Monday, January 20, 2025

Creating liberating content

రాజకీయాలుప్రెస్ క్లబ్ లను… గబ్బు పట్టించారా…పట్టిస్తున్నారా..?

ప్రెస్ క్లబ్ లను… గబ్బు పట్టించారా…పట్టిస్తున్నారా..?

అది అందరి సొత్తా.. కొందరి సొత్తా..
కొందరిదేనని ఎందుకు చెప్పలేక పోతున్నారు ..
అందరిదీ అయితే అందులో సభ్యత్వం ఎందుకివ్వలే..
అనాధిగా అలవాటు పడ్డారుగా..
అప్పుడంటే కొందరే ఉన్నారు…కుమ్మేశారు..
ఇప్పుడు అందరూ ఉన్నారు…అన్యాయాలు చూడలేకున్నారు..
ప్రభుత్వమెందుకు ఉదాసీనంగా ఉందో..
ఈ నాయకులే ప్రభుత్వాన్ని శాసిస్తున్నారా..
మీటింగ్ లకు వెళ్ళొద్దని బెదిరింపు లెందుకు..
భయమా… లేక గుట్టు బట్టబయలు అవుతుందనా..
ఇంకెన్నాళ్లీ దాపరికం..
ఇంకెంత కాలం ఈ అరాచకం..
పరాయి పాలనలో ఈ పాట్లు పడాల్సిందేనా..
పొరుగు రాష్ట్రాల పెత్తనమే ఉండాలా..
ఏ ఇక్కడ పాలేగాళ్ళు లేరా…అంత పౌరుషం లేదా..
మీరేమి జర్నలిస్టులు రా అయ్యా..
ఇదేనా మీ జర్నలిజం ..
ఛీ.. ఛీ.. ఏమిటీ ఈ చీత్కారాలు…
సిగ్గుపడండి ఇకనైనా..
సర్దుబాటు చేసుకోండి ఇకపై…

(రామ మోహన్ రెడ్డి,సంపాదకులు)
ప్రెస్ క్లబ్ అనేది వార్తలను సేకరించి వాటిని ప్రజలకు అందించే వారికి వృత్తిపరంగా నిమగ్నమైన పాత్రికేయులు,పత్రికల పనిచేసేవారికోసం ఏర్పాటు చేయబడ్డది.అంటే పాత్రికేయ వృత్తిలో ఉన్న ప్రతి ఒక్కరికి సభ్యత్వం కలిగి అక్కడ సభ్యులు గా చెలామణి అవుతూ ఎవరి కార్యక్రమాలు వారు చేసుకుంటూ సమాజ హితం కోసం పనిచేసే ఇదిలో ఒక భాగంగా చెబుతారు. కానీ ఇది ఫలానా వారికే మాకు ఇష్టమొచ్చినట్లు ఉంటాము ..మాకు అనుకూలం గా ఉన్నవారికే అంటే కుదరదు.ఎందుకంటే ప్రెస్ క్లబ్ అనేసి ఏ ఒక్కరి జాగీరు కాదు.ప్రజాస్వామ్యములో ప్రతి వ్యవస్థ కు ఒక పద్ధతి ఎలా ఉంటుందో అదే పద్దతి ఇక్కడ కూడా ఉంటుంది.ప్రపంచంలో ఉన్న అందరి లోపాలు ఎత్తి చూపి ఆదర్శ పురుషుల లాగా ఉన్న మనము మనలో ఉన్న లోపాలను కూడా సవరించుకుని ముందుకు వెళ్లాలన్నది సహజ న్యాయం.అయితే ఈ సహజ న్యాయం అన్నది వారి వారు సహచరులకు మాత్రమే అంటూ ఇతరులకు అన్యాయం గురిచేసే స్థాయికి దిగజారి పోయి ఈ ప్రెస్ క్లబ్ లను గబ్బుపట్టించి గోడ మీద కూర్చుని గావుకేకలు వేస్తుంటే గమనిస్తున్న వారు గొడవలు చేసి స్థాయికి పాత్రికేయ వృత్తిని దిగజార్చి వేస్తున్నారు. మరి ఆ గబ్బు పడుతున్న ప్రెస్ క్లబ్ లు అందరివా లేక కొందరివా అంటే అదేమిటి అందరిదీ అని అబద్ధపు కూతలు కుస్తూ కావాల్సిన వారిని కొందరినే చేర్చుకుని కోట్ల రూపాయల బకాయిలు కట్టకుండా ఉంటున్నారు.అందరిదీ అంటే సభ్యత్వం ఎందుకివ్వడం లేదంటే కుంటి సాకులు చెబుతూ కాలాన్ని వెళ్లబుచ్చుతూ కాలక్షేపం చేస్తున్నారు.ఇందుకు గల కారణాలు లేకపోలేదు. ఒక నాడు జర్నలిజం లో విలువలతో కూడిన జర్నలిస్టులు వ్రేళ్ళమీద లెక్కపెట్టుకునే వారు.ఈనాడు జర్నలిజం ఒక వ్యాపారమై సందు ఒకరు తయారై సరుకు లేక సత్తాలేక చతికిల బడుతూ ఉన్నారు.ఆనాడు ఉన్న కొందరు అప్పటి ఏలుబడి రాజ్యం లో బాగానే ఏలుబడి సాగించారు.అన్ని చక్కదిద్దుకుని అందలమెక్కి ఆటలాడుతున్నారు ఆయితే కాలం మారినా నాటి పరిస్థితి నేడు లేదని తెలిసిన కోట్లు రూపాయల బకాయిలు ఉన్నాయని తెలిసి తమకంటే గొప్పవారు ఇకలేరనే బ్రమల్లో బ్రతుకు పాత్రికేయుల పరువు బజారుకీడుస్తున్నారు. పత్రికొక్కటున్న పదివేల సైన్యము, పత్రికొక్కటున్న మిత్రకోటి, ప్రజలకు రక్ష లేదు పత్రిక లేనిచో… ” అని చెప్పిఎడిటరైనవాడు బిడియము చూపుచో ధాటి తగ్గు వృత్తి ధర్మమందు, కడుపుకూటి రాత కక్కుర్తి రాతరా’ అంటూ తోటి రచయితలనూ, భావి సంపాదకులనూ హెచ్చరించి ముఖ్యంగా జర్నలిజం రంగంలోకి అడుగుపెట్టేవారు నిజాయతీగా, నిర్భీతిగా ఉండాలని కోరిన పాత్రికేయుడు నార్ల పేరు పెట్టిన ప్రెస్ క్లబ్ లో ఆయన జీవితం లో అతి ముఖ్యమైన రోజును కూడా విస్మరించి ఉన్నారు విశాఖ ఘనులు.నిజము కప్పిపుచ్చి నీతిని విడనాడి స్వామి సేవ సేయు జర్నలిస్టు తార్చువాని కంటే తక్కువ వాడురా” అని కుండ బద్దలుగొట్టినట్లు చెప్పడం నార్లవారికే చెల్లింది.ఇక్కడ నిజము చెప్ప బోయిన నిజాలు రాయబోయిన బజారుకీడుస్తున్నారు ఇక్కడి బడుద్దాయిలు. ప్రధానంగా విజయవాడ నుండి మొదలై రాష్ట్ర వ్యాప్తంగా ఈ గబ్బు మొదలైనది.అనాధిగా ఆగడాలు సాగించిన అస్మదీయ వర్గానికి అంతుపట్టని అవినీతి మరక అంటు కోవడం ఎక్కడలేని అహంకారం అవగించడముతో ఆయా ప్రాంతాల పాత్రికేయులు అలుపెరగని పోరాటానికి సిద్ధమవుతున్నారు. అయితే అందరి బొక్కలు వెతికి కథలు కథలుగా రాసేవారి అసలైన కథ ఏమిటంటే ఈ అస్మదీయ సామ్రాజ్యాన్ని పాలించే ది అవతలి రాష్ట్రం వారే.అక్కడే గుర్తింపు ఉంది తప్ప అసలైన స్థానములో లేదు. తాము అస్మదీయులం తాము తలుచుకుంటే అంతా తలకిందులు చేస్తామని అనుకుంటూనే ఇవతలి రాష్ట్రంలో ఏమాత్రం గుర్తింపు లేని వారు అనేక రకాల కుయుక్తులు చేస్తున్నారు. వీరిని కాదని ఏ యూనియన్ బలోపేతం కాకుడదని చేసే కుట్రలు అన్ని ఇన్ని కావు.ఎవరు ఆ మీటింగ్ లకు వెళ్ళొద్దని హుకుం జారీ చేయడం వీరి నైజం గా మారింది. అసలు వీరి జమానాలో ఉన్న సభ్యుల జాబితా చూస్తే సంభ్రమాచార్యానికి గురికావాల్సిందే.కార్మిక చట్టాల ప్రకారం సభ్యులు ఎవరన్నది కూడా పట్టక పత్రికా సంపాదకులను కూడా సభ్యులుగా చేర్చుకుని పబ్బం గడుపుకుంటూ ఉంటే ఇక ఈ ప్రెస్ క్లబ్ లు గబ్బు పట్టక ఇంకేమి అవుతాయో అన్నది అర్థం కాని ప్రశ్న.అందరి నీతి గురించి మాట్లాడే మనమే గురివింద సామేత మరిచినట్లు ఉండటం ఎంత వరకు సమంజసమొ ఈ అస్మదీయులకే అవగతం అవ్వాలి మరి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article