పులివెందుల
కార్తీకమాసం పురస్కరించుకుని శివనామస్మరణతో శివాలయాలు భక్తులతో పోటెత్తాయి. కార్తీక మాసం చివరి సోమవారం కావడంతో వేకువ జామున నుంచి శివయ్య దర్శనం కోసం భక్తులు బారులు తీరారు.ఈ క్రమములో పట్టణ పరిధిలోని శ్రీ మిట్ట మల్లేశ్వర ఆలయం, మండల పరిధిలోని కోన గవేశ్వర స్వామి ఆలయం, గుండాలయ్య కోన పంచలింగాల కోన, అలాగే కణంపల్లి సమీపంలోని శ్రీ సిద్ధ లింగేశ్వర స్వామి ఆలయం, వేముల మండలం నల్లచెరువుపల్లి సమీపాన మోహనగిరిపై వెలసిన భైర క్షేత్రం, లింగాల మండలం పార్నపల్లి సమీపంలోని కోన మల్లేశ్వరాలయం,వేంపల్లి పంచా యతీ పరిధిలోని గవి మల్లేశ్వరాలయం,సింహాద్రిపు రం మండలం రావుల కొలను పంచాయితీ పరిధి లోని శ్రీ భాను కోట సోమేశ్వర స్వామి క్షేత్రం,తొండూ రు మండల పరిధిలోని కన్యకచెలిమి, దేవరకోన, చక్రాయపేట మండలం గండిక్షేత్రంలో వెలిసిన శివాలయాల్లో భక్తుల జన సందోహం ఎక్కువగా కనిపించింది. మహిళలు తెల్లవారుజామునే తలంటు స్నానాలు ఆచరించి దేవాలయాలలో కార్తీక దీపాలను వెలిగించి భక్తిశ్రద్ధలతో శివపార్వ తులను వేడుకొని స్వామివారికి కాయ కర్పూరం సమర్పించి తీర్థ ప్రసాదాలు అందుకున్నారు. అన్ని శివాలయాలలో భక్తులకు అన్నదాన కార్యక్రమా లు నిర్వహించారు