Thursday, November 28, 2024

Creating liberating content

తాజా వార్తలుకల్పవృక్ష వాహనంపై శ్రీ రాజమన్నార్‌ అలంకారంలో శ్రీనివాసుడి వైభవం

కల్పవృక్ష వాహనంపై శ్రీ రాజమన్నార్‌ అలంకారంలో శ్రీనివాసుడి వైభవం

చంద్రగిరి:శ్రీనివాస మంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో నాలుగో రోజైన ఆదివారం ఉదయం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీనివాసుడు శ్రీ రాజగోపాలస్వామివారి అలంకారంలో చర్నాకోలు , దండం ధరించి కల్పవృక్ష వాహనంపై భక్తులను కటాక్షించారు.ఉదయం 8 గంటలకు స్వామివారు నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు.

వాహనం ముందు భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి వాహనసేవ కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయంలోని కళ్యాణ మండపం లో స్వామి, అమ్మవార్లకు స్నపన తిరుమంజనం(పవిత్ర స్నానం)
శాస్త్నోక్తంగానిర్వహించారు.ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 12:00 వరకు ప్రధాన కంకణభట్టర్‌
శేషాచార్యులు ఆధ్వర్యంలో ఈ విశేష ఉత్సవం నిర్వహించారు. ఇందులో ముందుగా విష్వక్సేనారాధన, పుణ్యహవచనం, నవకలశాభిషేకం, రాజోపచారం నిర్వహించారు.

అనంతరం ఛత్ర ఛామర వ్యజన దర్పణాది నైవేద్యం, ముఖ ప్రక్షాళన, ధూపదీప నైవేద్యం చేపట్టారు. అర్ఘ్యపాద నివేదనలో భాగంగా పాలు, పెరుగు,తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, గంధంతో స్నపనం నిర్వహించారు.ఈ సందర్భంగాతైత్తరీయ ఉపనిషత్తు, పురుషసూక్తం, శ్రీసూక్తం, భూసూక్తం, నీలాసూక్తం, పంచశాంతి మంత్రములు, దివ్యప్రభందములోని అభిషేక సమయంలో అనుసంధానము చేసే పాశురాలను అర్చకులు పఠించారు. ఈ వేడుకలో ఒకో క్రతువులో ఒక మాల వంతున రోజా, తామ‌ర‌, రోజ్ పెట‌ల్స్‌, రంగురంగుల ఆర్కిడ్ పుష్పాలు, వ‌ట్టి వేరు, తుల‌సి వంటి ఏడు రకాల మాలలను స్వామి, అమ్మవార్లకుఅలంకరించారు.సాయంత్రం 5నుండి 6గంటల వరకు ఊంజల్ సేవ వైభవముగా నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో ఆలయ ప్రత్యేకాధికారి మరియు సి పి ఆర్ ఓ డాక్టర్ టి .రవి, ప్రత్యేక శ్రేణి డిప్యూటీ ఈవో వరలక్ష్మి, ఏఈఓ గోపీనాథ్, వైఖనస ఆగమ సలహాదారులు మోహన రంగాచార్యులు, సూపరింటెండెంట్ వెంకటస్వామి, ఆలయ అర్చకులు బాలాజీ రంగాచార్యులు, టెంపుల్ ఇన్ స్పెక్టర్ కిరణ్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article