుడూ తమ కంటే ముందు విధులు నిర్వర్తించాలి, ప్రమాదం, అపహాస్యం లేదా అపహాస్యం ఎదురైనప్పుడు ప్రశాంతంగా ఉండాలి. ఇతరులను రక్షించడంలో తమ ప్రాణాలను త్యాగం చేయడానికి సిద్ధంగా ఉండాలి.పోలీసులు ఎల్లప్పుడూ మర్యాదపూర్వకంగా మంచి మర్యాదగా ఉండాలి.అవి ఆధారపడదగినవి నిష్పక్షపాతంగా ఉండాలి; వారు గౌరవం ధైర్యం కలిగి ఉండాలి. వ్యక్తిత్వం , ప్రజల విశ్వాసాన్ని పెంపొందించుకోవాలి.అత్యున్నత క్రమం యొక్క సమగ్రత పోలీసుల ప్రతిష్టకు ప్రాథమిక ఆధారం. దీనిని గుర్తించి, పోలీసులు తమ వ్యక్తిగత జీవితాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి, స్వీయ నిగ్రహాన్ని పెంపొందించుకోవాలి. వ్యక్తిగత అధికారిక జీవితంలో ఆలోచన, పనిలో నిజాయితీగా ఉండాలి, తద్వారా ప్రజలు వారిని ఆదర్శవంతమైన పౌరులుగా పరిగణించాలి. ఉన్నత స్థాయి క్రమశిక్షణ, చట్టానికి లోబడి విధులను విశ్వసనీయంగా నిర్వహించడం కమాండింగ్ ర్యాంకుల యొక్క చట్టబద్ధమైన ఆదేశాలకు అవ్యక్త విధేయత బలానికి సంపూర్ణ విధేయతతో మాత్రమే రాష్ట్రానికి తమ పూర్తి ప్రయోజనం ఉత్తమంగా ఉంటుందని పోలీసులు గుర్తించాలి. తాము స్థిరమైన శిక్షణ సంసిద్ధత స్థితిలో ఉండాలి.లౌకిక, ప్రజాస్వామ్య రాజ్యంలో సభ్యులుగా, పోలీసులు వ్యక్తిగత పక్షపాతాలకు అతీతంగా ఎదగడానికి నిరంతరం కృషి చేయాలి.భారతీయ ప్రజలందరి మధ్య మతపరమైన, మహిళల గౌరవాన్ని కించపరిచే వెనుకబడిన భాషా, ప్రాంతీయ లేదా విభాగాలకు అతీతంగా సామరస్యాన్ని ఉమ్మడి సోదర భావాన్ని పెంపొందించాలి. పైన చెప్పబడిన అనేక నియమ నిబంధనలు ధర్మాలు ప్రాథమిక సూత్రాలు ఉన్నా ఎందుకు పాటించడం లేదో అన్నది ఆ అధికార వ్యవస్థ ను పర్యవేక్షణ చేసే పై అధికారులు పునరాలోచించాలి.సమాజంలో ఒక స్త్రీ లేదా పురుషుడు పోలీస్ స్టేషన్ మెట్లెక్కాడు అంటే ఎందుకో పరిశీలన చేయాలి.నిజా నిజాలు నిగ్గు తేల్చి న్యాయమన్నది పరిశీలించి కఠిన చర్యలు తీసుకోవాలి.ఇలా చేసి ఉండి ఉంటే కడప జిల్లాలో జరిగిన ఉదంతం అపగలిగే వారు కదా అలాగే ఒక వ్యక్తి స్వార్థం కోసం వందలాది మంది ని ముంచి పోలీసులనే టార్గెట్ చేస్తూ అసత్య కథనాలను సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేస్తే పోలీసు కు నష్టం పరువు పోతుందని బైన్దోవర్ కేసులు పెట్టారు.అప్పటికి ఆ వ్యక్తి పై అనేక కేసులు నమోదు కాబడి నగర పోలీస్ కమిషనర్కు కూడా కట్టలు తెంచుకునెంత ఆగ్రహం తెప్పించే స్థాయికి నేర చరిత్ర ఉంటే మాచవరం పోలీసులు రాచ మర్యాదలు చేసి పంపారనే ప్రచారం చేసుకుంటుంటే ఇక పోలీసు వ్యవస్థ పై ప్రజలకున్న నమ్మకం సన్నగిల్లిపోదా అన్న విషయం కూడా ఆలోచన చేయలేని స్థితిలో ఉన్నారంటే సిగ్గు పడాలో అర్థం కానీ పరిస్థితి. అలా నిర్లక్ష్యం చేయడం వల్ల ఇంకొకడు దుష్ప్రచారం చేస్తూనే ఉన్నాడు. దీనిని ఏమనాలి.పోలీసులు నిర్లక్ష్యమా లేక బాధితులపై చిన్నచూపా లేక ఎదుటివారితో లోపాయకారి ఒప్పందామా లేక మరో కడప సంఘటన లాగా జరిగితే చూడాలని కోరిక ఉందా అన్నది స్పష్టంగా కనిపిస్తోందని చెప్పాలి.ముఖ్యమంత్రి నారాచంద్రబాబు నాయుడు సోషియల్ మీడియా దుష్ప్రచారాలపై క్యాబినెట్ సబ్ కమిటీ కూడా వేసి చర్యలు తీసుకోవాలని సూచించడం జరిగింది. అయినా కొంతమంది పోలీసులు నిర్లక్ష్యంగా న్యామన్నది నడివీధిలో అంగడి సరుకులా తయారయ్యిందని చెప్పక తప్పడంలేదు. ఇలాంటి అధికార వ్యవస్థ ఉన్నంత వరకు సామాన్యులకు అగచాట్లు తప్పదు మరి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article