పులివెందుల
ఆసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా జగనన్న మెగా లేఅవుట్ లో అసంపూర్తిగా ఉన్న పక్కా గృహాలు నిలిచాయని రాజ్యసభ మాజీ సభ్యులు, ఏపీసీసీ అధికార ప్రతినిధి తులసి రెడ్డి, పులివెందుల కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి మూలంరెడ్డి ధ్రువ కుమార్ రెడ్డి, వినయ్ కుమార్, శంకర్ రెడ్డి, వినోద్ లు అన్నారు. ఈ సందర్భంగా బుధవారం పక్కా గృహాలను వారు పరిశీలించారు.అసంపూర్తిగా మిగిలిపోయిన పక్కా గృహాలలో మద్యం బాటిళ్లు దర్శనమిస్తున్నాయన్నారు. పక్కా గృహాల నిర్లక్ష్యం చేయడం వల్లే ఇక్కడ అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా నిలుస్తున్నాయన్నారు. ఈ పక్కా గృహాలు మూడు నెలల్లోపు పూర్తి చేసి లబ్ధిదారులకు పంచకపోతే ఆందోళనలు చేసి ప్రభుత్వం మెడలు వంచి పక్కాగృహాలను పూర్తి చేయించే కార్యాచ రణ చేపడతామన్నారు.