అనంతపురము
స్థానిక మహిళ బలిజ సంఘం ఆధ్వర్యంలో శ్రీకృష్ణదేవరాయలుకు ఘనంగా నివాళులర్పించారు. ఆ సంఘం అధ్యక్షురాలు పాల గిరిజా కుమారి నేతృత్వంలో శుక్రవారం ఆ సంఘం సభ్యులతో కలిసి నడిమి వంక వద్ద వున్న శ్రీకృష్ణదేవరాయలు విగ్రహానికి పూలమాలలు వేసి, శ్రీ కృష్ణదేవరాయలు కీర్తిని, ప్రజా సేవలను కొనియాడుతూ నినాదాలు చేశారు. కరతాళ ధ్వనులతో నివాళులు అర్పించారు. స్వీట్స్ పంచుకున్నారు. ఈ సందర్భంగా అధ్యక్షురాలు పాల గిరిజా కుమారి, సంఘం కార్యదర్శి వెంకట మల్లెల సుజాత మాట్లాడుతూ, శ్రీకృష్ణదేవరాయలు పాలనా దక్షత, సేవా నిరతిని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మహిళలు శ్రీమతులు భాగ్యలక్ష్మి, రాధ, సురేఖ,సుజాత,చంద్రకళ,రమాదేవి, విజయలక్ష్మి, చామండేశ్వరి, శ్యామల, శ్రీదేవి, సాయిలక్ష్మి, రాపా రాధ, లక్ష్మిలీల, రేఖ, కృష్ణవేణి, స్వాతి, మహేశ్వరి పాల్గొన్నారు.