ఎర్రటి అరటి పండ్లు. వీటిలోని పోషకాలు ఆరోగ్యకరమైన ఆహారంలో భాగంగా తింటే గుండె, జీర్ణక్రియ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ఈ అరటి పండ్లతో కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము.ఎర్ర అరటిపండ్లలో విటమిన్ సి, బి6 పుష్కలంగా వుండటంతో రోగనిరోధక వ్యవస్థ బలపడుతుంది.బరువు తగ్గడంలో సహాయపడుతాయి ఎర్రటి అరటి కాయలు.ఎర్రటి అరటిపండ్లలోని లుటీన్, బీటా కెరోటిన్ అనే రెండు కెరోటినాయిడ్లు కంటి ఆరోగ్యానికి తోడ్పడతాయి.వీటిలో 9 నుంచి 28 శాతం మేర విటమిన్ సి, బి6 వుంటాయి.రక్తాన్ని శుభ్రపరిచి ఆరోగ్యవంతం చేస్తుంది.ఈ అరటి పండులో వుండే పొటాషియం మూత్రపిండాల్లో రాళ్లను నివారించడంలో సాయపడుతుంది.