- సీఐ చాంద్ బాషా
వేంపల్లె :ఎవరైనా బహిరంగ ప్రదేశాల్లో మధ్యం సేవించిన ..చట్ట విరుధ్ధ కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని వేంపల్లె సీఐ చాంద్ బాషా హెచ్చరించారు. ఆదివారం జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌసల్, పులివెందుల డిఎస్పీ వినోద్ కుమార్ ఆదేశాల మేరకు స్థానిక వేంపల్లి పరిసర ప్రాంతాల్లో మధ్యం సేవిస్తున్న పలువురికి తన సిబ్బందితో కలిసి జనరల్ కౌన్సిలింగ్ నిర్వహించారు. ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. ప్రజల బధ్రతే పోలీసుల లక్ష్యమన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.