Thursday, November 28, 2024

Creating liberating content

హెల్త్ప్రొటీన్ సప్లిమెంట్లు తీసుకోవద్దు..

ప్రొటీన్ సప్లిమెంట్లు తీసుకోవద్దు..

కండలు పెంచే లక్ష్యంతో ప్రొటీన్ సప్లిమెంట్లు తీసుకోవద్దని భారత వైద్య మండలి దేశ ప్రజలకు సూచించింది. ఉప్పు, చక్కెర వాడకం, అల్ట్రా ప్రాసెస్టడ్ ఫుడ్స్ తగ్గించాలని, ఆహార ఉత్పత్తుల ప్యాకింగ్‌పై ఉన్న సమాచారాన్ని పూర్తిగా చదివాకే ఆహారానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకోవాలని సూచించింది. ఈ మేరకు ఐసీఎమ్ఆర్ ఆధ్వర్యంలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ పలు ఆహార నియమాలను బుధవారం విడుదల చేసింది. శరీరానికి పోషకాలను అందించేందుకు, జీవనశైలి వ్యాధులు దరిచేరకుండా ఉండేందుకు ఈ నియమాలు పాటించాలని సూచించింది.
ఎన్ఐఎన్ సూచించిన మార్గదర్శకాలు..
రోజులో తీసుకునే మొత్తం కేలరీలలో చక్కెర 5 శాతానికి మించకూడదు. తృణధాన్యాలు 45 శాతానికి మించకూడదు. పప్పు దినుసులు, మాంసం వంటివి 15 శాతం దాట కూడదు. మిగతాది గింజలు, ఆకుకూరలు, పళ్లు, పాలు ద్వారా అందాలి. కొవ్వులు 30 శాతం దాటకూడదు
పప్పు దినుసులు, మాంసం అధిక ధరల కారణంగా అనేక మంది ధాన్యాలపై ఎక్కువగా ఆధారపడి కీలక అమైనోయాసిడ్లు తీసుకోవడంలేదని కూడా ఐసీఎమ్ఆర్ అధ్యయనంలో తెలిసింది.
శరీరంలో కీలక పోషకాలు తగ్గితే జీవ్రక్రియల వేగం కుంటుపడి, ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరుగుతుంది. ఫలితంగా చిన్నతనంలోనే జీవనశైలి రోగాల బారిన పడాల్సి వస్తుంది.
ఈ అధ్యయనంలో ప్రకారం దేహంలో 55.4 శాతం ఆరోగ్య సమస్యలు సమతుల పోషకాహార లోపం కారణంగానే తలెత్తుతున్నాయి.
పోషకారం, ఎక్సర్‌సైజుల ద్వారా గుండె సంబంధిత , బీపీ వంటి సమస్యలను నిరోధించే అవకాశం 80 శాతం వరకూ ఉంటుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article