Thursday, November 28, 2024

Creating liberating content

తాజా వార్తలుచంద్రబాబు నివాసంలో కూటమి అగ్రనేతల సమావేశం

చంద్రబాబు నివాసంలో కూటమి అగ్రనేతల సమావేశం

ఎన్నికల ప్రచారం, భవిష్యత్ కార్యాచరణపై చర్చ

అమరావతి :- టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో ఉండవల్లిలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్, సిద్ధార్థ సింగ్ శుక్రవారం భేటీ అయ్యారు. వచ్చే ఎన్నికల్లో కార్యకర్తలు, నేతల సమన్వయం, ఎన్నికల ప్రచారం, భవిష్యత్ కార్యాచరణపై నేతలు చర్చించారు. సుమారు రెండు గంటల పాటు నేతల మధ్య చర్చ జరిగింది. ప్రచారం, ఎన్నికల వ్యవహారాల పరిశీలన, అవసరమైన వ్యూహాలను సిద్ధం చేసేందుకు రాష్ట్ర స్థాయి కమిటీ ఏర్పాటు చేయాలని భేటీలో నిర్ణయించారు. మూడు పార్టీల సమన్వయం కోసం బూత్ స్ధాయి నుంచి పార్లమెంట్ స్థాయి వరకు మీటింగ్ లు పెట్టుకోవాలని నిర్ణయించారు. ఓట్ల బదిలీపై క్షేత్ర స్థాయిలో ఫలితాలు సాధించేలా తీసుకోవాల్సిన చర్యలపై సమావేశంలో చర్చించారు. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో నేతలు మంచి సమన్వయంతో వెళ్తున్నారని, ఇది మంచి పరిణామం అని నేతలు అభిప్రాయపడ్డారు. గోదావరి జిల్లాల్లో జరిగిన కూటమి సభల సక్సెస్ పై సంతృప్తి వ్యక్తం చేసిన నేతలు….ఉమ్మడి సభలు కార్యకర్తలకు ఉత్సాహాన్ని ఇస్తున్నాయని అభిప్రాయపడ్డారు. సాధ్యమైనన్ని ఎక్కువ నియోజకవర్గాల్లో ఇదే తరహా ఉమ్మడి ప్రచార సభలు నిర్వహించాలని నిర్ణయించారు. ప్రభుత్వం చేస్తున్న అధికార దుర్వినియోగంపై ఎప్పటికప్పుడు ఎలక్షన్ కమిషన్ కు ఉమ్మడిగా ఫిర్యాదులు చేసి, చర్యలు తీసుకునే వరకు పోరాడాలని నిర్ణయించారు. కోడ్ పక్కాగా అమలు చేసేలా…ఎన్నికల సంఘంతో నిరంతరం మాట్లాడుతూ….రియల్ టైంలో సమస్యలను ఈసీ దృష్టికి తీసుకువెళ్లేలా ప్రణాళిక రచించనున్నారు. రానున్న రోజుల్లో రాష్ట్రంలో కూటమి తరుపున ప్రచారానికి ప్రధాని మోదీతో సహా అమిత్ షా, నడ్డా, రాజ్ నాథ్ సింగ్ వంటి అగ్రనేతలను తీసుకువచ్చే అంశంపైనా చర్చజరిగింది. వారి షెడ్యూల్స్ కు అనుగుణంగా వీరంతా రాష్ట్రంలో కూటమి గెలుపుకోసం ప్రచారంలో పాల్గొంటారన్నారు. మూడు పార్టీల పొత్తును ప్రజలు స్వాగతించారని….అధికార పార్టీ చేసిన తప్పుడు ప్రచారాన్ని ప్రజలు నమ్మడం లేదని సమావేశంలో నేతలు అభిప్రాయపడ్డారు. 25 పార్లమెంట్ సీట్లు, 160 పైగా అసెంబ్లీ సీట్ల గెలుపే లక్ష్యంగా ప్రచారం, ప్రణాళిక ఉండేలా వ్యూహంతో ముందుకు వెళ్లాలని భేటీలో నేతలు నిర్ణయించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article