స్థానికులు గృహ అవసరాలకు, కొద్ది ఇసుకను తెస్తేనే వెంటాడి పట్టుకునే అధికారులకు, అంత జరిగినప్పుడు ఆ వైపే కన్నెత్తి చూడలేదంటే!
వేలేరుపాడు:
స్థానికులు తమ తమ గృహ అవసరాలకు అరకొర ఇసుకను తెస్తుంటేనే వెంటాడి పట్టుకుని వాహనాలను చీజ్ చేసే అధికార యంత్రాంగానికి, గత సంవత్సరం భారీ ఎత్తున బడా వాహనాలలో ఇసుక తరలిపోతుంటే, కనీసం ఆ వైపు కన్నెత్తి చూడకపోవటంలో ఎవరి ఆదేశాలు పనికొచ్చాయి , అందుకు సహకరించిన అధికారులు ఎవరు అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి, జెపి గ్రూపుల పేరుతో భారీ ఎత్తున ఇసుక తరలిపోతుంటే ,అదేమిటని ప్రశ్నించే వారే కరువయ్యారంటే ఆ రోజుల్లో అధికార పార్టీ, అధికార యంత్రాంగం అండదండలు ఎంతగా ఉన్నాయో ఇట్టే అర్థమవుతుంది, ఆ సమయంలో ఆ వైపు వెళ్ళవద్దు అడ్డగించవద్దు అని ఆదేశాలను జారీ చేసిన అధికారులు ఎవరనేది ప్రశ్నార్ధకంగానే మిగిలింది, ప్రస్తుతం కోర్టుల జోక్యంతో, ఉన్నతాధికారులు ఎవరికి వారు తప్పించుకునేందుకు కోర్టు ఆదేశాలనే ఆదర్శంగా తీసుకుంటున్నారు అన్న విషయాలను మండల స్థాయి అధికారులు చర్చించుకోవడం విశేషం!
మండలంలో ఎక్కడ ఏమి జరుగుతుంది, అన్నది ఎప్పటికప్పుడు జిల్లా అధికారులకు సమాచారం అందించాల్సిన బాధ్యత మండల స్థాయి అధికారులు పైన ఉంటుంది, ఆ విషయంపై ఏ విధమైన చర్యలు తీసుకోవాల్సింది, ఆ అధికారుల ఆదేశాలు మేర అమలు చేసే బాధ్యతను కింది స్థాయి అధికారులు నిర్వహించాల్సి ఉంటుంది, ఇసుక తరలింపు సమయంలో మండల స్థాయి అధికారులు ఉన్నతాధికారులకు సమాచారం అందించలేదా? అందినా అందనట్లు ఉన్నతాధికారులు వ్యవహరిస్తున్నారా? ప్రస్తుతం ఇసుకరీచులను పరిశీలించిన జిల్లా స్థాయి అధికారులు, ఇసుక తరలిపోయిన సంగతి వాస్తవమేనన్నది అక్కడ పరిస్థితులు కళ్ళకు కట్టినట్లు కనిపిస్తుండటంతో, కోర్టుకు ఏ విధమైన నివేదికలు సమర్పిస్తారన్నది ప్రశ్నార్థకంగానే మారింది. ఆ సమయంలో పనిచేసిన అందుకు బాధ్యులైన వివిధ శాఖల మండల స్థాయి అధికారులు బలి కావాల్సిందేనా? అన్నది చర్చనీయాంశంగా మారింది. నేటి పరిశీలనలో జిల్లా స్థాయి అధికారులు ఇక్కడ ఇసుక తరలించుకు పోయింది ఎవరు? ఎప్పుడు ఆ లారీల పైన ఏమి రాసి ఉంది, అందుకు సంబంధించిన ఆధారాలు ఫోటోలు మీ వద్ద ఉన్నాయా, ఉంటే మాకు అందించండి దానినిబట్టి చర్యలు తీసుకుంటామని అక్కడికి వచ్చిన గ్రామస్తులను పాత్రికేయులను అడుగుతున్నారంటే ,మండల స్థాయి లో సంబంధిత శాఖల అధికారులు ఆ సమయంలో ఏమి చేశారన్నది ప్రశ్నార్ధకంగానే మిగిలింది, తప్పు జరిగింది ప్రభుత్వ పరంగా అయితే, బలి అయ్యేది క్రింది స్థాయి అధికారులేనా !అన్న సందేహాలు స్థానిక అధికార యంత్రాంగాన్ని కలచి వేస్తున్నాయి.