Monday, January 20, 2025

Creating liberating content

Uncategorizedమే 24 నుంచి శ్రీ శనీశ్వర క్షేత్రం తృతీయ వార్షికోత్సవాలు

మే 24 నుంచి శ్రీ శనీశ్వర క్షేత్రం తృతీయ వార్షికోత్సవాలు

రామచంద్రపురం

మే 24 వైశాక బహుళ పాడ్యమి నుంచి 26వ తేదీ వరకు రామచంద్రపురం మండలం రాయలచెరువు పంచాయితీ చాయాపురంలో వెలిసి ఉన్న శ్రీ శనీశ్వర ఆలయం తృతీయ వార్షికోత్సవాలు ఘనంగా జరుగుతాయని ఆలయ ధర్మకర్త ఉంగరాల సుబ్రమణ్య శర్మ తెలియజేశారు. సోమవారం శ్రీ శనీశ్వర స్వామి ఆలయంలో ఆలయం తృతీయ వార్షికోత్సవం కరపత్రాలను భక్తులతో కలిసి ఆలయ ధర్మకర్త ఉంగరాల సుబ్రమణ్య శర్మ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శుక్రవారం ఉదయం గోపూజ, ధ్వజారోహణం, శాంతి పూజలు జరుగుతాయని, శనివారం తైలాభిషేకం, పంచామృతాభిషేకం, శాంతి హోమాలు, శ్రీ అభయ ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తామని, చివరి రోజు ఆదివారం విశేష పూజలు శాంతి హోమాలు, చండీ హోమం, ద్వజవరోహణం జరుగునని, ప్రతిరోజు మధ్యాహ్నం అన్నదాన వితరణ కార్యక్రమం, హరికథ, భజనలు, సాంస్కృతిక కార్యక్రమం జరుగునని, భక్తులందరూ విశేష పూజా కార్యక్రమాలలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article