టీడీపీ జనసేన శ్రేణులు హర్షాతిరేకాలు
తుని:రేపటి ఎన్నికల్లో తుని నియోజకవర్గం నుంచి జననేత్రి యనమల దివ్య ను బరిలో దింపాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించింది.తొలి జాబితాలోనే దివ్య అభ్యర్ధిత్వాని ఖరారు చేసింది.దివ్య పేరు ఖరారు కావడంతో నియోజకవర్గ తెలుగుదేశం, జనసేన శ్రేణులు హర్షాతిరేకాలు వ్యక్తం చేశాయి. దివ్యకు కంగ్రాట్స్ చెప్పేందుకు టీడీపీ జనసేన కూటమి నేతలు క్యూ కట్టారు. ఏడాది కిందట నియోజవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ బాధ్యతలను స్వీకరించిన దివ్య తొలి ప్రయత్నం లోనే పార్టీ టికెట్ పొందారు. ఇదే జోరుతో తొలి ప్రయత్నం లోనే దివ్య అసెంబ్లీ గడప ఎక్కడం ఖాయం అంటున్నాయీ టిడిపి జనసేన శ్రేణులు. తండ్రి యనమల రామకృష్ణుడు సెంటిమెంట్ ను గుర్తుకు చేస్తూ 1983లో తొలి ప్రయత్నంలో అసెంబ్లీ గడపెక్కి వరుసగా ఆరుసార్లు అప్రహిత విజయాలతో డబుల్ హ్యాట్రిక్ సాధించారని ఇదే తరహాలో యనమల దివ్య కూడా ఏకాఎకీనా అసెంబ్లీకి వెళ్లి… తుని అప్పుడు ఇప్పుడు మరెప్పటికైనా యనమల అడ్డేనని సాటి చెపుతారని పార్టీ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. ఆటు తండ్రి యనమల రామకృష్ణుడి రాజకీయ చతురత, ఇటు బాబాయ్ యనమల కృష్ణుడి రాజకీయ వ్యూహాలు,మరో పక్క పవన్ కళ్యాణ్ ఇమేజ్ తో ఓట్ల జడివానతో ప్రత్యర్థి పార్టీకి తెలుగుదేశం అభ్యర్థి యనమల దివ్య ఓటమి రుచి చూపిస్తారని పొలిటికల్ సర్కిల్లో వినిపిస్తున్న మాటలు ఇవి. పట్టు జారిన తునిలో తిరిగి పునర్వైభం తెచ్చేదిశగా తెలుగుదేశం పార్టీ ఈ పర్యాయం యనమల రామకృష్ణుడి తనయురాలు యనమల దివ్యను తెరపైకి తెచ్చింది. ఏడాది నుంచి యనమల దివ్య నియోజవర్గాన్ని చుట్టుముట్టి తన గ్రాఫ్ ను పెంచుకున్నారు. బాబాయ్ కృష్ణుడు తో కలిసి వైకాపాకు వ్యతిరేకంగా బాదుడే బాదుడు వంటి కార్యక్రమాలు నిర్వహించారు. అలాగే చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో నియోజకవర్గంలో ప్రజా ఉద్యమాలను అట్టుడిగించిన జననేత్రి దివ్య, బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమం ద్వారా తెలుగుదేశం పార్టీ సూపర్ సిక్స్ పథకాలను ప్రజల్లోకి తీసుకొని వెళ్లడంలో సఫలీకృతులయ్యారు. అదేవిధంగా మీ ఇంటికి మీ దివ్య కార్యక్రమంలో ప్రజలకు మరింత చేరువైన దివ్య సరైన నాయకిగా ప్రజల మదిలో పడ్డారు. మరోవైపు బాబాయ్ యనమల కృష్ణుడు తోడుగా నిలిచారు. టికెట్ చేజారడంతో కృష్ణుడు కాసంత నిరాశ గురైనప్పటికీ ఏమాత్రం పొరపొచ్చలు లేకుండా అన్నీ తానై యనమల దివ్యను 30 వేల మెజార్టీతో గెలిపిస్తానని బీష్మ ప్రతిజ్ఞ చేశారు. కృష్ణుడు కింగ్ కాకపోయినా ఆయన కింగ్ మేకర్. దివ్య గెలుపుకు కృష్ణుడు సంధిస్తున్న అస్త్ర శస్త్రాలు ప్రత్యర్థ పార్టీని బెంబేలు పెట్టిస్తుంది. వ్యూహకంగా ఆయన వేస్తున్న అడుగులను పసిగడుతున్న విశ్లేషకులు సైతం కృష్ణుడా మజాకా అంటుంటే దివ్య గెలుపు కోసం యనమల కృష్ణుడు చేస్తున్న పోరాటపటమ అర్థమవుతుంది. ఏది ఏమైనప్పటికీ తండ్రికి ఉన్న ప్రజా బలం, బాబాయ్ రాజకీయ ఎత్తుగడలు అన్నీ కలిసి వచ్చి యనమల దివ్య గెలుపు సునాయాసమేనని పొలిటికల్ ఎనాలిసిస్టులు అంటున్నారు