గండేపల్లి.:మండల పరిషత్ కార్యాలయంలో శుక్రవారం ఎంపీడీవో హనుమంతరావు ఆధ్వర్యంలో సర్వసభ్య సమావేశం నిర్వహించారు .ఈ సమావేశంలో ముఖ్య అతిథులుగా ఎంపీపీ చలగళ్ల దొరబాబు, జడ్పిటిసి సభ్యులు పరిమి వెంకట లక్ష్మీ బాబు, వైస్ ఎంపీపీ పాల్గొన్నారు .ఈ సమావేశంలో పాల్గొన్న అధికారులతో సమస్యలు చెప్పమని తెలపడంతో ఎక్కువగా ఆయా మండల కార్యాలయాలకు సంబంధించిన ప్రహరీ గోడ తదితరు సమస్యలను మండల స్థాయి అధికారులు వివరించారు. ఉప్పలపాడు గ్రామపంచాయతీ సర్పంచ్ అడబాల ఆంజనేయులు మాట్లాడుతూ తమ గ్రామంలో త్రాగునీరు బోరు పాడైందని వెంటనే రిపేరు చేయించాలని కోరగా దానికి ఎంపీడీవో పూర్తిస్తాయిలో సమాధానం ఇవ్వలేదు. అదేవిధంగా మురారి గ్రామానికి సంబంధించిన ఎంపీటీసీ వన్ సభ్యురాలు మాట్లాడుతూ తమ గ్రామంలో ఐసిడిఎస్కు సంబంధించిన సమస్యలు లేవనిత్తారు. సిడిపిఓ అధికారిని ఆ సమస్యను వెంటనే పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. అయితే ఎన్నికల కోడ్ ఉన్నందున తీర్మానాలు చేయడం జరగదని ప్రస్తుతం సమస్యలపై సమీక్ష నిర్వహించడం జరుగుతుందని ఎంపీడీవో తెలిపారు. ఈ కార్యక్రమానికి కొంతమంది అధికారులు గైర్హాజరయ్యారు . ఈ కార్యక్రమంలో ఈవోపీఆర్డి బీఎస్ఎన్ మూర్తి ,ఆయా గ్రామ సర్పంచులు మద్దిపట్ల రామకృష్ణ , అడబాల ఆంజనేయులు, జాస్తి వసంత్, ఆయా గ్రామ ఎంపీటీసీలు వివిధ శాఖ అధికారులు పా
