Saturday, November 30, 2024

Creating liberating content

తాజా వార్తలుమహా శివ‌రాత్రి బ్ర‌హ్మోత్స‌వాల‌కు శ్రీ‌శైలం సిద్ధం

మహా శివ‌రాత్రి బ్ర‌హ్మోత్స‌వాల‌కు శ్రీ‌శైలం సిద్ధం

శ్రీశైలం మహాక్షేత్రంలో మహాశివరాత్రి సందర్భంగా శుక్రవారం నుంచి 11వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా మార్చి 1వ తేదీ నుంచి 11వ తేదీ వరకు ఆలయంలోని అన్ని ఆర్జిత సేవలను, స్పర్శ దర్శనాలను రద్దు చేస్తున్నట్లు ఆలయ అధికారులు ప్రకటించారు. భక్తుల రద్దీ కారణంగా భక్తులందరికీ స్వామివారి అలంకార దర్శనానికి మాత్రమే అనుమతి ఉంటుందని ఆలయం ఈవో పెద్దిరాజు స్పష్టం చేశారు. జ్యోతిర్ముడి కలిగిన శివ స్వాములకు మాత్రమే 1వ తేదీ నుంచి 5వ తేదీ సాయంత్రం వరకు నిర్దిష్ట వేళల్లో ఉచిత స్పర్శ దర్శనానికి అవకాశం ఉంటుందని ఈవో తెలిపారు. బ్రహ్మోత్సవాలలో భక్తులకు ఉచిత దర్శనంతోపాటు శీఘ్ర, అతి శీఘ్రదర్శనానికి ఆన్‌లైన్, కరెంట్ బుకింగ్‌కి ఏర్పాట్లు చేశామని ఈవో పెద్దిరాజు తెలిపారు.
శుక్రవారం నాడు ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. శ్రీ కాళహస్తీశ్వర స్వామి దేవస్థానం అధికారులు స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. 2వ తేదీ.. భృంగీ వాహన సేవ, ప్రత్యేక సేవలు నిర్వహించనున్నారు. 3న హంస వాహన సేవ జరగనుండగా… విజయవాడ దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయం నుంచి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. 4వ తేదీ.. మయూర వాహన సేవకు కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి ఆలయం, తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. 5వ తేదీ.. రావణ వాహన సేవకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం పట్టువస్త్రాలు సమర్పించనుంది. 6న పుష్పపల్లకీ సేవ, 7న గజవాహన సేవ నిర్వహించనున్నారు. 8న మహాశివరాత్రి సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు. ప్రభోత్సవం, నంది వాహన సేవ. లింగోద్భవ కాలంలో మహారుద్రాభిషేకం, కల్యాణోత్సవం నిర్వహించనున్నారు. 9న రథోత్సవం, తెప్పోత్సవం కార్యక్రమాలు జరగనున్నాయి. 10న ధ్వజావరోహణం.. 11న అశ్వ వాహన సేవ, పుష్పోత్సవం, శయనోత్సవం కార్యక్రమాలతో శివరాత్రి బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article