ఆలయ కార్యనిర్వహణాధికారి అల్లు వెంకట దుర్గా భవాని.
రామచంద్రపురం :దక్షిణ కాశీగా విరాజిల్లుతున్న శ్రీమాణిక్యంబ సమేత శ్రీభీమేశ్వర స్వామి వారి దేవస్థానంలో అభిషేకాలు జరగట్లేదని కొంతమంది ఆకతాయిలు సోషల్ మీడియాలో దుష్ప్రచారాలు చేస్తున్నారని అటువంటి వదంతులు సుదూర ప్రాంత భక్తులు నమ్మవద్దని ఆలయ కార్యనిర్వాహణాధికారిని అల్లు వెంకట దుర్గా భవాని స్పష్టం చేశారు.ఈమేరకు ఆదివారం మీడియాకు ఈవిషయానచని తెలియజేసారు. కేంద్రపురావస్తు శాఖ ద్రవ్యాలుతో అభిషేకం నిషేధించారని కేవలం స్వచ్ఛమైన నీటితో అభిషేకాలు చేసుకొనుటకు అనుమతిఇచ్చారని దీంతో ఆవిధముగా ఉదయం 6 గంటల నుండి 10 గంటల వరకు అభిషేకాలు జరుగుతున్నాయన్నారు .
అయితే కార్తీక సోమవారాల్లో తెల్లవారుజామున నాలుగు గంటల నుండి మధ్యాహ్నం నాలుగు గంటల వరకు అభిషేకాలు జరుగుతున్నాయని అయితే భక్తులు తెచ్చుకున్న ద్రవ్యాలు పోసుకుని చేసుకునేందుకు వీలుగా ఉత్తర గోపురం వద్ద గల వాయులింగం వద్ద అన్ని ఏర్పాట్లు చేసామని ఈసంధర్బంగా ఇవో తెలిపారు కొంతమంది ఆకతాయిలు అభిషేకాలు జరగట్లేదని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారని వారిపై ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేసిమని భక్తులు ఈవిషయాన్ని గమనించాలని పత్రిక ముఖంగా తెలియజేసారు.