Thursday, November 28, 2024

Creating liberating content

రాజకీయాలుసకలశాఖకు సంకెళ్లు తప్పవా..?

సకలశాఖకు సంకెళ్లు తప్పవా..?

తాడేపల్లి ఫ్యాలెస్ కు ఉచ్చు బిగిస్తుందా…బిగిస్తున్నారా?
జైత్వాని కేసులో జైలు కూడు తినేదెవరు
జగనన్నకు జైత్వాని ఉసురు తగిలినట్లేనా…
అప్ప్రూవర్ గా మారింది విశాల్ గున్ని నేనా…
పిఎస్సార్, క్రాంతిరానా తాతా కు తిప్పలు తప్పవా…
గంట అర గంటలకు ఇక అదిరిపోనుందా…
దువ్వడా దువ్వెనలకు ధూమ్ ధామ్ కానుందా…
కాదంబరి కథ కడప చరిత్రను తిరగరాస్తుందా…
కుక్కల కారు కూతలే కొంపముంచాయా
వైసీపీ ఇక వై నాట్ చీఫ్ అంటారా…
కూటమి ప్రభుత్వానికి కాదంబరి కథ కేక్ లాగా అయిందా…
ఇక వైసీపీ నేతలు ఖంగుతినక తప్పదా…
కొన్నిరోజుల్లోనే కటకటాల్లోకి వెళ్లేదెవరు..
(రామమోహన్ రెడ్డి,సంపాదకులు)

రాజులు రాజ్యాలే పోయాయి..ఇక రాజకీయ పార్టీలు ఎంత.ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలే న్యాయ నిర్ణేతలు.అయితే ప్రజలు తీర్పు ఇచ్చారు కదా మనమేమీ చేసినా పట్టించుకోరన్న భావన ఎప్పుడూ కూడా సరియైనది కాదు. అలా అని ప్రజా సంక్షేమం ఇచ్చాము ఇక ప్రజలకు ప్రభుత్వం తో పనేముంది అనుకుంటే పొరపాటు. రాష్ట్ర బహుళ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని సంక్షేమం తో పాటు సంక్షోభం సృష్టించకుండా ఉండాలి. అయినా ప్రజలు ఎలా తీర్పు ఇస్తారన్నది లోగుట్టు పెరుమాళ్ళకెఱుక.ఈ నిత్య సత్యాన్ని విస్మరించిన వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తనకు వచ్చిన సువర్ణావకాశాన్ని చేతులారా వదులుకున్నట్లు అయింది. నీవు నేర్పిన విద్యే కదా నీరజాక్ష అన్నట్లు రాష్ర్ట చరిత్రలో కనివిని ఎరుగని పరిణామాలు వైసీపీ ప్రభుత్వ హయాంలో చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. కారణం నాయకుల యొక్క అతివిశ్వాసం. అవినీతికి అలవాటు పడి అనతి కాలం లోనే అత్యున్నత స్థాయికి ఎద గాలన్న అత్యాశ.దురాశ దుఃఖానికి చేటు అన్న లోకొత్తర ధర్మాన్ని విస్మరించి నాడు చేసిన తప్పిదాలు కావచ్చు, సహాయం అవ్వచ్చు అది ప్రజా క్షేత్రానికి సహేతుకంగా లేకుండా పోయింది.ఫలితంగా ఈ రోజు పార్టీ పునాదులు కే పెను ప్రమాదం వచ్చే పరిస్థితి ఏర్పడింది. ముంబై నటి కాదంబరి జైత్వాని వ్యవహారం అటు ముంబై ఇటు ఆంధ్రాని షేక్ చెస్తుంది.సమాజంలో మంచి చెడులు రెండు ఉంటాయి.ఎప్పుడు కూడా ఒకవైపే ఆలోచన చేస్తే ఎలా ఇలానే అవుతుంది. చేతులు కాలిన తరువాత ఆకులు పట్టుకున్నట్లు ఆరోజు చేసిన అనాలోచిత నిర్ణయాలు ఈరోజు అవమానకర పరిస్థితి ఎదుర్కొనేల చేస్తాయి. అధికారం నీది కాబట్టి ఆరోజు నీకు సెల్యూట్ కొట్టారు..నేడు అదే అధికారం లేదు కాబట్టి అదే తీరులో కాస్త అటు ఇటుగా వెళ్తే కటకటాలు తప్పని పరిస్థితి. ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఓ సీనియర్ జర్నలిస్టును తీసుకుని సకలము అప్పగించారు. ఆ సకలము చూసే పెద్దమనిషి కొంచెం శాంతముగా ఆలోచించలేక పోయే చివరికి సంకెళ్లు వేసుకునే పరిస్థితి దాపురించింది. దేశంలో అత్యంత ఉన్నతస్థాయి హోదా కలిగిన ఇండియన్ పోలీస్ సర్వీస్ లో ర్యాంక్ లు సాధించి ఉన్నత స్థాయి ఉద్యోగం లో ఉన్న పోలీసులు పరువు తక్కువగా ప్రవర్తిస్తుంచారనే విమర్శలు ఎదుర్కొవడం అత్యంత దయనీయం. రాజు తలుచుకుంటే కొరడా దెబ్బలు కరువా అన్నట్లు తాడేపల్లి ఫ్యాలెస్ లో రాజు ఆజ్ఞాపించారు.. సకలమంత్రి శాసించాడని చక చక జైత్వాని ని ముంబై నుంచి బెజవాడ ఇబ్రహీంపట్నం కు తీసుకవచ్చి విటీపీస్ గెస్ట్ హౌస్ లో పెట్టి ఇంటరాగేషన్ చేయడం చట్టానికి విరుద్ధం అన్న ఇంగిత జ్ఞానం లేక పోయింది. వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తరువాత గంట లు అరగంటలు వ్యవహారం చూసి కూడా ఒంటిమీద ఉన్న యూనిఫామ్ కూడా గుర్తు చేసుకోకుండా మితిమీరి ప్రవర్తించారు.ఇప్పుడు సస్పెన్స్ రేపు జైలు ఆ తరువాత బెయిల్ ఆ తరువాత కనుమరుగు.కానీ సమాజంలో ఉన్నత మైన ఉద్యోగం లో ఉన్నవారు ఈ రోజు అదే సమాజంలో ఘోరమైన తప్పిదం చేసిన అధికారులు గా వ్యవహరించారన్న అపవాదు మూట కట్టుకున్నారుగా.గతంలో వైఎస్సార్ మరణం తరువాత ఐఏఎస్ లు జైలు కు వెళ్లి వచ్చిన నేరం రుజువు కాక పోయిన ఆ పరిస్థితి లో ఎదురైన అవమానాలు పోలేదు కదా.అలానే కాదంబరి కేసు కోర్టు పరిధిలో ఎప్పుడు పరిస్కారం అవుతుందో తెలియక పోయినా తప్పు నిజంగా చేసారా లేదా అన్నది కాలమే నిర్ణయించిన ఓ కుక్కల విద్యాసాగర్ కోసం కాదంబరిని ఇబ్బంది పెట్టిన తీరు ఆక్షేపనీయమే అవుతుంది . అయితే కీలకమైన అధికారి ఆప్రూవర్ గా మారడంతో కథ అడ్డం తిరిగి నట్లయింది.ఈ కేసు ఉచ్చులో సకలశాఖ మంత్రికి గట్టిగానే సంకెళ్లు బిగిస్తారా నే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఆ తరువాత వైసీపీ అధినేత కు కూడా కాదంబరి వ్యవహారం చుట్టుముట్టే అవకాశాలు మెండుగానే కనిపిస్తున్నాయి. చూడాలి ఈ కాదంబరి జైత్వాని కథ లో కటకటాల పాలు అయ్యేది ఎందరో అన్నది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article