ప్రజా సమస్యలపై ప్రత్యేక దృష్టి
ప్రజా దర్బార్ లో ఎంపీ అవినాష్ రెడ్డి
పులివెందుల టౌన్
ప్రజా సమస్యలపై ప్రత్యేక దృష్టి సాధించడమే వైకాపాలక్ష్యమని ఎంపీ అవినాష్ రెడ్డి అన్నారు. సోమవారం ఆయన నివాస ప్రాంగణంలో ప్రజాదర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. పులివెందుల నియోజకవర్గం ప్రజలు ఇతర ప్రాంతాల ప్రజలు ఆయనను కలిసి వినతిపత్రాలను అందజేశారు. మరి కొంతమంది సమస్యలను ఆయనకు నేరుగా వివరించారు. ఆయన వారి సమస్యలను సావాదానంగా విని వారి సమస్యలను పరిష్కరింపజేసేందుకు కృషి చేస్తా అన్నారు. మరి కొంతమంది సమస్యలను అధికారులతో శరవాణిలో మాట్లాడి పరిష్కరింపజేశారు. గ్రూప్ ఆఫ్ టెంపుల్స్ చైర్మన్ చింతకుంట సుధాకర్ రెడ్డి రంగనాథ స్వామి, తూర్పు ఆంజనేయ స్వామి, పరమట ఆంజనేయస్వామి గుడి సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో విఫలమైందన్నారు. ఉచిత బస్సు ప్రయాణం, నిరుద్యోగ భృతి లాంటి పథకాలను కూటమి ప్రభుత్వం పక్కనపెట్టిందన్నారు.