ఇరవై వేల రూపాయలు ఇస్తే నాలుగు పాటలంట..
మూడు వేలిస్తే రెండు పాటలు పాడుకోవచ్చుట…
తీసుకున్నది అప్పు.. తిరిగి అడిగితే పాట పాడుకోవాలట..
అప్పు ఇవ్వకపోతే తుప్పు ఊడుతుందని చెప్పడం…
అయితే ఓకే వామ్మో నీ అప్పు ఇస్తానన్న కలల అధినేత…
ఇవి రాస్తే తప్పుఅట ..కారు కూతలు కూస్తే ఒప్పుఅట…
లోపాలు ఎత్తిచూపితే అంత నొప్పేమిటో…
తప్పు చేయనప్పుడు తడబాటు తప్పుడు మాటలేల….
తాళం తెలియదు…వీరు పాడిందే గానం…
అందుకు వీరికి వీరే గాన గంధర్వులు,చాలెంజ్ సింగర్ బిరుదులిచ్చుకోవడం…
మళ్లీ రాజకీయ రంగులు వేసుకోవడం…
వారి ముఠా వారు విమర్శిస్తే నొప్పి లేదు…
బూతుమాటలన్నా దులిపేసు కుంటారు…
పత్రికలలో వాస్తవాలు వస్తే రాసిన వారు పనికిమాలిన,కో…నాకొడు.. లు అవుతారు…
భలే.. భలే… వీరి సంస్కారానికి సలామ్ కొట్టాలి…
వీరిది అహంకారమనాల…అజ్ఞాన మనాలా.. అవివేకమనాలా….
ఆ గదికుట్రలో చిక్కుకున్నారా…
అయ్యో కళ్ళుతెరవండి…మాయలో పడద్దు…
ఆపై మీ ఇష్టం…ఆ గది ఎంత పని చేస్తుందో…
నాడు దాడిచేశాడు… నేడు దాడి చేయాలని చూస్తున్నాడు
ఇదేనా ఆ గది నీతి ….
కౌతాళమా ఏమిటీ కవ్వింపులు…
విజయవాడ:కళ అనేది ఓ వరం.. కళామతల్లి వరించింది అంటే ఆ కళాకారుడు పేద వాడా,ధనికుడా…వారి కులం,వర్ణం, జాతి,మతం చూడరు.వారి కాళ్ళు మ్రొక్కి పూజిస్తారు…ఆరాధిస్తారు….హక్కున చేర్చుకుంటారు…ఇది కళల పట్ల ఆసక్తి జ్ఞానం, అభిరుచి, అనుభవం, విషయ పరిజ్ఞానం ఉన్నవారికి తెలుస్తుంది.సాధన ద్వారా కళను పొంది సద్గురువు ద్వారా సఫాస లు నేర్చుకున్న సాధకుని చిత్తము అమోఘం.గాయకులు అవ్వడము అంటే అంత ఆషామాషీ కాదు.గాత్రం గాడి తప్పితే ఆ గాయకుడు గొంతు కోసుకున్నట్లు భావిస్తారు మహనీయులు. మన దగ్గర ఆస్తులున్నాయని,అహం ఉందని,అంతా నా ఇష్టమంటే లోకం హర్శించదు.ఉచ్ఛము.. నీచము తెలిసి ఉపామానమేమిటో అవగాహన చేసుకుని, అలంకారాలు ఎన్ని రకాలో ఛందస్సు చదివి నేర్చి శృతి లయ లు చక్కగా అవపోషన చేసుకుని గానాన్ని అలపిస్తే ఆ పార్వతి పరమేశ్వరులు సృష్టి స్థితి లయకారులై నాట్య మాడుతారు. ఇలాంటివి అనేక సాహిత్యము తో కూడిన సినిమాలలో బోలెడు చుపించారు.అహం బ్రహ్మస్వమీ అన్నారు పెద్దలు.అహంతో కూడుకున్నవి కూడా తాత్కాలికమే తప్ప దీర్ఘకాలిక ప్రయోజనాలివ్వవు అన్న సూక్తి కూడా కళాతపస్వి విశ్వనాథం ఎన్నో ఉదాహరణలు చూపించారు.అయిన అదేమి పట్టక తామే కళారంగాన్ని శాసిస్తున్నామని చెప్పుకుంటూ నీతి మాలిన చర్యలు చేస్తూ కూడా పైశాచికంగా ప్రవర్తిస్తూ పబ్బం గడుపుకుంటూ జీవిస్తున్నారు కొంత మంది కళాసంస్థల అధినేతలు. అసలు కళను బ్రతికించేందుకే సంస్థ పెట్టి ఉద్దరిస్తామని చెప్పుకుంటున్న ఓ అధినేత ఓ గాయకుల దగ్గర డబ్బులు అడగడం నేరం కాకపోయింది. ఇరవై వేలు ఇచ్చి పాటలు పాడుకో అంటే పాపం కాకపోయే…అప్పు తీసుకుని తిరిగి ఇవ్వమంటే పాట పాడి సరిపెట్టుకో అంటే అన్నీ సరిచేస్తా అంటే అప్పు తిరిగి ఇస్తానంటే తప్పుకాకపోయే..బహిరంగంగా ఓ కళా సంస్థ అధినేత నీచాతి నీచంగా జీవం శైలి పై విమర్శలు చేస్తే తప్పు కాకపోయే…తానొక గాణగంధర్వుడని,చాలెంజ్ సింగర్ అని చేస్తున్న పనులు తెలిసిన తప్పుకాక పోయే…లాటరీ టికెట్లు అమ్మి బహుమతులు ఎవరికి ఇచ్చారో లేదో తెలిసిన తప్పుకాకపోయే…ఆశలు సంస్థ ల మీద కారుకూతలు బహిరంగంగా మీడియాలో చెప్పిన వారు ఎవరో తెలిసిన తప్పు కాకపోయే…కేవలం నెత్తిన చేతులు బెట్టి సంపాదించి వేల కోట్లు ఉన్నాయని వయస్సు మించిన పనులు చేస్తున్న వారెవరో తెలిసినా కూడా తప్పుకాకపోయే… చిల్లర కొట్టులో పచారి సరుకులును ఫ్యాక్ చేసే వారి దగ్గర కూలి డబ్బులు రెండు వందలు తీసుకుని పాట పాడిన విషయం తెలిసిన తప్పుకాకపోయే… అంటే మనవారు ఏది చేసిన ఆ గదిలో వారు కాబట్టి మన మదిలో అవేమి తప్పుకాకపోయే… అతన్ని ప్రోత్సహించద్దు అని తక్కువ చేసి ఓ గాయకుడిని అన్నా మన వారు కాబట్టి తప్పు కాకపోయే.. ఇలాంటి తప్పులు చేస్తూ కళామ తల్లి మూసుగులో పెద్దలుగా చెలామణి అవుతూ పేద కళా కారుల జీవితాలతో ఆడు కుంటున్న వారి తప్పులను ఎత్తి చూపితే దాడి చేస్తారు… దాడి చేయించడానికి సిద్ధమైతే..తప్పుకాకపోయే.కళా రంగంలో ముసుగులో జరుగుతున్న విషయాలను పేద కళాకారుల కు జరుగుతున్న అన్యాయాన్ని, వారి ఆవేదనను ప్రజాభూమి దినపత్రిక ఎన్నో కథనాలరూపంలో అందిస్తుంది. pbtv లో ఇంటర్వ్యూల ద్వారా తెలిపిన అవేమి చూడలేదా..లేక చూసిన వారిని ఏమి అనలేక పత్రికల వారిపై పెద్ద పెద్ద మాటలు మాట్లాడితే పారిపోయి పత్రికలు ఆపేస్తారనుకుంటే అర చేతితో సూర్యున్ని అపడడం అన్నమాట.. ఎవరు ఎన్ని కుట్రలు చేసిన ఎవరెన్ని బెదిరింపులు చేసిన దాడులకు ప్రణాళికలు వేసిన ప్రజాభూమి పేద కళాకారుల పక్షాన నిలబడి తీరుతుంది… పోరాటాలు చేస్తుంది. పక్కా సమాచారం తో న్యాయ పరమైన విధానాలతో ముందుకు పోతుంది.లోకం పోకడలు తెలియక ,ఎవరో పావులుగా ఉపయోగించుకుంటుంటే తెలుసుకోలేక పెద్ద పెద్ద పదజాలం వాడితే సత్యం చేరిగిపొదు…నిజం నిలకడ మీద తెలుస్తుంది… అన్యాయం అబ్బా అనిపించవచ్చు…న్యాయం కొంత చేదు అనిపించవచ్చు… చరిత్ర మరువరాదు..రాజులు రాజ్యాలే పోయాయి… ఈ కోట్లు ,ఆ కోట్ల వెనుక ఉన్న కుట్రలు ..ఆ గది కుయుక్తులు ఆశాశ్వితం.. ఓ కళామతల్లి ఈ కుట్రలనుండి వారిని కాపాడు…