గుమ్మడికాయ గింజలు అనేవి గుమ్మడికాయ లోపల దొరికే చిన్న, పోషకాలతో నిండిన గింజలు. ఇవి రుచికరమైన చిరుతిండిగా మాత్రమే కాకుండా, అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటాయి. ఈ గింజలు ప్రోటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్, విటమిన్లు (ముఖ్యంగా విటమిన్ కె, ఈ) ఖనిజాలు (మెగ్నీషియం, జింక్ వంటివి)తో నిండి ఉంటాయి. గుమ్మడికాయ గింజల్లోని ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. రక్తపోటును తగ్గించి, చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడతాయి.జింక్ మెదడు ఆరోగ్యానికి చాలా ముఖ్యం. గుమ్మడికాయ గింజల్లో జింక్ పుష్కలంగా ఉండటం వల్ల జ్ఞాపకశక్తి మెరుగుపడుతుంది, మెదడు వ్యాధుల ప్రమాదం తగ్గుతుంది. అలాగే నిద్రను మెరుగుపరుస్తుంది. మూత్రపిండాలను ఆరోగ్యంగా ఉంచడంలో గుమ్మడికాయ గింజలు సహాయపడతాయి. జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి, మలబద్ధకం నుంచి ఉపశమనం కలిగిస్తాయి. శరీరానికి ఎక్కువ శక్తిని ఇస్తాయి.గుమ్మడికాయ గింజలను నేరుగా తినవచ్చు లేదా వాటిని సలాడ్లు, స్మూతీలు, ఓట్స్‌లో కలిపి తినవచ్చు. వాటిని కాల్చి తింటే రుచి ఎక్కువగా ఉంటుంది.