మామూళ్లు ఇచ్చుకో… గిఫ్ట్ పుచ్చుకో..
ప్రభుత్వ కార్యాలయాల్లో బోడి గుండోడి మాయలు
మామూళ్ల కోసం మాయమాటలు..
కబుర్లు చెప్పి కాగితాలు తీసుకోవడం…
ఆ కాగితాలు అన్నీ కార్యాలయాల్లో ఇవ్వడం…
4 వేలు ఇస్తే 400 గిఫ్ట్…
ఉయ్యురు,విజయవాడలో మాయలు…
తలపట్టుకుంటున్న సిబ్బంది ..
మోసపోయామంటూ గగ్గోలు…
అసెంబ్లీలోనే ఉంటానంటానని అన్నాడట..
సీయం చంద్రబాబుతోనే నిరంతరం బిజీ అంటా ..
నేషనల్ అక్రిడేషన్ కదా అంతేనట ..
ఈ గుండోడు లేనిదే సచివాలయంలో సందడి ఉండదట
వీడి బుచుకు బూచుకు వార్తలు రాస్తేనే …
లేదంటే కోమాలోంచి బైటికి వస్తారట…
ఏదీరా అయ్యా నీ బుచుకు బుచుకు అంటే బాబ్బా… బాబ్బా నే…
బొడి గుండోడి మాయలే వేరు…
(రామమోహన్ రెడ్డి, సంపాదకులు)
ఏలూరు వెల్డర్ జర్నలిస్టుకు ఎన్ని సార్లు సెల్యూట్ కొట్టినా తప్పులేదనిపిస్తుంది. ఎందుకంటె డబ్బుకోసం ఇతగాడి మాయలు చూస్తే జర్నలిజం కే కొత్త అర్థం పెట్టవచ్చు.జర్నలిజం లో ఉన్న యర్నలిజం రుచి మరిగి అనేక నేరాలు చేసి కొన్నేమో పోలీసు రికార్డుల కెక్కాయి. కొట్టివేయబడ్డాయి.ఇంకొన్ని అసలు రికార్డ్ కెక్క కుండా జాగ్రత్తలు పడుతూ మెలుగుతూ బుచుకు బుచుకు మాటలు చెబుతూ బుట్టలో నోట్లు వేసుకుని జారుకుంటున్నాడు.అయితే ఈ యర్నలిస్ట్ ఇప్పుడు కొత్తగా ట్రెండ్ మార్చాడు. విజయవాడ,గుంటూరు,ఏలూరుతో పాటు ఉభయగోదావరి జిల్లాల్లో పలు కార్యాలయాల్లో గుమస్తాలకు, సీనియర్ అసిస్టెంట్ లకు గిఫ్ లు ఇచ్చి నేతి మాటలు చెప్పి నైస్ గా వాళ్ళ దగ్గర సమాచారాన్ని తీసుకోవడం తో పాటు జేబులు నింపుకుని ఆ సమాచారం ఇతర కార్యాలయలకు ఇచ్చి తానొక్కడే నేషనల్, అసెంబ్లీ పాసు ఉందని మిగిలిన వారు అంతా లోకల్ అని మాయమాటలు చెప్పి పబ్బం గడుపుకుంటూ ఏసీ బస్సెక్కి వెళ్ళిపోయి అందరిని ఇబ్బందులకు గురిచేస్తున్నట్లు కొంతమంది జర్నలిస్టులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.
దీనితోపాటు తాను నిత్యం అసెంబ్లీ ,సచివాలయంలో బిజీగా ఉంటానని చెబుతూ ముఖ్యమంత్రి పర్యటనలు తానే అన్నీ కవర్ చేయాలని సొల్లు కబుర్లు చెబుతూ ఒక వైపు నకిలీ అక్రిడేషన్ కలిగి ఏ సంస్థ లో ఉన్నాడో ఐడి కార్డు లేకున్నా అక్రమ దారిలో సంపాదన కోసం అలవాటు పడి అప్పనంగా దోచుకుంటూ బుచుకు బుచుకు మాటలతో గారడి చేస్తున్నాడు ఈ వెల్డర్ జర్నలిస్ట్.ఇతగాడు ఐటమ్స్ రాస్తే కోమాలోకి పోవాల్సిందే నంటూ పనికిమాలిన మాటలు చెబుతూ నీతి మాలిన పనులు చేస్తున్నాడు. త్వరలోనే ఇలాంటి వారికి తగిన గుణపాఠం చెప్పే రోజులు వస్తాయని ఆశిస్తున్నారు అసలైన జర్నలిస్ట్ లు.