వాయువ్య బంగాళాఖాతంలో దానా తుఫాన్ తీవ్ర రూపం దాల్చింది. గడిచిన 6 గంటల్లో గంటకు 12 కి.మీ వేగంతో కదులుతున్న తుపాన్.. పారాదీప్ కి 210 కిమీ.. ధమ్రాకు 240 కిమీ.. సాగర్ ద్వీపానికి 310 కిమీ దూరంలో కేంద్రీకృతం అయ్యి ఉంది. ఈరోజు అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము లోపు పూరీ-సాగర్ ద్వీపం మధ్య భితార్కానికా – ధమ్రా సమీపంలో తుఫాన్ తీరం దాటే అవకాశం ఉంది.దాంతో మత్స్యకారులు వేటకు వెళ్లరాదు అని అధికారుకు ఆయాదేశాలు జారీ చేసారు. తీవ్రతుపాను ప్రభావంతో ఉత్తరాంధ్రలో వాతావరణం మేఘావృతం అయ్యింది. అందువల్ల చెదురుమదురుగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల్లోని తీర ప్రాంతం వెంబడి ఈదురుగాలులు విచ్చే అవకాశం ఉండటంతో.. ప్రజలు అప్రమత్తంగా ఉండి జాగ్రత్తలు తీసుకోవాలి అని విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది.