తాను డిప్రెషన్ నుంచి బయటపడటానికి భర్త రామ్ చరణ్ సాయం చేసినట్లు ఉపాసన కొణిదెల చెప్పారు. డెలివరీ తర్వాత ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నట్లు ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. తల్లి కావడమన్నది ప్రతి మహిళకు అద్భుతమైన ప్రయాణమన్నారు. చాలా మందిలాగే డెలివరీ తర్వాత తాను తీవ్ర ఒత్తిడికి లోనయ్యానని, ఆ సమయంలో చరణ్ బెస్ట్ థెరపిస్ట్‌లా వ్యవహరించారని ఆమె పేర్కొన్నారు. ఇక క్లీంకారకు జన్మనిచ్చాక తన జీవితం ఎంతో మారిందని తెలిపారు. “తల్లి కావడమన్నది ప్రతి మహిళకు అద్భుతమైన ప్రయాణం. కానీ అది ఎన్నో సవాళ్లతో కూడుకున్నది. ప్రసవానంతర డిప్రెషన్‌ను తక్కువగా అంచనా వేయలేం. అవసరమనుకుంటే నిపుణులను సంప్రదించి దాని నుంచి బయటపడాలి. చాలా మందిలాగే నేనూ డెలివరీ తర్వాత తీవ్ర ఒత్తిడికి లోనయ్యాను. అప్పుడు రాంచరణ్ నాకు ఎంతో అండగా నిలిచాడు. నాతో పాటు మా పుట్టింటికి వచ్చాడు. కూతురు క్లీంకార విషయంలో కూడా ఎంతో శ్రద్ధ వహిస్తాడు. క్లీంకార ఎన్నో విషయాల్లో తన తండ్రిని తలపిస్తుంది” అని ఉపాసన చెప్పుకొచ్చారు. పిల్లల పెంపకంలో తనకెప్పుడూ సాయం చేసే భర్త ఉన్నందుకు హ్యాపీగా ఉన్నట్లు ఉపాసన తెలిపారు.