భూమిలేని పేదలకు ప్రభుత్వ భూములు పంచాలి సిపిఎం జిల్లా కార్యదర్శి ఏ రవి డిమాండ్
సిపిఎం టీ. నర్సాపురం మండల మహాసభలో పిలుపు.
టి.నరసాపురం.
మండలంలో అసైన్డ్, సీలింగు మరియు ఇరిగేషన్ భూములు పేదలకు పంచాలని సిపిఎం జిల్లా కార్యదర్శి ఏ. రవి డిమాండ్ చేశారు. శుక్రవారం నాడు టీ నర్సాపురం మండలం మహాసభ ఏ ఎస్ ఆర్ నగర్ మెట్టపై అనుమాలు మురళి, మడకం సుధారాణి, సరియం దుర్గమ్మ అధ్యక్షతన జరిగింది.
ఈ మహాసభకు ముఖ్యఅతిథిగా హాజరైనజిల్లా కార్యదర్శి ఏ.రవి మాట్లాడుతూ మండలంలో పేదల సాగు చేసుకున్న భూములకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. గత 25 ఏళ్ల పై నుండి ఈ ప్రాంతంలో గిరిజనులు, దళితులు, పేదలు, భూములు కోసం పోరాడుతున్న ప్రభుత్వాలు పట్టించుకోవడంలేదని మండిపడ్డారు. నూతనంగా ఏర్పడిన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అయినా పేదల సాగు చేస్తున్న భూములకు పట్టాలు ఇవ్వాలని కోరారు. ఎర్రకాలువ ఇరిగేషన్ భూముల్లో సాగు చేసుకుంటున్నా వారికి ఎక్సెల్ పట్టాలి వాళ్ళని డిమాండ్ చేశారు. ఎస్సార్ నగర్ మెట్టపై ఇల్లు నిర్మించుకొని నివాసం ఉన్న పేదలకు,ఇళ్ల స్థలాలకు పట్టాలు ఇవ్వాలని, వారికి కనీస సౌకర్యాలైన మంచినీరు, విద్యుత్తు సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. రామమ్మగూడెం గిరిజనులు సాగు చేసుకుంటున్న భూములకు రక్షణ కల్పించాలని, దళితులు గిరిజన పై జరుగుతున్న దాడులను ఖండించాలని కోరారు. ఈ పోరాటాల్లో ప్రజలను ఐక్యంగా సిద్ధపడాలని రావాలని కోరారు. ఈ మండలంలో దళితులు గిరిజనుల నిష్పత్తి ప్రకారం అర్హులైన పేదలందరికీ హక్కులు కల్పించాలని డిమాండ్ చేశారు. దళితవాడలో స్మశాన భూములు సమస్యలు, కనీస సౌకర్యాల సమస్యలను ప్రభుత్వాలు పరిష్కరించడంలో లోపం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. పాలకులు విధానాల వలన ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని మండిపడ్డారు. రానున్న కాలంలో ఈ ప్రాంతంలో సిపిఎం పార్టీలోకి ప్రజలందరూ రావాలని ప్రజా సమస్యలపై నికరంగా పోరాడుతున్న సిపిఎం ను ఆదరించాలని కోరారు. డిసెంబర్ 13 14 15 తేదీల్లో జరుగుతున్న సిపిఎం జిల్లా మహాసభలను జయప్రదం చేయాలని,ఆ మహాసభలకు వేలాదిగా తరలిరావాలని 13వ తేదీ జరుగుతున్న బహిరంగ సభను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.అనంతరం జిల్లా కమిటీ సభ్యులు గూడెల వెంకటరావు, పి రామకృష్ణ మాట్లాడుతూ పేదల సమస్యలను ప్రభుత్వాలు పరిష్కారం చేయాలని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. మహిళలకు ఉచిత బస్ సౌకర్యం,మూడు గ్యాస్ సిలిండర్లు వంటి సమస్యలతో పాటు నిరుద్యోగ సమస్యను పరిష్కరించాలని కోరారు. ఈ సమావేశంలో సుమారు 100 మంది ప్రతినిధులు హాజరయ్యారు.
ఈ సమావేశం మండల నాయకులు మడకం కుమారి, శిరీష, బుద్ధుల దుర్గమ్మ, రాజు, పూసం సూర్య రావు,