ఏలూరు ఎంపీ – కోటగిరి
ప్రజా భూమి, కామవరపుకోట
భారతదేశంలో రైతులను తక్షణం ఆదుకున్న ప్రభుత్వం ఏకైక ఆంధ్రప్రదేశ్లో జగన్ ప్రభుత్వమేనని ఏలూరు పార్లమెంటు సభ్యులు కోటగిరి శ్రీధర్ బాబు అన్నారు. రైతులను ఆదుకోవడం కోసం రైతు భరోసా కేంద్రాలను గిట్టుబాటు ధరలను ఏర్పాటు చేశామని రైతుల పండించిన పంటలను ఎప్పటికప్పుడు మార్కెట్కు తరలించే విధంగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు కోటగిరి చెప్పారు. అందుకుగాను మండలంలో కామవరపుకోట సొసైటీ ఆవరణలో ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేశామని, మండలంలో మరికొన్ని కేంద్రాలు ఏర్పాటు చేయడానికి అధికారి అంతరంగం సమావేశం అయిందని ఆయన అన్నారు. రైతులను మోసగించకుండగా ఎప్పటికప్పుడు రైతులను అప్రమత్తం చేయాలని దళారులు వెంట పడకుండా చూడాలని ఆయన కోరారు. మారుతున్న సమాజంలో రైతులు కూడా ఆధునిక పరిజ్ఞానం పుచ్చుకొని వ్యవసాయాన్ని లాభసాటిగా చేసుకోవాలని అందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎల్లవేళలా సిద్ధంగా ఉందని ఆయన అన్నారు . రైతులకు ఏ చిన్న ఇబ్బంది వచ్చినా ఆ ఇబ్బంది రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చినట్లుగా భావించి తక్షణమే చర్యలు చేపడుతున్నట్లు ఆయన చెప్పారు.
ఈరోజు కామవరపుకోట సొసైటీ నందు ధాన్యం కొనుగోలు సెంటర్ ను ప్రారంభించిన ఏలూరు పార్లమెంట్ సభ్యులు కోటగిరి శ్రీధర్ బాబు . అనంతరం రైతులతో చర్చించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు చింతలపూడి మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మేడవరపు అశోక్ బాబు , ఎంపీపీ మేడవరపు విజయలక్ష్మి అశోక్ శ్రీనివాసరావు, జడ్పిటిసి కడిమి రమేష్ , సొసైటీ అధ్యక్షులు సాయన కనకరాజు ,సర్పంచ్ కరిగిపోతూ అనూష భాగ్యరాజు , మండల పార్టీ అధ్యక్షులు మిడత రమేష్ , ఉప సర్పంచ్ మేడూరి రంగబాబు , వైస్ ఎంపీపీ గిరిజ గారు, స్టేట్ డైరెక్టర్ చిక్కుల శ్రీను , మండల కో ఆప్షన్ సభ్యులు కరీముల్లా , జీలకర్రగూడెం చిన్న బాబు , వ్యవసాయ శాఖ అధికారి శ్రీనివాసు మండలంలోని సర్పంచులు ఎంపీటీసీలు వైఎస్ఆర్సిపి సోషల్ మీడియా కన్వీనర్స్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు రైతులు పాల్గొన్నారు.