75 వేలు నకిలీ నోట్లు ప్రింటింగ్ సామాగ్రి స్వాధీనం ముఠాలో నలుగురు అరెస్టు పరారీలో ఇద్దరు రామచంద్రపురం డిఎస్పీ రామకృష్ణ వెల్లడి
రామచంద్రపురం
రామచంద్రపురం పట్టణంలో ఒక ఇంటిలో దొంగనోట్లు ముద్రిస్తున్నారన్న పక్కా సమాచారంతో రామచంద్రపురం ఎస్ఐ సురేష్ బాబు తన సిబ్బందితో పాటు పలువురు మద్యవర్తులతో ఆఇంటికి వెళ్ళి నలుగురు దొంగనోట్ల ముఠా సభ్యులను అదుపులోకి తీసుకుని వారివద్ద నుండి ముద్రించిన దొంగనోట్ల తోపాటు ముద్రణకు ఉపయోగించే పలురకాల సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు.ఈమేరకు శనివారం ఈవిషయంపై రామచంద్రపురం డిఎస్పీ బి.రామకృష్ణ రామచంద్రపురంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి పలు ఆశక్తికర విషయాలు వెల్లడించారు.ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ రామచంద్రపురంలో ఒక ఇంట్లో దొంగనోట్లు ముద్రించే నలుగురు ముఠా సభ్యులను అరెస్ట్ చేయడంజరిగిందన్నారు.వీరిలోరామచంద్రపురం పట్టణం రత్నంపేటకు చెందిన మోగంటి గోపి,శ్రీకాకుళం జిల్లా,రణస్థలం మండలం ,బోయిపాలెంగ్రామానికి చెందిన బోయి గోవిందరావు,రాయవరం మండలం వెంటూరు గ్రామానికి చెందిన వాసంశెట్టి వీరభద్రం,రామచంద్రపురం మండలం నరసారావుపేటకు చెందిన బాడుగంటి వీరవెంకట రమణ ,లను అరెస్టు చేయగా ముఠాలో విజయనగరం జిల్లా, గూడపువలసకు చెందిన చల్లా నూకారెడ్డి ,ఇదేజిల్లా శాంతినగర్ కు చెందినమీసాల అప్పలరాజు లు పరారీలో ఉన్నట్లు తెలిపారు.కాగా అదుపులో తీసుకున్నవారి నుండి 75,వేలు నకిలీ నోట్లుతో పాటు ముద్రణకు ఉపయోగించే సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు.
నలుగురులో మాగంటి గోపి, ఆప్టింగ్ డ్రైవర్ గా పనిచేస్తూ, జూదం, బెట్టింగులు వంటి చెడు వ్యాసనాలకు అలవాటుపడి, ఎక్కువుగా డబ్బు సంపాదించాలనే దురాశతో విజయనగరం జిల్లాకు చెందిన దొంగ నోట్లు తయారు చేసే చల్లా నూకా రెడ్డి, అతని సహాయకుడు అయిన మీసాల అప్పలరాజు ద్వార పరిచయమైన శ్రీకాకుళం జిల్లా కు చెందిన బోయ గోవింద రావు ద్వార దొంగనోట్లు రప్పించు కోవడం,చెలామణి చేసేవాడు ఎక్కువ మొత్తంలో దొంగ నోట్లు కావలసినప్పుడు వాసంశెట్టి వీరభద్ర రఘు రామ్, బాడుగంటి వీర వెంకట రమణ , బోయ గోవింద రావు ల సహాయం తో తన ఇంటి వద్ద దొంగనోట్లను ముద్రించి, వాటిని రామచంద్రపురం పరిసర ప్రాంతలలో గల వాసంశెట్టి వీరభద్ర రఘు రామ్, బాడుగంటి వీర వెంకట రమణ లతో కలిసి వాటిని రద్దీ ప్రదేశాలలో చలామణి చేసేవారన్నారు.
బోయ గోవింద రావు తన ఆర్ధిక పరిస్థితుల వల్ల గోపి కి తెలిసిన చెల్లా నూకా రెడ్డి, వాసంశెట్టి వీరభద్ర రఘు రామ్ ,బాడుగంటి వీర వెంకట రమణ లకు దొంగ నోట్లు సరఫరా చేస్తూండేవాడని, గోపి ఇంటికి వెళ్ళి దొంగ నోట్లు ముద్రించే క్రమంలో వారికి సహాయం చేసేవాడన్నారు.
వాసంశెట్టి వీరభద్ర రఘు రామ్ గతంలో కారు మెకానిక్ షెడ్ తోపాటు ఫోమ్ వాష్ సెంటర్ రామచంద్రపురం పట్టణంలో నడపడం వల్ల కారు డ్రైవింగ్ వృత్తిలో ఉన్న గోపి పరిచయంతో ప్రస్తుతం అతని ఆర్ధిక పరిస్థితి బాగలేనందున, కారు షెడ్ కూడా మూసివేయడంతో త్వరగా ఎక్కువ డబ్బులు సంపాదించాలని అత్యాశతో దొంగ నోట్లు వ్యాపారం చేయాలని నిర్ణయించుకున్నారని,బాడుగంటి వీర వెంకట రమణ,ఆర్క్ వెల్డింగ్ పనిచేస్తూ వుండడం వల్ల కారు షెడ్ నిర్వహించే రఘు పరిచయం. రఘు ద్వార ఇతనికి మాగంటి గోపి కూడా పరిచయం అయ్యాడని,ఇతను తనకున్న చెడు వ్యాసనాల కారణంగా దొంగ నోట్లు వ్యాపారం చేద్దాం అని గోపి ద్వార పరిచయం అయిన బోయ గోవింద రావు , రఘుల ద్వార దొంగనోట్లు తెప్పించుకొని బహాహిరంగగంగా మార్కెట్ లో చలామణి చేసేవారని డిఎస్పీ తెలిపారు. దొంగ నోట్లద్వారా పాడేరు అటవీ ప్రదేశాలలో గంజాయి కొనుగోలు చేసి, హైదరాబాద్ తీసుకొని వెళ్ళి అమ్మేసి అతని విలాశాలకు వాడేవాడుకునేవాడని చెప్పారు.ఈ కేసులో చల్లా నూకా రెడ్డి పై గతం లో పార్వతీపురం టౌన్, సాలూరు టౌన్ – విజయవాడ సిటీ , రైల్వే పోలీస్ స్టేషన్ నందు దొంగ నోట్లు ముద్రణా , చలామణి కేసులు నమోదు అయినట్లు తెలిపారు.అదేవిధంగా మరో ముద్దాయీ మీసాల అప్పల రాజు గతం లో ప్రింటింగ్ ప్రెస్ లో పనిచేసిన అనుభవం తో నకిలీ 5వందల రూపాయల నోట్లను డిజైన్ చేసి ముద్దాయిలయి వీరికి అందజేసేవాడని తెలిపారు. .
ప్రస్తుతం ఈ కేసులోచల్లా నూకా రెడ్డి, మీసాల అప్పల రాజు ల ప్రమేయం ఉన్నట్లు దర్యాపుతులో తేలిందని పరారీలో ఉన్న వీరిద్దరినీ త్వరలో అరెస్ట్ చేయడం జరుగుతుందని డిఎస్పీ తెలిపారు.ఈ కేసు విషయంలో ఇతర వ్యక్తుల ప్రమేయం ఏమైనా ఉన్నదనే కోణంలో కూడా సమగ్ర దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.కాగా జిల్లా ఎస్పీ ఎస్.శ్రీధర్, ఆదేశాల మేరకు, అడిషనల్ ఎస్పీ ఎస్. ఖాదర్ బాషా పర్యవేక్షణలో, రామచంద్రపురం డిఎస్పీ బి. రామకృష్ణ ఆధ్వర్యంలో, చాకచక్యంగా వ్యవహరించి దొంగ నోట్లు ముఠాను పట్టుకునందుకు రామచంద్రపురం సి.ఐ. పి.దొరరాజు , రామచంద్రపురం ఎస్ ఐ.కె.సురేష్ బాబు లతో పాటు సిబ్బందిని ఈసందర్భంగా అభినందించారు.