చిన్న పత్రికలపై ఉన్న చిన్న చూపు దూరం కావాలి..
ఎడిటర్ ల ఆత్మ గౌరవాన్ని కాపాడుకోవాలి..
మన సంక్షేమం కోసం ముందుకు నడుద్దాం..
భవిష్యత్ కార్యాచరణ కు సిద్ధం కండి..
మీ అన్ని సమస్యలు పరిష్కారం కోసం కృషి చేస్తా..
అనేక కార్యక్రమాలు ఉండటం వల్ల రాలేక పోయా ..
మెగా వైద్య శిబిరాన్ని ప్రారంభించిన బోండా ఉమా…
చిన్న పత్రికల సత్తా చాటుదాం..
పత్రిక ల సత్తా ఏమిటో చుపిద్దాం..
నిజమైన సమాచారాన్ని చేర వేసేది చిన్న పత్రికలు..
ఘనంగా ఏడిటర్ ల ఆత్మీయ సమ్మేళనం..
అలరించిన సంగీత విభావరి..
అట్టహాసంగా హాజరైన ఆత్మీయ ఎడిటర్ లు
( విజయవాడ)
అందరు ఎడిటర్ లు ఆత్మీయతతో అడుగులు వేస్తేనే ఆశించిన స్థాయిలో అభివృద్ధి చెందుతామని ఆంద్రప్రదేశ్ పత్రికా సంపాదకుల సంఘం అధ్యక్షుడు కూర్మా ప్రసాద్ బాబు అన్నారు.ఆదివారం విజయవాడ గాంధీనగర్ వెలిగండ్ల హనుమంతరాయ గ్రంధాలయంలో ఆంద్రప్రదేశ్ లోని అన్ని దిన వార మాస పక్ష పత్రికల ఆత్మీయ సమావేశం జరిగింది.ఈ కార్యక్రమానికి ప్రజాభూమి దినపత్రిక ఎడిటర్ అంకిరెడ్డి పల్లె రామమోహన్ రెడ్డి సభాధ్యక్షత బాధ్యత వ్యవహారించారు.ఈ కార్యక్రమంలో భాగంగా మెగావైద్య శిబిరాన్ని డాక్టర్ శ్రావణ్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించగా ఈ శిబిరాన్ని విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ప్రారంభించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిప్యూటీ కలెక్టర్ బి ఆశయ్య హాజరై పత్రికా వ్యవస్థ ఎంత పటిష్టంగా ఉంటే అన్ని ప్రయోజనాలు కలుగుతాయని అన్నారు. పత్రిక లంటేనే ప్రజల సమస్యలు ఎత్తి చూపి అధికారులుకు చేరవేసేందుకు ఎంతో కృషి చేస్తారని కితాబిచ్చారు.ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం ఇంతమంది ని ఇలా ఓకే చోట చూడటం అనేది సాధారణ విషయం కాదన్నారు.ఇలాంటి కార్యక్రమంలో తనను కూడా భాగస్వామ్యం చేసి చక్కటి వాతావరణం లో ఆత్మీయులు మధ్య ఉండటం కూడా ఒక గొప్ప అనుభూతిని ఇచ్చిందని అన్నారు.ఓ వైపు సంగీతాన్ని కూడా ఏర్పాటు చేసి కనువిందు చేసి అందులో తనని కూడా పాటలు పాడేలా చేసిన సంపాదక వర్గానికి ఆయన సంతోషం వ్యక్తం చేశారు. అనంతరం మహాగణపతి పాటను పాడి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రజా భూమి క్రైం ప్రతినిధి, సింధు ఈవెంట్స్ మరియు ఎంటర్టైన్మెంట్ అధినేత కృష్ణ సింధు ఆధ్వర్యంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమములో చక్కని పాటలు పాడి అందరని ఆశ్చర్యపరిచారు ఆశయ్య.ఇక సభాధ్యక్షుడు రామమోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రారంభమైన సభను ఉద్దేశించి పత్రికా సంపాదకుల సంఘం అధ్యక్షుడు కోస్తాప్రభ ఎడిటర్ కూర్మా ప్రసాద్ బాబు మాట్లాడుతూ చిన్న పత్రికలంటే చిన్న చూపు ఉందని ఆ విధానానికి స్వస్తి పలికేందుకు అందరూ సిద్ధంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. అలాగే గత ప్రభుత్వం పత్రిక ల పై జులుం ప్రదర్శన చేసి పత్రికా రంగం కుదేలు అయ్యేలా చేసిందని కేవలం మనలో ఐక్యత లేకపోకడమే కారణమన్నారు. సీనియర్ సంపాదకులు వీర్ల శ్రీరామ్ యాదవ్ మాట్లాడుతూ అందరము ఐక మత్యముతో ముందుకు సాగుదామని అప్పుడే అన్ని సాధించు కోవచ్చని ఆయన అన్నారు. సభాధ్యక్షుడు ప్రజాభూమి ఎడిటర్ అంకిరెడ్డిపల్లె రామమోహన్ రెడ్డి మాట్లాడుతు దిగజారి పోయిన ప్రజాస్వామ్య వ్యవస్థలో పత్రికా వ్యవస్థ మరింత అట్టడుగు తొక్కివేయ బడుతుందని ఆవేదన వ్యక్తంచేశారు. సమాజానికి మూలమైన వ్యవస్థలలో నాలుగో వ్యవస్థ ఉన్నా పత్రికా వ్యవస్థ మిగిలిన మూడు వ్యవస్థ లకు సూచనలు చేసే స్థాయి నుంచి ఆ మూడు వ్యవస్థ లతోనే ముచ్చెమటలు పట్టేలా తయారు అయ్యిందని తెలిపారు.కేవలం మనలో ఉన్న అంతర్గత లోపాలు కలహాలు కారణం ఈ రోజు చిన్న పత్రికలంటే చిన్న చూపు ఉందని ఆ భావన తొలగి పోయేందుకు భవిష్యత్ కార్యాచరణ రూపొందించి ముందుకు సాగాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.గ్రేటర్ దినపత్రిక ఎడిటర్ కాకుమాను వేణు మాట్లాడుతూ రక్షణ విషయంలో కానీ ఇతర అంశాల విషయంలో వివిక్షకు గురి అవుతున్నామని ఆవేదన వ్యక్తంచేశారు. పలువురు పత్రికా సంపాదకులు తమ అమూల్యమైన సందేశం అందజేసి ఆత్మీయత చాటారు. అనేక కార్యక్రమాలు ఉన్నందున హజరు కాలేక పోతున్నా… మంత్రి కొలుసు పార్థసారథి.. కార్తీక వన సమరాధనలు అనేకం ఉండటం ఎవరి ఆహ్వానాన్ని కాదనలేని పరిస్థితి ఏర్పడిందని అందువల్ల ఇంతటి మంచి కార్యక్రమంలో పాల్గొన లేక పోయానని సమాచార శాఖా మంత్రి కొలుసు పార్థసారథి ఆయన్ను కలిసిన ఏపిఎస్ ఎస్ నాయకులతో అన్నారు.అయినప్పటికీ అన్ని సమస్యలపై సుదీర్ఘంగా చర్చించి పరిస్కారం చూపేందు కు కృషిచేస్తానని ఆయన అన్నారు. ఈసందర్భంగా ఈ ఆత్మీయ సమావేశంలో అందరి ఐక్యత చూపించి చిన్న పత్రిక ల సత్తా ఏమిటో చుపిద్దామని సంఘం నిర్ణయం తీసుకుంది.అలరించిన సంగీత విభావరి…సింధు ఈవెంట్స్ మరియు ఎంటర్టైన్మెంట్ ఆధ్వర్యంలో నిర్వహించిన సంగీత విభావరి ఎంతో ఆహ్లదకరం సాగింది. గాయకుడు మంచి సంగీతాన్ని అందిస్తున్న డిప్యూటీ కలెక్టర్ ఆశయ్య ,పాత్రికేయుడు గాయకుడు వలపర్ల సురేష్, మరో గాయకుడు లక్ష్మణ్ నాయక్, రాజా లతో ,పాత్రికేయురాలు గాయని సింధు చక్కని సంగీతాన్ని అందించినందుకు అభినందనలు తెలిపారు ఎపిఎస్ ఎస్ సంగం. ఇక భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికను రూపొందించి కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది.1 ఏదైనా ప్రభుత్వ కార్యక్రమాలు జరిగినప్పుడు పెద్ద పత్రికలకు ఇచ్చే ప్రకటనలలో కనీసం 30 శాతం అయినా చిన్న పత్రికలకు, ఎంప్యానల్ సబంధం లేకుండా యాడ్స్ ఇవ్వాలి.2 స్థానిక పత్రికలకు ప్రింటింగ్ అవసరాల నిమిత్తం 60 శాతం సబ్సిడితో రుణసదుపాయం.3. చిన్న, మధ్య తరహా పరిశ్రమల మాదిరి ప్రాంతీయ పత్రికల మనుగడ కోసం రాజధాని, మరియు అన్ని జిల్లా కేంద్రాలలో పత్రికల కార్యాలయాలు ప్రింటింగ్ యూనిట్ల స్థాపనకు సబ్సిడితో కూడిన భూ కేటాయింపు చేసి రుణాలు మంజూరు చేయాలి.4 ప్రాంతీయ పత్రికల ఎడిటర్లపై జరిగే దాడులకు నివారించడానికి ఒక ప్రత్యేక కమిటీ వేయాలి. వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలి.5 50 సంవత్సరాలు నిండిన సంపాదకులకు సీనియార్టి ప్రకారం నెలకు 15 వేలు పించన్ ఇవ్వాలి.6. అక్రిడిటేషన్ కమిటీ, దాడుల నివారణ కమిటీల్లో ఎపిఎస్ఎస్కు రాష్ట్ర, జిల్లా స్థాయిలో స్థానం కల్పించాలి.7. ప్రాంతీయ పత్రికల ఎడిటర్లకు, పబ్లిషర్స్కు ప్రత్యేకమైన గుర్తింపును ఇవ్వడంతో పాటు వాహన కొనుగోల్లులో సబ్సిడిపై రుణాలు ఇప్పించాలి..8 రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఉన్న ప్రాంతీయ పత్రికల సంపాదకులతో పాటుగా జర్నలిస్టులందరికి ఎన్టీఆర్ జర్నలిస్టు కాలనీగా నామకరణం చేసి ప్లాట్లు మంజూరు చేయాలి.9 టోల్ గేట్లు దగ్గర అక్రిటిడేట్ జర్నలిస్టుల, ఎడిటర్ల వాహనాలకు ఉచిత రాకపోకల సదుపాయం కల్పించాలి.10. రాజధాని ప్రాంతంలో ఉన్న ఎడిటర్లకు ఎన్టీఆర్ మీడియాటౌన్ షిప్ను ఏర్పాటుచేసి, అందులో ప్రింటింగ్ యూనిట్ల స్థాపనకు మరియు ఇండ్ల నిర్మాణాలకు స్థలాలను కేటాయించాలి.11 అమరావతి ప్రాంతంలో ఎడిటర్ల అసోసియేషన్కు స్థలం కేటాయించి, భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలి.12. ప్రాంతీయ పత్రిక ఎడిటర్ల పిల్లలకు కేజీ నుండి పిజి వరకు ఉచిత విద్యతో పాటు విదేశీవిద్యను అభ్యసించేందుకు కూడా రాయితీ కల్పించాలి.13. అసెంబ్లీ సమావేశాలకు పత్రికా సంపాదకులకు లాబీ, గ్యాలరీలలో శాశ్వత పాసులు ఇప్పించగలరు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జర్నలిస్టులకు, పత్రికా సంపాదకులకు అందరికి కూడా అన్ని ఏ.సి. బస్సులలో కూడా రాయితీతో కూడిన పాసులు ఇప్పించగలరు.14. డిక్లరేషన్ ప్రాంతంతో సంబంధం లేకుండా ఉమ్మడి అన్ని జిల్లాల్లో కనీసం రెండుకు తగ్గకుండా అక్రిడిటేషన్లు మంజూరు చేయాలి.15. ప్రభుత్వ కార్యాక్రమాలు జరిగే సమయంలో పాసులు మంజూరులో చిన్నపత్రికలను గుర్తించాలి.16. స్థానిక పత్రికలకు ప్రింటింగ్ అవసరాల నిమిత్తం 60 శాతం సబ్సిడితో రుణసదుపాయం కల్పించాలి.17. ఎపిఎస్ఎస్కు అక్రిడిటేషన్ కమిటీలో స్థానం కల్పించాలి…18. గత టిడిపి ప్రభుత్వంలో సమాచార శాఖ మంత్రిగా పెంచలయ్య గారు చేసిన సమయంలో చిన్నపత్రికకు నెలకు 5 వేల రూపాయలు ఇవ్వాలని జీవో విడుదల చేశారు. గత జీవోను పునరుద్దరించాలి. ప్రస్తుతం మారుతున్న కాలంతో పాటు ధరలు కూడా అధికంగా ఉండటంతో దానిని 50 వేల రూపాయలకు చూయాలి.