మరో రెండు రోజుల్లో దసరా ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. కానీ రేపటి నుంచే భక్తులు విజయవాడకు వస్తారని అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే అన్నిరకాల ఏర్పాట్లు చేసారు అధికారులు. ఈనెల 9న మూల నక్షత్రం రోజున సీఎం చంద్రబాబు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. దుబాయి మాదిరి ఫసాడా లైటింగ్ ఈసారి ఇంద్రకీలాద్రిపై ప్రత్యేకత. క్యూలైన్లు అన్నీ పూర్తిస్ధాయిలో సిద్ధం చేసారు. ఇక ప్రతీ వందడుగులకు అత్యవసర ద్వారాలు క్యూలైన్లలో ఏర్పాటు చేసారు. అదే విధంగా మొదటిసారి భక్తుల కోసం వాటర్ బాటిళ్ళు ఏర్పాటు చేసారు. వెయ్యిమంది ఒకేసారి తమ చెప్పులు, సామాన్లు పెట్టుకోవడానికి.. భక్తుల స్నానాలకు ఘాట్ల వద్ద ప్రత్యేక ఏర్పాటు చేసారు. ఇక హోల్డింగ్ ఏరియాల వద్ద 200 మంది చొప్పున ఉండేలా ఏర్పాటు చేయగా.. శివాలయం వద్ద నుంచీ తాత్కాలికంగా బయటకు వెళ్ళే మెట్ల మార్గం ఏర్పాటు చేసారు. ప్రకాశం బ్యారేజీ మీద ఇంద్రకీలాద్రి క్షేత్ర మహిమ తెలిపేలా లేజర్ షో ఏర్పాటు చేయనున్నారు.