పట్టుకోమని ఎవరో చెప్పాలంటోచ్..
పైసలిస్తే చాలండోచ్ ఏటుపోయిన పర్వాలేదోచ్
ముఖ్యమంత్రి, మంత్రుల మాటంటే లెక్క లేదోచ్
డీఎస్ఓ లే దండుగా ఉన్నారంటోచ్
సింగ్ నగర్ చిన్నోడికి చాలా మంది ఉన్నారంటోచ్
కథనాలు రాస్తే కాసులిచ్చి రాశిస్తున్నారంటారోచ్..
తప్పులు చూపిస్తే తప్పుడు కూతలు కూస్తున్నారోచ్..
కుమ్మరిపాలెంలో ఖాకీలతో కీచులాటకు కారకులెవరోచ్…
కాసులిస్చి రేషన్ కట్టలు దాటి చ్చిన కో ‘టీ’ శ్వరుడెవడోచ్..
ఖాఖీలు బోలెడు మంది ఉన్నారన్నదెవరోచ్…
ప్రభుత్వ ఆదేశాలు ఇక్కడ పనిచేయవోచ్
లారీలకు లారీలు లూటీ చేస్తున్నదెవరోచ్
సాయం అందితే లాఠీలెందుకు ఝుళిపించారోచ్..
బుడమేరు వరద ఎవరికి మేలు చేసిందోచ్..
ఏమిటండోచ్..ఈ దోబూచులాటలు..
(రామమోహన్ రెడ్డి, సంపాదకులు)
“వానొచ్చేనంటే వరదొస్తది…వయసొచ్చేనంటే వలపొస్తది..వానొచ్చేనంటే వరదొస్తది..వయసొచ్చేనంటే వలపొస్తది డం డం డిగా డిగా ఎదలో ఏదో సెగరానే వచ్చానుగా చూసేయ్ ఎగాదిగా” అనేది ఒక అందమైన మెలొడి సాంగ్. కానీ ఇక్కడ వానొచ్చెనంటే వరదొస్తదివరదోస్తదంటే వరాలు కురిసినట్టే…కాసులు గలగల మన్నట్టే..నువ్వు రెడి గా ఉంటే నేను రెడీగా ఉన్నాను.. పడి పడి చేద్దాం హడా విడి ఎవరైన కస్సుమంటే ఖాకీల పేరు చెప్పి కస్సుబుస్సు లాడిద్దాం… కాదంటే కాసులు విసిరికొడదాం…నేనైతే కొల్లగొడతా మొత్తం అంటూ మెరుపొచ్చినా మైమరపొచ్చినా అంతటితో ఆగమంటే ఆగనంటూ..వాగులు పొంగినా.. బుడమేరు ఉప్పొంగినా.. మీరెవరు శోధించినా చెప్పద్దు. మీడియా పరిశోధించనా ముష్టి పడేద్దాం అంటూ ఎవరైనా దాడులు చేయించినా మీరు మాత్రం తనిఖీలు సాగించినా కొనసాగించినా అవేమి లెక్కలోకి తీసుకోవద్దు నీకు నేనున్నా నాకు నీవున్నావంటూ రేషన్ దొంగలు నీతి లేని అధికారులు ముసుగులో ఉన్న అవినీతి దొంగలు డం డం డిగా డిగా ఎదలో ఏదో ఉందిలే రానే వచ్చారుగా చూసేసుకుందాం వాటాలు అన్న డ్యూయెట్ సాంగ్ పాడు కున్నట్లు ఉంది బియ్యం మాఫీయా తీరు.
ఉమ్మడి కృష్ణా జిల్లాలో రేషన్ బియ్యం అక్రమ రవాణా పరిస్థితి చాలా దయనీయంగా మారింది. ఉన్నతాధికారులు పేరుకే ఉన్నారని చెప్పుకోవడం తప్ప లారీలకు లారీలు ఇతర రాష్ట్రాల కు వెళ్తున్న పట్టించు కునే నాధుడు కరువయ్యారని చెప్పాలి.ఈ రేషన్ అక్రమ రవాణా దారులకు వానొచ్చినా పండుగే .. వరదలు వచ్చినా పండుగే. అసలు బుడమేరు వరదలతో బుడమేరు పరివాహక ప్రాంతాలన్ని వరద నీటితో తల్లడిల్లి పోయి త్రాగటానికి నీరు లేక తినడానికి తిండి లేక అల్లాడి పోయిన పరిస్థితి చూశాం. స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వరద పరిస్థితి చూసి పది రోజులు శ్రమించి బాధితులకు అండగా నిలిచారు.మరి బాధ్యత గల అధికారులు ఇంకెంత బాధ్యతగా ఉండాలి అంటే ఇక్కడ సమాధానం దొరకని పరిస్థితి. సర్వం కోల్పోయిన బుడమేరు బాధితులకు కాస్తంత కూడు పెడితే ఉపశమనం కల్పించాలని ముఖ్యమంత్రి ఉప్పు- పప్పు-బియ్యం సరఫరా చేశారు.దాదాపు రెండు లక్షల కుటుంబాలకు పైగా నిరాశ్రయులయ్యారు. వారందరికీ యుద్ధ ప్రాతిపదికన వందల లారీలతో వేల మంది సిబ్బంది పెట్టి పోలీసుల బందోబస్తు మధ్య సహాయక చర్యలు చేపట్టారు. అయినా భాదితుల చేతులకు అందినట్లే కానీ అవి మాఫీయా చేతుల్లోకి అట్లే వెళ్లాయి. అయితే కుమ్మరిపాలెం సెంటర్లో ఇంకా సహాయం అందలేదని నిరసన తెలపడం పోలీసులు లాఠీఛార్జ్ చేశారని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఇలాంటి పరిస్థితి రావడానికి కారణం మాఫీయా చేష్టలుడిగిన అధికారులు నీతి లేని అధికారులు తీరుతో రేషన్ బియ్యం ఎక్కడికి తరలి వెళ్ళాలో అక్కడికి తరలించారు. ఇక సింగ్ నగర్ చిన్నోడు అయితే కథనాలు వస్తుంటే జీర్ణించుకోలేక సింగ్ నగర్ లో పాత్రికేయ లు లేరా పోలీసు అధికారులు తెలుసు నేషనల్ మీడియా ముసుగులో ఉన్న నకిలీ గాడు అండగా ఉన్నాడని డాంబికాలు పలుకుతూ పబ్బం గడుపుకొంటూ పగలు రాత్రి లేకుండా రేషన్ బియ్యాన్ని పక్క రాష్ర్టాలకు తరలించి నట్లు బోలెడు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయినా అధికారులు నిద్రావస్థలో ఉన్నారా లేక అవినీతి డబ్బు మత్తులో తులతూగుతున్నారా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మరి ఇలాంటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి,మంత్రి ఎన్ని చర్యలు తీసుకుంటున్నారని చెబుతున్న ఏమి పలితం అన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.