ఊహించని విధంగా దేశంలో సబ్బులు, కాఫీ, టీపొడి ధరలు పెరిగిపోయాయి. స్నానపు సబ్బుల ధరలను హిందుస్థాన్ యూనిలీవర్, గోద్రెజ్, విప్రో సహా అన్ని ఎఫ్ఎంసీజీ కంపెనీలు పెంచేశాయి. 7 నుంచి 8 శాతం వరకు ధరలు పెరిగాయి. సబ్బుల తయారీలో ప్రధాన ముడిపదార్థమైన పామాయిల్ ధర 35 నుంచి 40 శాతం వరకు పెరగడంతో సబ్బుల ధరలను కంపెనీలు పెంచేశాయి. ఇటీవలే కాఫీ, టీపొడి ధరలను కూడా ఎఫ్ఎంసీజీ కంపెనీలు 25 శాతం వరకు పెంచేశాయి. ప్రతికూల వాతావరణం కారణంగా ఉత్పత్తి తగ్గిపోవడంతో ధరలను పెంచాయి. కొన్ని కంపెనీలు ఒక్కసారిగా ఎనిమిది శాతం వరకు ధరలను పెంచితే.. మరికొన్ని కంపెనీలు దశలవారీగా పెంచుతున్నాయి. ఒక్కసారిగా ధరలను పెంచితే డిమాండ్ తగ్గే ప్రమాదం ఉందనే ఆలోచనతో… దశల వారీగా ధరలను పెంచాలని నిర్ణయించాయి. చర్మ సంరక్షణ క్రీమ్ ల ధరలను కూడా కంపెనీలు పెంచాయి.