విశాఖపట్నం:
మంగళ వారం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని నడిపిస్తున్న వాలంటీర్ల వ్యవస్థ సేవలు గుర్తించి వారికి సత్కారం కార్యక్రమం మార్కెట్ కమిటీ డైరెక్టర్ రౌతు శ్రీను ఆధ్వర్యంలో పాలవలసలో ఘనంగా నిర్వహించడం జరిగింది కార్యక్రమంకి విచ్చేసిన అవంతికి నాయకులు ఘనమైన స్వాగతం పలకడం జరిగింది. ప్రతీ వాలంటీర్ వద్దకు వెళ్ళి అవంతి మాట్లాడి వాలంటీర్ వ్యవస్థ విధి విధానాలు పై అడిగి తెలుసుకోవడం జరిగింది .కార్యక్రమంలో బాగంగా అవంతి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో భాగంగా అవంతి మాట్లాడుతూ కరోనా కలవరపెట్టినా,వరదలు వణికించినా,ఎక్కడా తలొగ్గక ఆదివారమైనా,పండగైనా,సెలవైనా,తొలి కోడి కూయకమందే చక్కటి చిరునవ్వు తో అవ్వా తాతలను,అక్కా చెల్లెళ్ళమ్మ లను,అన్నదమ్ములను,ఆప్యాయంగా పలకరించి ఠంచన్ గా పెన్షన్లు అందించడంతో పాటు జగనన్న ప్రభుత్వానికి ప్రజలకు మద్య వారథిగా నిలబడి లంచాలు,వివక్ష కు తావు లేకుండా ప్రభుత్వ సేవలు అందిస్తున్న నిస్వార్థ సేవకులు జగనన్న నియమించిన వాలంటీర్లు.అలాంటి వాలంటీర్లుకు వారి సేవలను గర్తిస్తూ అవార్డులు ప్రదానం చేస్తూ జగనన్న తీసుకున్న నిర్ణయం చాలా గొప్పదని,పేదలకు మంచి చేసే యజ్ఞం లో వాలంటీర్లు సేవలు చిరకాలం కొనసాగేలా వారిని మరింత ప్రోత్సహిస్తూ,ఇప్పటి వరుకూ ఇస్తున్న నగదు పురస్కారాల మొత్తాన్ని మరింత పెంచి అందిస్తున్న జగనన్న ప్రభుత్వం.ఈ అవార్డులు సేవా మిత్ర – సేవా వజ్రా – సేవా రత్న అనే మూడు కేటగిరి లో రాష్ట్ర వ్యాప్తంగా 2,55,464 మందికి మొత్తంగా 392.05 రూ కోట్ల నగదు పురస్కారాలు రూపంలో అందించడం జరిగింది అని, ప్రభుత్వ పాలనలో వాలంటీర్లు పాత్ర చాలా కీలకం అని, ప్రతి పక్షాలు వాలంటీర్లు గోనె సంచి మోసే ఉద్యోగం మేము వాలంటీర్ వ్యవస్థ ను తొలగిస్తాం అన్నారు.అదఘ ప్రతిపక్షాలు మేము అధికారం లోకి వస్తే వాలంటీర్ వ్వవస్థ కొనసాగిస్తాం అంటున్నారు అంటే వారికి కూడా వాలంటీర్ వ్యవస్థ ఎంతబాగా ప్రభుత్వం కి ప్రజలకు మద్య వారదులు గా ఉంటూ సేవలు అందిస్తుందో తెలుసు.
మీరు ఎవరికి భయపడవలసిన అవసరం లేదు మీకు అప్పగించిన విదులు బాధ్యత గా నిర్వర్తిస్తూ ముందుకు సాగండి.మీకు ఏ కష్టం వచ్చినా నెను ముందుంటానని మాట్లాడారు అనంతరం ఆనందపురం మండలం లో 382 మంది వాలంటీర్లు ఉండగా 370 మంది వాలంటీర్లు కు సేవా మిత్ర – 5 మందికి సేవా రత్న అవార్డులు ను అవంతి చేతులు మీదుగా అందివ్వడం జరిగింది అనంతరం 1500 మంది కి అవంతి ఏర్పాటు చేసిన ఆత్మీయ విందును ఆయన ప్రారంభం నుంచి చివరి వరుకూ ఉండి వడ్డన చేశారు.ఈ కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు ,మండలం వైసిపి పార్టీ శ్రేణులు,ఆయా పదవుల్లో ఉన్న వారు,సచివాలయం కన్వినర్ లు గృహ సారథులు, కార్యకర్తలు, అభిమానులు,సచివాలయం సిబ్బంది వాలంటీర్లు పాల్గొన్నారు