తొలి ఇన్నింగ్స్ లో 233 పరుగులకు ఆలౌట్ అయిన బంగ్లాదేశ్
కాన్పూర్ టెస్టులో టీమిండియా చెలరేగుతూ ఆడుతోంది. నాలుగో రోజు ఆటలో, బంగ్లాదేశ్ తమ తొలి ఇన్నింగ్స్లో 233 పరుగులకు ఆలౌట్ కావడంతో, టీమిండియా తమ ఇన్నింగ్స్ ప్రారంభించింది. రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్ చెలరేగిపోగా, టీమిండియా కేవలం 18 బంతుల్లోనే 50 పరుగులు చేసి ఇంగ్లండ్ జట్టు రికార్డును బద్దలు కొట్టింది. ఇంతకుముందు ఈ రికార్డు 26 బంతుల్లో ఇంగ్లండ్ పేరిట ఉండేది.కెప్టెన్ రోహిత్ శర్మ 11 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్సర్లతో 23 పరుగులు చేసి అవుటయ్యాడు. యశస్వి జైస్వాల్ 63 పరుగులతో మెరుగైన ఫామ్లో ఉన్నాడు, అతనితో పాటు శుభ్ మాన్ గిల్ 11 పరుగులతో క్రీజులో ఉన్నాడు. టీమిండియా 10 ఓవర్లలో 1 వికెట్ నష్టానికి 99 పరుగులు చేసింది.