వేంపల్లె
విద్యార్థుల్లో నైతిక విలువలతో పాటు ఆధ్యాత్మిక చైతన్యం పెంపొందించాలని వైయస్సార్ వివేకానంద ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ సి. యోగాంజనేయులు అన్నారు. స్థానిక శ్రీ చైతన్య ఉన్నత పాఠశాలలో భగవద్గీత పారాయణం భక్తి భావంతో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమిష్టిగా గీత శ్లోకాలను పారాయణం చేసి ఆధ్యాత్మిక శ్రద్ధను చాటి చెప్పారు. ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థులకు ఎంతో అవసరం అని ఆయన తెలియజేశారు. అనంతరం భగవద్గీత యొక్క ప్రాముఖ్యతను వివరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ బి.చక్రపాణి రెడ్డి, మేనేజింగ్ డైరెక్టర్లు చేతన్ రెడ్డి, చైతన్య రెడ్డి, ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.