Thursday, November 28, 2024

Creating liberating content

రాజకీయాలుగాయనీ కృష్ణ సింధు చేసిన తప్పేంటీ..

గాయనీ కృష్ణ సింధు చేసిన తప్పేంటీ..

కృష్ణ సింధు కన్నీటి గాధ చూడతరమా
ఆ గాయని తన గానాన్ని వినిపించడం నేరమా..
తండ్రి వారసత్వాన్ని పుణికి పుచ్చుకోవడం ఘోరమా ..
గానానికి తగినట్లు గాంభీర్యం గా ఉండటం తప్పా..
గాత్రం తో పాటు అంద చందాలుండటం ఆమె లోపమా..
అందరితో కలివిడిగా ఉండటం కూడా ఆమె పాపమా..
అందరిని ఆకట్టుకోవడం అపచారమా..
ఆ దేశాన్ని వదిలి ఈ దేశానికి రావడం అవమానమా..
అన్ని ఈవెంట్స్ కు ఆమెను పిలవడం పొరపాటా..
అనేకమంది అభినందిస్తే ఆమె తప్పా..
అవకాశాలు దక్కించుకుంటూ ఉండటం కూడా తొందరపాటా..
ఆమె వ్యవహారశైలి పై అంత భాద దేనికోసమో
అనతి కాలంలోనే అందరి మన్ననలు పొందడం కూడా..
అందరి ఆప్యాయత కావాలనుకోవడం అపచారమా..

(రామమోహన్ రెడ్డి,సంపాదకులు)
ఏదైనా ప్రాణి, జీవి, లేదా వస్తువు యొక్క మనసుకింపైన సౌందర్యాన్ని ‘అందము’ అంటారు. శరీర అవయవ అందాన్ని మనసుతో చూస్తాము కావున ఒకే వస్తువు లేదా మనిషి యొక్క అందము ఒక్కొక్కరికి ఒక్కొక్కలా కనిపిస్తూ ఉంటుంది. ఈ విశ్వములో ఎన్నెన్నో జీవులు, ఎన్నో వస్తువులు దేని అందము దానికే గొప్ప, ప్రత్యేకము. పుష్పాల అందం అందరినీ ఆనందపరుస్తుంది.ప్రతి మనిషి, ఆడ, మగ, అందరూ అందముగా ఉండాలని అనుకుంటారు, ఉండాలని ప్రయత్నమూ చేస్తారు. అందమంటే శారీరక సౌందర్యమే కాదు, మానసికంగా పరిపక్వమూ, ఉల్లాసము కూడా ఉండాలి, అప్పుడే పరిపూర్ణమైన అందమని చెప్పబడుతుంది. ఇది భగవంతుడి సృష్టి, వారు వారు చేసుకున్న పుణ్యమో…తల్లిదండ్రులు పుణ్యమూ కావచ్చును. ఈ విషయం పై ఎవరు కుడా ఒకరిని ఇంకోకరు నిందించకూడదు అన్నది సహజ న్యాయం ఇక్కడ కృష్ణ సింధు కూడా కొంత మేర సౌందర్యం కలిగి ఉందని చెప్పాలి.ఇక్కడ ఎవరితో పోలికలు గాని నిందించడం గాని వు.పొగడ్తలు లేవు. గానం అనేది కంఠ స్వరంతో సంగీత ధ్వనులు ఉత్పత్తి చేసే ఒక కళ.

గానం చేసే వ్యక్తిని గాయకుడు లేదా గాత్రధారి అంటారు. వినసొంపుగా గానం చేసే వారిని గాన కళాకారులు అంటారు. గాయకులు సంగీత వాయిద్యాలతో తోడుగా లేదా లేకుండా పాటలు పాడుతారు. గాయకులు గాయక బృందం లేదా వాయిద్యకారుల బృందం వంటి సంగీతకారుల బృందంలో పాడటం తరచుగా జరుగుతుంది. గాయకుడు సహగాయకులతో కాక ఒంటరిగా ప్రేక్షకుల కోసం పాడితే దానిని సోలో గానం అంటారు. సోలో గానంలో ఎంతమంది సంగీత వాయిద్యకారులు సంగీతాన్ని వాయించినప్పటికి గానం చేసేది మాత్రం ఒకే ఒక్క గాయకుడు మాత్రమే.
ఇది మత భక్తి యొక్క రూపంగా, అభిరుచిగా, ఆనందం, సౌకర్యం, ఆచారం యొక్క మూలంగా, సంగీత విద్యలో భాగంగా లేదా వృత్తిగా చేయవచ్చు. గానం చేయడంలో రాణించడానికి సమయం, అంకితభావం, బోధన, క్రమమైన అభ్యాసం అవసరం. రోజూ ప్రాక్టీస్ చేస్తే, శబ్దాలు మరింత స్పష్టంగా, బలంగా మారతాయి. వృత్తిపరమైన గాయకులు సాధారణంగా వారి వృత్తిని క్లాసికల్ లేదా రాక్ వంటి ఒక నిర్దిష్ట సంగీత శైలిని ఎంచుకుంటారు, అయితే కొంతమంది వృత్తిపరమైన గాయకులు ఒకే రకం గాన కళపైనే కాక క్లాసికల్, రాక్ వంటి ఇతర గాన కళలలోను తమ గాన ప్రతిభను ప్రదర్శించి రాణించగలుగుతారు. గాన విద్యార్థులు గానం చేయుటలో మెళకువలు నేర్చుకొనుటకు సంగీత పాఠశాలలో చేరి గాత్ర బోధకుడు లేదా స్వర శిక్షకుడి నుండి గాత్ర శిక్షణ పొందుతారు. గాన శిక్షణలో రాణించిన గాన విద్యార్థులు వృత్తిపరమైన గాయకులుగా ఎదుగుతారు. కొంతమంది గానశిక్షణ తీసుకోకుండానే స్వయం అభ్యాసం ద్వారా వృత్తిపరమైన గాయకులుగా రాణించారు. ఉదాహరణకు శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం స్వయం అభ్యాసం ద్వారా గాన కళాకారుడిగా రాణించారు.ఇక్కడ కృష్ణ సింధు తండ్రి దగ్గరే గానం నేర్చుకుని వివిధ కళా వేదికల మీద తన గానాన్ని వినిపిస్తుంది. ప్రేక్షక మహాశయులు కూడా ఆదరిస్తున్నారు. ఒక వేల గానం భాగలేకపోతే అవమానిస్తారు కూడా.గాయకులు ఆదరణతో పాటు అవమానాలు కూడా స్వీకరించవలసి వస్తుంది. స్వీకరించాలి కూడా.నా ఇష్టం అంటే కుదరదు.సంగీత ప్రియులు ఒప్పుకోరు.ఇక్కడ కృష్ణ సింధు గానం బాగుంది కాబట్టే అన్ని అవకాశాలు దక్కించుకుంటూ వెళ్తుందనేది సహజంగా వినిపిస్తుంది. ఇక్కడ గంభీరంగా ఉండటం అంటే ఏది చేసినా అది తప్పు కావచ్చు ఒప్పు కావచ్చు తన ప్రయాణం లో అదురు బెదరు లేకుండా ముందుకు పోవడం.సహజంగా ఎక్కువ శాతం తప్పు చేయని వారు తమ గంభీరాన్ని ప్రదర్శిస్తారు అది ఇప్పటి రోజుల్లో సహజం అయిపోయింది.ఇక్కడ తప్పు ఒప్పులలోకి వెలితే అది చాలా సుదీర్ఘమైనది.కళారంగం కు సంధించి కృష్ణ సింధు గంభీరంగా ఉంటారన్నది వినికిడి. ఇందులో విమర్శలు కూడా బోలెడు ఉన్నాయి. అది ఆ వ్యక్తుల యొక్క ఆలోచన, స్వాభావిక లక్షణాలను బట్టి ఉంటుంది. దీనిపై న్యాయనిర్ణేతలు కౌతాళం లేరన్నది జగమెరిగిన సత్యం. ఆకర్షణ అనేది మనసును పట్టి లాగి ఉంచే ఒక భావం. అయితే ఇది భౌతికంగా ఇనుము అయస్కాంతాల మధ్య చూడవచ్చు. భూమ్యాకర్షణ అనేది కూడా భౌతికమే. అసలు ఈ సృష్టి సమస్తము ఆకర్షణా శక్తితోనే నడుస్తుంది. పంచభూతాలను పట్టి ఉంచి జీవజాలం అంతటికి ఆదారభూతం అయినది భూమ్యాకర్షణ అనే మహత్తరమైన శక్తి. ఈ భూమి సూర్యాకర్షణకి లోనై కక్ష్యలో క్రమపద్దతిలో తిరుగుతుంది. అలాగే సూర్యుడి ఆకర్షణకు లోనై నవ గ్రహాలు తిరుగుతుంటాయి. అంతరిక్షంలో చరాచరాలన్ని ఆకర్షణకి లోనై సంచరించేవే.అయితే నేటి భౌతిక ప్రపంచంలో ఆకర్షణ అనేది పెడు అర్దాలకు దారితీస్తుంది. ఆకర్షణ ఇష్టాన్నిస్తుంది ప్రేమను కాదు ఆ ఇష్టం మనసు చూసికాని రూపాన్ని లావణ్యాన్ని ఇలా ఎన్నింటినో చూసి కలుగుతుంది, అలా ఇద్దరి మనసుల ఇష్టంతో సంసారిక బంధంతో ముడిపడి నడిచేది సంసారం, ఇద్దరి సంసారం సుఖంగా సాగుతూ ఇద్దరిలో ఒక చెప్పలేని బంధం ఏర్పడితే అది అనురాగం. ఇంతే కానీ ప్రేమ వేరు.అది ఎలా ఉంటుందంటే నిన్ను ద్వేషించినా కోప్పడినా తిట్టినా ఆఖరికి దూరం పెట్టినా కూడా అవ్యాజమైన కరుణ మాత్రమే కనపడుతుంది,తరతమ బేధం లేకుండా సర్వజీవులను అదే పరమాత్మ స్వరూపంతో చూస్తుంది దాని భాష ఆనందం, దాని భావం మౌనం, దాని పని కరుణ కలిగి సర్వ జీవుల వికారాలను తగ్గించి స్వాంతన ఇవ్వడం. ఆ అనుభూతి ప్రేమ, అతి పవిత్రమైనది. లోకమంతా ముందుకు నడిచేందుకు సహాయమవుతున్న చోదక శక్తి కానీ ఇక్కడ ఇంతటి మహోన్నత మైన దానికి భిన్నంగా పరిస్థితి ఏర్పడింది. అందుకు కారకులు కూడా ఎవరికి వారే.రెండు చేతులు జోడిస్తే నే శబ్దం వస్తుంది.ఒక్క చేతితో ఏమి చేసినా అది వృధా ప్రయాస మాత్రమే. ఆ విషయాన్ని ఉభయులు చర్చించుకోవాలి.సుదీర్ఘ ఆలోచన చేయాలి. ఒక్కరిని నిందించడం సరికాదనేది మెజార్టీ ప్రజల అభిప్రాయం. ఇక ఆమెను అభినందించారు అంటే అది ఒక గాయని కృషి పట్టుదల ఎదుగుదల కావచ్చును ఆ కార్యక్రమంలో చేసిన విశేష కృషిని బట్టి అభినందిస్తారు.అది నిర్వాకుడికి ఉన్న తీరును బట్టి. ఇందులో ప్రతిభను బట్టి కూడా అభినందిస్తారు.ఈ విషయంలో కృష్ణ సింధు ను అభినందిస్తున్నారు కాబట్టే ఆఫర్ లు బోలెడు వస్తున్నాయని అనుకోవడం లో తప్పు లేదనుకుంటా.కాదని కౌతాళం లో అంటే కారణాలు కూడా చూపాల్సిన బాధ్యత కూడా ఉందనేది కళాభిమానుల వాదన కాబట్టి కళారంగం లో రాణించడం అనేది కొందరికి కష్టతరం అవ్వొచ్చు గాక కొందరికి సులభ తరం అవ్వొచ్చునేమో ఇక్కడ కౌతాళం లో ఏదయినా కష్టం కాదేమో అన్న వినికిడి బాగా ఉంది. కారణం ఇక్కడ ఉన్నదంతా కాకలు తీరిన గంటసాలలు,గాన గంధర్వులు కాబట్టి. ఏది ఏమైనా బెజవాడ కళారంగం లో జరుగుతున్న తీరు ఆక్షేపనీయం.కళారంగాన్ని భ్రష్టుపట్టిస్తున్న బడుద్దాయులపై సరైన రీతిలో బుద్ది చెప్పాల్సిన అవసరం ఎంతో ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article