డాక్టర్ పసుపులేటి శంకర్
ఒంటిమిట్ట:
నందలూరు అరవపల్లి లోని శ్రీ భగవద్గీత కృష్ణమందిరమందు భగవద్గీత ప్రవచకులు శ్రీ అచోలి ముకుందరెడ్డి ని ఒంటిమిట్ట పోతన సాహిత్య పీఠం అధ్యక్షలు డాక్టర్ పసుపులేటి శంకర్ ఘనంగా సన్మానించారు. శ్రీకృష్ణ గీతమందిరములో ఈ నెల 4 వ తేదీ నుంచి భగవద్గీత లోని 6 వ అధ్యాయము గురించి ముకుందరెడ్డి ప్రవచనము చేశారు. చివరి రోజు ప్రవచన అనంతరం మందిర నిర్వాహకులు రిటైర్డ్ తహసీల్దార్ నాయనపల్లి జయన్న గెలివి నాగారత్నం శెట్టి విశ్రాంత భారత పురా వస్తు శాఖ ఉద్యోగి రామాంజనేయులు విశ్రాంతి మండల అభవృద్ధి అధికారి సుబ్బారాయుడు తదితరులు పాల్గొన్నారు. ప్రవచన అనంతరము భక్తులకు ప్రసాద వితరణ జరిగింది.