Wednesday, November 27, 2024

Creating liberating content

తాజా వార్తలుఆధునిక మార్పులకు అనుగుణంగా బోధన

ఆధునిక మార్పులకు అనుగుణంగా బోధన

రామచంద్రపురం

ఆధునిక మార్పులకు అనుగుణంగా విద్యా బోధన ఉండాలని జె.న్. టి. యూనివర్శిటి అనంతపురం రిజిస్ట్రార్ ప్రొఫెసర్ యస్. కృష్ణయ్య అన్నారు. రామచంద్రపురం మండలం వెంకట్రామాపురం సమీపంలోని సెవెన్ హిల్స్ ఫార్మసీ కళాశాల మరియు జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం – అనంతపురం సంయుక్తంగా ఐదు రోజుల పాటు నిర్వహించుచున్న అధ్యాపక డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జె.న్. టి. యూనివర్శిటి అనంతపురం రిజిస్ట్రార్ ప్రొఫెసర్ యస్. కృష్ణయ్య మరియు గౌరవ అతిధిగా స్విమ్స్ ఫార్కాకాలజీ విభాగాధిపతి డాక్టర్. కె. ఉమా మహేశ్వర రావు హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కృష్ణయ్య మాట్లాడుతూ అధ్యాపకులంతా నైపుణ్యంతో కూడిన విద్యపై దృష్టి సారించాలని పెర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ఉమా మహేశ్వర రావు మాట్లాడుతూ కళాశాలల ఆధ్యాపకులు తమ నైపురిక్యాలను నిరంతరం మెరుగుపరుచుకోవాలని తెలిపారుఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ యం. నిరంజన్ బాబు మాట్లాడుతూ “డిజిటల్ ఫార్మసీ పెరుగుదల – విద్య & పేషెంట్ కేర్ ను మార్చడం” అనే అంశం పై వివిధ కళాశాలల నుండి వచ్చిన అధ్యాపకులకు నేటి నుండి ఐదు రోజుల పాటు శిక్షణ తరగతులను నిర్వహిస్తామని, ఈ ప్రోగ్రాం నిర్వహించుటకు తమ కళాశాలను ఎంచుకొని గ్రాంట్ విడుదల చేసినందుకు జె.న్.టి. యునివర్శిటి అనంతపురం అధికారులకు కృతజ్ఞతలు తెలియచేసారు. ఈ కార్యక్రమానికి వివిధ కణశాలల నుండి అధ్యాపకులు, కణశాల ట్రైన్ ప్రిన్సిపాల్ ప్రనన్నరాజు, ప్రోగ్రాం కో- ఆర్డినేటర్ జ్యోతి బసిని, బోధన సిబ్బంది పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article