తుని
తొండంగి మండలం ఏవి నగరంలో శ్రీ సిద్ది సాయి బాబా బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. గ్రామంలో వెలిసిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి, శ్రీ సద్గురు షిర్డీ సాయిబాబా వారి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరిగాయి. వేకువ జాము నుంచే భక్తుల తాకిడి కనిపించింది.
ఆలయ ధర్మకర్తలు యనమల రామకృష్ణుడు సతీమణి విజయలక్ష్మి పంచామృత అభిషేకాలు జరిగాయి. భారీ సంఖ్యలో తరలివచ్చిన భక్తులు సాయిబాబాని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించారు