సినీ నిర్మాత సత్యారెడ్డి కీలక ప్రకటన చేశారు. నవంబర్ 29న ఉక్కు సత్యాగ్రహం చిత్రం విడుదల చేస్తున్నట్లు తెలిపారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేకంగా ఉక్కుసత్యాగ్రహం చిత్రాన్ని నిర్మించారు నటుడు, నిర్మాత సత్యారెడ్డి. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదంతో సినిమా తీశామని తెలిపారు నిర్మాత సత్యారెడ్డి. ప్రపంచ వ్యాప్తంగా 300 థియేటర్లలో సినిమా విడుదల చేస్తున్నట్లు తెలిపారు.. ఉద్యమ నేత గద్దర్ ఆఖరి చిత్రం అన్నారు.ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిర్మించామని,గద్దర్ మరణం తో సినిమా విడుదల సెన్సార్ ఆలస్యం అయ్యిందని తెలిపారు. స్టీల్ ప్లాంట్ నిర్వాసితులు ,ప్రైవేటికరణకు వ్యతిరేకంగా పోరాడేవారు ఈ సినిమాలో నటించారన్నారు నిర్మాత సత్యారెడ్డి. గద్దర్ సినిమాలో అరగంట పాటు ఉంటారని నిర్మాత సత్యారెడ్డి వివరంచారు .