నాపై ట్రోలింగ్ వెనుక మా అన్నయ్య, వదిన , సజ్జల ఉన్నారని బాంబు పేల్చారు వైఎస్ షర్మిల. తాజాగా వైఎస్ షర్మిల ఓ ఛానెల్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్బంగా వైఎస్ షర్మిల మాట్లాడుతూ… వీళ్లంతా ఓ రాక్షస ముఠాను తయారు చేసి సోషల్ మీడియాలో నాపై ట్రోల్స్ చేపిస్తున్నారని ఫైర్ అయ్యారు వైఎస్ షర్మిల. ఆఖరికి రాజశేఖర్ రెడ్డి భార్యను కూడా అవమానించే స్థాయికి దిగజారారని మండిపడ్డారు వైఎస్ షర్మిల. వాళ్లు కష్టాల్లో ఉన్నప్పుడు వాళ్లకు తోడుగా ఉన్నాను అన్నారు. కానీ ఇప్పుడు నన్ను, నా కుటుంబాన్ని పక్కన పెట్టారని నిప్పులు చెరిగారు వైఎస్ షర్మిల. కనీసం నన్ను చెల్లెలుగా కూడా చూడటం లేదని చెప్పారు వైఎస్ షర్మిల. తాను ఎప్పుడు కూడా న్యాయం కోసం పని చేస్తానని వెల్లడించారు.