జగ్గంపేట :జగంపేట నియోజకవర్గం కిర్లంపూడి మండలం తామరాడ గ్రామంలో పవన్ కళ్యాణ్ గారి ప్రాయశ్చిత్త దీక్ష కు మద్దతుగా తామరాడ గ్రామంలో తుమ్మలపల్లి రమేష్ గారి ఆధ్వర్యంలో జనసైనికులు, భవానీ భక్తులు ఒంటి కాళ్లపై నిలబడి దీక్ష తీసుకుని తమ మద్దతును తెలియజేశారు. ఈ సందర్భంగా తుమ్మలపల్లి రమేష్ మాట్లాడుతూ గత ప్రభుత్వంలో జరిగిన తిరుపతి లడ్డు అపవిత్రం కారణంగా హిందూ మనో భావాలు దెబ్బతిన్నాయని, దీనిపై వెంటనే సిబిఐ ఎంక్వయిరీ వేసి జగన్ రెడ్డిని అరెస్టు చేయవలసిందిగా కోరుతున్నామని, తిరుపతి లడ్డు అపవిత్రం అయినందుకు తమ తమ నాయకుడు పవన్ కళ్యాణ్ చేస్తున్నటువంటి ప్రాయశ్చిత్త దీక్షకు మద్దతుగా గత వారం రోజుల నుంచి నియోజకవర్గంలో భారీ ఎత్తున నిరసన దీక్ష కార్యక్రమాలు చేపడుతున్నామని, ఈరోజు తామరాడ గ్రామంలో జన సైనికులు, భవానీ భక్తులు తో ఒంటి కాళ్లపై నిలబడి దీక్ష చేశామని తెలియజేశారు.. ఈ కార్యక్రమంలో కాయల మణికంఠ, సుంకర రాజు, ఎలుగుబంటి శ్రీను భవాని, సంకాబత్తుల రాంబాబు, కాయల తాతీలు, కాయల వినయ్,అప్పికొండ శివ,అడపా సతీష్,తోట శ్రీను,మొండి దుర్గ బాబు, కరణం వీరబాబు, తోటకూర శివ, ఎలుగుబంటి చిన్న , వెంకన్న, వర్రే సతీష్,సామల అన్ దుర్గబాబు,జాన్, స్వప్న, తుంపాల పండు,బండారు అశోక్, రేవూరి శీను బచ్చల రాజు , కోలమూరు బుజ్జి, సూరిబాబు ఇతరులు పాల్గొన్నారు.