ఏలేశ్వరం:-ప్రతిపాడు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ వరుపుల సత్యప్రభ వ్యవహార శైలిపై స్థానిక తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. 18 వ వార్డులో తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు సతివాడ రాజేశ్వరరావు (రాజు) ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షుడు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపన జరిగిన నాటి నుండి పార్టీని నమ్ముకున్న కార్యకర్తలను పక్కనపెట్టి ఇటీవల వైకాపా నుండి తెలుగుదేశం పార్టీలోకి వలస వచ్చిన నాయకులకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని ఆయన వాపోయారు.
వలస వచ్చిన నాయకులు గతంలో వైకాపా పార్టీలో ఉండి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై అనేక అక్రమ కేసులు పెట్టి వేధించారన్నారు. తాము బ్రతికినంత కాలం తెలుగుదేశం పార్టీలో ఉంటామని అన్నారు. ఇంచార్జ్ పై తొందరలోనే నారా చంద్రబాబు నాయుడుకి ఫిర్యాదు చెయ్యనున్నట్లు వారు తెలిపారు.ఈ కార్యక్రమంలో రాయడు చిన్న, బూడి సూరిబాబు, తుమ్మి విజయ్, ముచ్చి అప్పలరాజు, నిమ్మకాయల నారాయణ, వాగు రమేష్, రొట్ట వీరాజు,చింతల పాండవులు, పైల అయ్యప్ప, ఏలేశ్వరం తెలుగు దేశం పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు ఉన్నారు.