Thursday, November 28, 2024

Creating liberating content

హెల్త్ఈ టిప్స్ ఫాలో అయితే దోమల బెడద తప్పుతుంది

ఈ టిప్స్ ఫాలో అయితే దోమల బెడద తప్పుతుంది

వర్షాకాలం దోమలు పెరగడానికి చాలా అనువైన సమయంగా చెప్తారు. నీరు ఎక్కువగా.. ఎక్కడికక్కడ నిల్వ ఉండిపోవడం వల్ల దోమలవ్యాప్తి సులువుగా పెరుగుతుంది. దోమల పెరుగుదల వల్ల డెంగ్యూ, మలేరియా వంటి ప్రాణాంతక ఆరోగ్య సమస్యలు కూడా రెట్టింపు అవుతాయి. అందుకే దోమలు కుట్టుకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే కొందరిని దోమలు ఎక్కువగా ఎటాక్ చేస్తాయి. అయస్కాంతం పెట్టినట్లు దోమలన్నీ వారిని కరిచేస్తాయి. ఆడ దోమలు వ్యాధులను వ్యాప్తి చేస్తూ.. కుడుతూ ఉంటాయి. బ్లడ్ గ్రూప్, వేసుకునే దుస్తులు, శరీరం నుంచి వెలువడే శ్వాస, చర్మంపై పేరుకుపోయిన బ్యాక్టీరియా.. ఇలా వివిధ కారణాల వల్ల దోమలు ఎక్కువగా ఎట్రాక్ట్ అవుతాయంటున్నారు నిపుణులు. ఈ కారణాలతో దోమలు మనుషులపై ఎటాక్ చేసి.. సంతానోత్పత్తికి అవసరమైన ప్రోటీన్​ను మానవ రక్తంద్వారా సేకరిస్తాయి. అయితే ఈ దోమల బెడదను తగ్గించుకునేందుకు కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలి.
కొన్ని రకాల బ్లడ్​గ్రూప్స్​ను దోమలు ఇష్టపడతాయని పలు పరిశోధనలు తేల్చాయి. O గ్రూప్, AB గ్రూప్ అంటే దోమలకు ఎక్కువ ఇష్టముంటుంది. అయితే కొన్ని సందర్భాల్లో రక్తం రకంతో సంబంధం లేకుండా కూడా దోమలు ఎక్కువగా కుట్టే అవకాశముంది. అలాగే శరీరం నుంచి విడుదలయ్యే కార్బన్ డై ఆక్సైడ్ కూడా దోమలను ఆకర్షిస్తుందట. దీనివల్ల దోమలకు వారి తలపై ఎక్కువగా తిరుగుతూ కుడతాయట. ప్రెగ్నెన్సీలో ఉన్నవారికి కూడా దోమకాటు ఎక్కువగా ఉంటుంది.ఆడదోమలు వేడికి త్వరగా వస్తాయట. వర్షాకాలం, వింటర్​లో చలిగా ఉందని ఎక్కువ మంది రూమ్​ హీటర్లు, స్వెట్టర్లు వంటివి వేసుకుంటారు. ఇవి శరీరానికి వెచ్చదనాన్ని ఇస్తాయి. అయితే ఈ తరహా పనులు దోమలను కూడా ఎక్కువగా ఎట్రాక్ట్ చేస్తాయట. చెమట కూడా దోమలను ఆకర్షిస్తుంది. స్కిన్​పై బ్యాక్టీరియా ఉంటే చర్మం నుంచి దుర్వాసన వస్తుంది. ఇది దోమలను ఎట్రాక్ట్ చేస్తుంది. బీర్, ఆల్కహాల్ తాగేవారిని కూడా దోమలు కుడతాయి.
దోమలు కుట్టకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు


తీపి, మసాలా, ఉప్పు ఎక్కువగా తీసుకుంటే దోమలు ఎక్కువగా కుడతాయని ఓ పరిశోధన తేల్చింది. కాబట్టి వీలైనంత లైట్ ఫుడ్​ని తీసుకోవాలి. ఇవి దోమలను దూరం చేయడంతో పాటు ఆరోగ్యానికి సహాయం చేస్తాయి. ముదురు రంగు దుస్తులు కూడా దోమలను ఆకర్షిస్తాయని పరిశోధనలు తేల్చాయి. కాబట్టి లైట్ కలర్ డ్రెస్​లు వేసుకోవాలి. బయటకు వెళ్లేప్పుడు దుస్తులు నిండుగా ఉండేలా చూసుకోవాలి. డ్రెస్​లకు ఓడోమస్ వంటి క్రీమ్​లు రాసుకుంటే దోమలు మీ దగ్గరకు రాకుండా ఉంటాయి. దోమల వ్యాప్తి పెరగకుండా మొక్కల దగ్గర నీటి నిల్వ లేకుండా చూసుకోవాలి. పాత టైర్లు, కొబ్బరి చిప్పల వంటి వాటిలో కూడా దోమలు తమ సంతానం అభివృద్ధి చేస్తాయి. కాబట్టి.. ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలి. వర్షాకాలంలో చలిగా ఉంటుందని కొందరు స్నానం చేయరు. కానీ ఉదయం, సాయంత్రం స్నానం చేసి ఫ్రెష్​గా ఉంటే దోమల బెడద తగ్గుతుంది. ఇంట్లోపలికి దోమలు రాకుండా నెట్స్, బెడ్ కర్టెన్స్ వంటి వాటిని ఉపయోగించవచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article