-ఆయన్ను వేడుకుంటేనే ప్రసాదం
-అమ్మవారి పాసుల్లో అయోమయం
-అంతా ఆయన చెప్పిందే వేదం..
-ఏ ప్రభుత్వం వచ్చినా ఆయన్ను చేసేదేమి లేదు
-ఆయన సర్వీస్ అంతా ఇక్కడే..
-ఆయన లోకల్… ఏదయినా అంటే కేకలు వేస్తాడు..
-చిత్తశుద్ధి లేనిది మీడియాకే..
-ఆదివారం చర్చలు ముగిసినా..
మంగళవారం కూడా సిఫార్సులు..
-ఆయన ఏమి చేసినా ఏది పెట్టినా మహాప్రసాదమే..
-ఆయన కన్నెర్ర చేస్తే అమ్మ అనుగ్రహం కూడ దక్కదు..
-సిగ్గులేని మీడియా వారి వల్లే..
-అందుకే ఇంత చులకన గా
-అందుకే మీడియా పైఆంక్షలు..
-ప్రచారం కావాలి…పాసులు తగ్గించుకోవాలి..
-సీసీ కెమెరాలు… ఐరిస్ ..బయో మెట్రిక్ అన్నారు..
-అందుకే అలుసయ్యారు
అధికారులకు..
-అయినా మారరు మీరు..
-ఇక అంతా అమ్మదయే..
రామమోహన్ రెడ్డి, సంపాదకులు
అమ్మదయ ఉంటే అన్ని ఉన్నట్లే అంటారు పెద్దలు. కానీ ఇక్కడ అమ్మలు గన్న అమ్మ అనుగ్రహం కంటే అయన తలుచుకుంటేనే అమ్మదయ కానీ ఆ మహాప్రసాదం కానీ దక్కేలా ఉంది. దేవుడి వరమిచ్చినా పూజారి కరుణించలేదన్న చందంగా బెజవాడ లో చోటు చేసుకోవడం బాధాకరం.
కనకదుర్గమ్మ శరన్నవరాత్రి ఉత్సవాలను వీలైనంత మందికి ప్రచారం చేయడానికి మీడియా చాలా అవసరం. కానీ మీడియూ సభ్యులు ఎంత మంది ఉండాలో తేల్చి చెబుతారు వీరే. వేలాదిమంది పోలీసులు కు ఆంక్షలు ఉండవు…ఇతర శాఖల అధికారులకు ఆంక్షలు ఉండవు కేవలం మీడియా కే ఆంక్షలు. మల్లీ లోపాలు ఎత్తి చూపకూడదు…ఇదేమిటని ప్రశ్నించకూడదు. వారు ఏది చేసినా అయ్యా అనాలి. ఆదివారం నాడు జిల్లా సర్వోన్నతాధికారి,ఎన్టీఆర్ పోలీస్ కమిషనర్ మీడియా తో సమావేశం ఏర్పాటు చేసి పాసులు 550కి కుదించారు. రాష్ట్ర పరిధిలో ఉన్న మీడియా జిల్లా మీడియా కు ప్రాధాన్యత ఇస్తారు. దీనిప్రకారం పాసులు సర్దుబాటు చేయాలని ఆ సమావేశంలో తీర్మానం చేశారు.అక్కడ మీడియా సభ్యుల తీరు చూసి అధికారులు కూడా అబ్బో అనుకుని అంతా అయ్యాక ఆ భోజనాలు తినేసి వెళ్ళండి అని గౌరవించారు.ఎందుకంటే మీడియా లేవనెత్తిన అంశాలు ఆచరణ కు సాధ్యం కానివి కాబట్టి.ఐరిస్, థంబ్,సీసీ కెమెరా లు ఇలా ఇవన్నీవిని అధికారులు కూడా ఆహా ఓకే అనడం జరిగింది. సీనియర్ పాత్రికేయులు సూచించారు సరే అన్నారు. ఇదంతా ఒక విధమైతే పాసులకు గడువు ఎప్పుడు అన్నది అగమ్యగోచరంగా తయారు చేశారు సంబంధిత అధికారులు. ఇక్కడ పాసులు ఇవ్వడానికి ఎవరికి ఎలా అన్నది జిల్లా పౌర సంబంధాల అధికారికి తెలుస్తుంది.కానీ ఓ అధికారి కీలకంగా ఉండి పాసుల విషయంలో కొంత చేతి వాటం ప్రదర్శించి నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై డిపిఆర్వో మోహన్ రావు ను ఫోన్లో వివరణ అడిగే ప్రయత్నం చేయగా అందుబాటులో లేరు.